TS's COVID Bulletin: తెలంగాణలో 33 వేలు దాటిన మొత్తం కొవిడ్ బాధితుల సంఖ్య, 20 వేలకు పైగా డిశ్చార్జ్, కొత్తగా మరో 1,178 పాజిటివ్ కేసులు నమోదుతో 12,135గా ఉన్న ఆక్టివ్ కేసులు
Coronavirus Outbreak. | (Photo Credits: Pixabay)

Hyderabad, July 11:  తెలంగాణలో కొత్తగా వచ్చే కొవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య నిన్న,మొన్నటి కంటే కొంతమేర తగ్గినా, వైరస్ ఉధృతి మాత్రం ఇంకా అలాగే కొనసాగుతుంది. గత 24 గంటల్లో కొత్తగా మరో 1178  పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో రాష్ట్రంలో మొత్తం COVID-19 బాధితుల సంఖ్య 33,402 కి చేరుకుంది.

శనివారం నమోదైన మొత్తం కేసుల్లో అత్యధికంగా 736  కేసులు ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలోనే నమోదు కాగా,  రంగారెడ్డి నుంచి 125 కేసులు , మేడ్చల్ నుంచి 101 మరియు సంగారెడ్డి నుంచి 13 కేసులు వచ్చాయి.

ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉన్నట్లు ప్రతిరోజు వచ్చే పాజిటివ్ కేసులను బట్టి తెలుస్తుంది. కరీంనగర్, జగిత్యాల,సిరిసిల్ల మరియు పెద్దపల్లి జిల్లాలను కలుపుకొని ఈరోజు 62 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

శనివారం రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 27 జిల్లాల నుంచి పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆరోగ్యశాఖ అందించిన రిపోర్ట్ ప్రకారం, ఈ ఒక్కరోజులో పాజిటివ్ కేసులు నమోదైన జిల్లాల వివరాలు ఇలా ఉన్నాయి.

Telangana's COVID Bulletin: 

Status of positive cases of #COVID19 in Telangana

మరోవైపు గత 24 గంటల్లో మరో 9 కొవిడ్ మరణాలు సంభవించాయి. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 348 కు పెరిగింది.

అలాగే, శనివారం సాయంత్రం వరకు మరో 1714 మంది మంది కోవిడ్ బాధితులు పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో 20,919 మంది కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 12,135 ఆక్టివ్ కేసులు ఉన్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది. తెలంగాణలో ఇంటి వద్దకే కరోనా కిట్, హోం ఐసోలేషన్‌లో ఉన్న వారికి ప్రభుత్వం తరఫున ఉచితంగా పంపిణీ 

గత 24 గంటల్లో ఇటీవల కాలంలోనే అత్యధికంగా 11,062 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు జరిపినట్లు వెల్లడించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 1,62,171 మందికి టెస్టులు నిర్వహించినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ పేర్కొంది.