Hyderabad, July 21: తెలంగాణలో (Telangana) ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలతో (Rains) అప్రమత్తమైన తెలంగాణ ప్రభుత్వం నిన్న స్కూల్స్ (Schools), కాలేజీలకు (Colleges) సెలవులు ప్రకటించింది. అయితే, ప్రకటన చేసే సమయంపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. అందరూ స్కూళ్లు, కాలేజీలకు వెళ్లిన తర్వాత సెలవంటూ చేసిన ప్రకటనపై తల్లిదండ్రులు (Parents), విద్యాసంస్థల యాజమాన్యాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. జోరున కురుస్తున్న వానలో చచ్చీచెడీ స్కూళ్లలో దిగబెట్టి వచ్చాక ప్రకటన చేయడాన్ని నిలదీస్తున్నారు. ఈ క్రమంలో వరంగల్‌కు చెందిన శ్రీనివాస్ అనే వ్యక్తి అయితే ఇదే విషయమై విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి నేరుగా ఫోన్ చేశాడు.
#Parents, Educational Institutions Unhappy with #Govt Over Late #Holiday #Announcement.#Schoolsholiday#KcrGovt #Telangana #Heavyrainfall #Trending #Twitter pic.twitter.com/5Tf1U47Nxi
— Journalist Salman Khan (@MOHDSAL77285017) July 20, 2023
అలా అనుకుంటే..
గురువారం ఉదయం పిల్లలు స్కూల్స్ కు వెళ్లాక.. హాలీడే ఇస్తే లాభమేంటి మేడం? అని ప్రశ్నించాడు. మంత్రి స్పందిస్తూ.. తాము రోజులానే తుంపర్లు మాత్రమే పడతాయనుకున్నామని, కానీ వర్షం పెరిగి పెద్దది కావడంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో సెలవులు ప్రకటించానని మంత్రి పేర్కొన్నారు.