Hyderabad, July 21: కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) ఈ రోజు తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా (BJP President) బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఈ ఉదయం చార్మినార్ (Charminar) వద్ద ఉన్న భాగ్యలక్ష్మి ఆలయంలో (Bhagyalakshi Temple) అమ్మవారిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అక్కడికి భారీ సంఖ్యలో కార్యకర్తలు వచ్చారు. ఓ కార్యకర్త ఇచ్చిన ఖడ్గాన్ని ఆయన చార్మినార్ ముంగిట ఎత్తి చూపెట్టారు. అనంతరం ర్యాలీగా బయలుదేరి అంబర్‌పేటలో మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అక్కడి నుంచి బషీర్ భాగ్ లోని కనకదుర్గ ఆలయానికి చేరుకొని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ట్యాంక్ బండ్ పై ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్, రఘునందన్ రావు, ఇతర నేతలు కిషన్ రెడ్డితో కలిసి వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
Begin my day by offering prayers to Ammavaru at the Shree Bhagyalaxmi temple in Charminar, Hyderabad.
Prayed to Mata Bhagyalaxmi for well being of all and prosperity of our state & country. pic.twitter.com/9IgzANBZn4
— G Kishan Reddy (@kishanreddybjp) July 21, 2023
బాధ్యతల స్వీకారం..
ఈ ఉదయం 11.45 గంటలకు హైదరాబాద్‌లోని నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా కిషన్ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఆ తర్వాత పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. కిషన్ రెడ్డి ఉమ్మడి రాష్ట్రంలో రెండు సార్లు, తెలంగాణ ఏర్పడిన 2014లో ఓసారి ఇప్పటికే రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా వ్యవహరించారు.