Jaipur, July 21: వరుస భూకంపాలతో రాజస్థాన్ (Rajasthan) రాజధాని జైపూర్ (Jaipur) వణికిపోయింది. ఈ తెల్లవారుజామున 4.09 నుంచి 4.26 గంటల మధ్య మూడు భూకంపాలు (Earthquakes) సంభవించాయి. రిక్టర్ స్కేలుపై వీటి తీవ్రత 3.1 నుంచి 4.22 మధ్య ఉంది. భూకంప కేంద్రం భూఉపరితలానికి 10 కిలోమీటర్ల లోతున ఉన్నట్టు అధికారులు తెలిపారు. మంచి నిద్రలో ఉన్నప్పుడు భూప్రకంపనలు రావడంతో ప్రజలు ఏం జరుగుతోందో తెలియక హడలిపోయారు. కొందరు రోడ్లపైకి పరుగులు పెట్టారు. అయితే, ఈ భూకంపాల వల్ల ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదని తెలుస్తోంది.
Three #earthquakes jolt Jaipur early today in a span of half an hour. First earth quake of magnitude 4.4 was felt at 4:09:38 am, second of magnitude: 3.1, occurred at 04:22:57 am and third time an earthquake of magnitude 3.4 occurred at 4.25:33 am pic.twitter.com/ZkhdSkZ9aS
— DD News (@DDNewslive) July 21, 2023
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)