Hyderabad, FEB 19: సికింద్రాబాద్ కంట్మోనెంట్ భారత్ రాష్ట్ర సమితి శాసనసభ సభ్యుడు సాయన్న (72) ఆదివారం కన్నుమూశారు (Sayanna passes away). గతకొంతకాలంగా ఆయన గుండె, కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారు. షుగర్ లెవల్స్ పడిపోవడంతో కుటుంబ సభ్యులు సాయన్నను యశోద ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆయన భార్య, ముగ్గురు కుమారులు, కూతురు ఉన్నారు. 1951 మార్చి 5న సాయన్న చిక్కడపల్లిలో జన్మించారు. ఇప్పటి వరకు ఆయన ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. సాయన్న టీడీపీ తరఫున 1994, 1999, 2004, 2014 ఎన్నికల్లో గెలిచారు. 2009లో కాంగ్రెస్ (Congress) ఎమ్మెల్యే శంకరరావు చేతిలో ఆయన ఓటమి పాలయ్యారు. 2014 తర్వాత సాయన్న బీఆర్‌ఎస్ (BRS)లో చేరారు. 2018 ఎన్నికల్లో ఆయన ఆ పార్టీ తరఫునే కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.
ఎమ్మెల్యే సాయన్న అకాల మరణంపై మంత్రి కేటీఆర్ తీవ్ర సంతాపం తెలిపారు. వారిఉ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. తలసాని శ్రీనివాస్ యాదవ్ ట్విటర్‌లో స్పందించారు. ‘‘సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న అకాల మరణం బాధాకరం. ఆయన ఆత్మకు శాంతిచేకూరాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి’’ అని ట్విటర్‌లో పేర్కొన్నారు.
My wholehearted condolences to the family and friends of BRS MLA Sri @SayannaMLA Garu on his sudden demise
He was a very humble and polite leader who always toiled for the well being of people of Secunderabad Cantonment
May his soul rest in peace 🙏
— KTR (@KTRBRS) February 19, 2023
ఎమ్మెల్యే సాయన్న మరణం పట్ల టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి (Revanth reddy) దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ‘‘సాయన్న ఎంతో సౌమ్యుడు. సుదీర్ఘ రాజకీయ జీవితంలో నగర ప్రజలకు ఎనలేని సేవలందించిన కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న అకాల మరణం దిగ్భ్రాంతిని కలిగించింది. ఆయన ఆత్మకు శాంతిచేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను’’ అని రేవంత్ ట్వీట్ చేశారు.