New RTI Act, Road Safety- representational image.

Hyderabad, SEP 30: ట్రాఫిక్స్ రూల్స్‌ను అతిక్రమించేవారికి ఇక నుంచి భారీగా ఫైన్లు పడనున్నాయి. అక్టోబర్ 3 నుంచి హైదరాబాద్ లో కొత్త ట్రాఫిక్ రూల్స్ రానున్నాయి. అడ్డదిడ్డంగా పార్కింగ్ చేసేవారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు రోప్ పేరుతో పోలీసులు కొత్త డ్రైవ్ చేపట్టనున్నారు. పాదచారులకు ఆటంకం కలిగిస్తే భారీగా ఫైన్ వేయనున్నారు. ఇందుకోసం మార్గదర్శకాలను రిలీజ్ చేశారు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు. వీటిలో భాగంగా పాదచారులకు ఆటంకం కలిగేలా పార్కింగ్ చేస్తూ రూ.600 ఫైన్ విధించనున్నారు. సిగ్నల్స్ దగ్గర రెడ్ లైట్ (Signel Jump) దాటితే ఇకపై కఠిన చర్యలు తప్పవని ట్రాఫిక్ పోలీసులు హెచ్చరించారు.

స్టాప్ లైన్ (Stop Line) దాటి ముందుకొస్తే రూ.100 జరిమానా విధిస్తారు. ఇకపై ఫ్రీ లెఫ్ట్‌ను బ్లాక్ (Free left Block) చేసే వాహనదారులకు రూ.1000 ఫైన్ పడనుంది. ఫుట్‌పాత్‌లపై (Footpath) ఎవరైనా దుకాణదారులు వస్తువులు పెడితే వారికి కూడా ఇక నుంచి భారీ జరిమానా తప్పదు. ఫుట్ పాత్‌లను ఆక్రమిస్తున్న దుకాణాదారులకు ఇప్పటికే అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. పార్కింగ్ కోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లను కూడా చేపట్టారు. ఇక రెడ్ సిగ్నల్ దగ్గర అడ్డదిట్టంగా వాహనాలను నిలిపేవారిపై కూడా దృష్టిపెట్టారు పోలీసులు.