ఛత్తీస్‌గఢ్ (Chhattisgarh) రాష్ట్రం ముంగేలి జిల్లా (Mungeli district) లోని సర్గావ్ (Sargoan) పట్టణంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఇనుము తయారీ కంపెనీ (Iron-making factory) లో పొగగొట్టం (Chimney) ప్రమాదవశాత్తు కుప్పకూలింది. ఆ సమయంలో పొగగొట్టం సమీపంలోనే పనిచేస్తున్న దాదాపు 30 మంది కూలీలు దాని కింది చిక్కుకున్నారు. ప్రమాద సమాచారం అందిన వెంటనే ఘటనా ప్రాంతానికి చేరుకున్న రెస్క్యూ టీమ్స్ సహాయక చర్యలు చేపట్టాయి. తీవ్రంగా గాయపడిన ఒక కూలీని చిమ్నీ కింద నుంచి బయటికి తీసి చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించాయి. మిగతా కూలీలను రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Under-Construction Kusum Plant Structure Collapses
Mungeli, Chhattisgarh: A major accident occurred at the under-construction Kusum plant, where more than 30 people were buried under debris due to the collapse of an under-construction chimney. Police and administrative teams are on the spot, working to rescue the people trapped… pic.twitter.com/qeSf9FMsxZ
— IANS (@ians_india) January 9, 2025
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)