Allu Arjun Pushpa 2 The Rule Trailer release(X)

Hyderabad, JAN 09: పుష్ప-2 రిలీజ్ అయి నెల రోజులు గడిచినా వసూళ్ల జాతర కంటిన్యూ అవుతోంది. తెలుగు రాష్ట్రాలతో పాటు నార్త్‌లోనూ రప్ప రప్ప వసూళ్లు రాబడుతోంది. ఎర్రచందనం లోడ్‌తో వెళ్తున్న లారీలా పుష్ప-2 (Pushpa-2) కలెక్షన్లు దూసుకెళ్తున్నాయి. ఉత్తరాదిలో ప్రతి రోజు 10 నుంచి 15 కోట్ల వరకు రాబడుతోంది. వరల్డ్ వైడ్‌గా ఇప్పటికే 1831 కోట్లు వసూలు చేసి ఇండియన్ సినిమాల్లో అత్యధిక కలెక్షన్స్ వసూలు చేసిన సినిమాల్లో టాప్ 2 గా నిలిచిన బాహుబలి 2 రికార్డ్ కూడా బద్దలు కొట్టేసాడు పుష్పరాజ్. కరెక్ట్‌గా ఇప్పుడు మరో స్టెప్ ముందుకు వేశాడు పుష్పరాజ్. జనవరి 17 నుంచి మరో 20 నిమిషాలు కొత్త ఫుటేజ్ యాడ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. దీంతో మళ్ళీ పుష్ప-2 పై (Allu Arjun Pushpa 2 Movie) దేశ వ్యాప్తంగా మరోసారి బజ్ క్రియేట్ చేసే చాన్స్ ఉంది. వరల్డ్ వైడ్ కలెక్షన్స్ లో ఇండియన్ సినిమాల లిస్ట్‌లో దంగల్ టాప్‌ వన్‌లోఉంది. ఇప్పుడు పుష్పరాజ్ చూపు దంగల్‌పై పడింది. దంగల్‌ కలెక్షన్లను బీట్ చేయాలని ట్రై చేస్తున్నాడు.

Game Changer: 'గేమ్ ఛేంజర్' బెనిఫిట్ షోకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి నిరాకరణ.. అయితే, టిక్కెట్ ధరల పెంపునకు ఓకే! 

దంగల్ సినిమా టాప్‌ వన్‌లో చేరడానికి ప్రధాన కారణం చైనా మార్కెట్ (Allu Arjun Pushpa 2 Movie in China) అని చెప్పవచ్చు. ఆ మూవీ అక్కడ ఏకంగా 1100 కోట్లు రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసి పెట్టింది. ఓవరాల్ గా దంగల్ 2000 కోట్లు వసూలు చేసింది. దశాబ్ధకాలంగా దంగల్ రికార్డ్ పదిలంగా ఉంది. ఇప్పుడు ఆ రికార్డ్ అందుకునే ఛాన్స్ పుష్పగాడికి మాత్రమే ఉంది. పుష్ప-2 మూవీని కూడా చైనాలో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. రేపో మాపో అఫీషియల్ అనౌన్స్‌మెంట్ కూడా రానుంది.

చైనాలో పుష్ప-2రిలీజ్ అయితే హిట్టు పక్కా అనే టాక్ బలంగా వినిపిస్తోంది. అందుకు కారణం లేకపోలేదు. ఎర్ర చందనాన్ని చైనా ప్రజలు పవిత్రంగా భావిస్తారు. ఇక చైనా థియేటర్లలో పుష్పరాజ్‌ దిగిపోతే కలెక్షన్లు రప్ప రప్ప రావడం ఖాయమే. అందుకే జనవరి 17 నుంచి సీన్స్ యాడ్ చేసి రిలీజ్ చేయడంతో పాటు చైనాలో కూడా సినిమా రిలీజ్ చేసి ఇంకో 150 కోట్లు వసూలు చేస్తే చాలు దంగల్ రికార్డ్ కూడా బీట్ చేసి ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కలెక్షన్స్ సాధించిన ఇండియన్ సినిమాగా పుష్ప 2 నిలుస్తుంది. చూడాలి మరి అల్లు అర్జున్ సరికొత్త రికార్డ్ సెట్ చేస్తాడా?