Vaikunta Ekadasi 2025 Wishes In Telugu:  ముక్కోటి ఏకాదశి లేదా వైకుంఠ ఏకాదశి హిందువులకు అత్యంత పరమ పవిత్రమైన పర్వదినాలలో ఒకటి ఈ రోజున ఉత్తర ద్వార దర్శనం చేసుకోవడం ద్వారా శ్రీమహావిష్ణువు ఆశీర్వాదాలను పొందవచ్చని భక్తులందరూ ప్రగాఢ విశ్వాసంగా నమ్ముతారు. ఈ సందర్భంగా తిరుమల,  భద్రాచలం, సింహాచలం, యాదగిరిగుట్ట సహా పలు వైష్ణవ దేవాలయాల్లో తెల్లవారుజామున ఉత్తర ద్వార దర్శనం నిర్వహిస్తారు. స్వామివారి ఉత్తర ద్వార దర్శనం చేసుకోవడం వల్ల మీకు జీవితంలో అనేక కష్టాలు తొలగిపోయి సకల శుభాలు జరుగుతాయని భక్తులందరూ నమ్ముతారు. అయితే ఈ వైకుంఠ ఏకాదశి పర్వదినాన మీ బంధుమిత్రులకు స్నేహితులకు శుభాకాంక్షలు తెలియజేయాలి అనుకున్నట్లయితే ఇక్కడ ఉన్నటువంటి ఫోటో గ్రీటింగ్స్ ను మీరు సోషల్ మీడియా గ్రూపుల్లో షేర్ చేయడం ద్వారా పంచుకోవచ్చు. అలాగే వారి నుంచి మీరు శుభాశీస్సులను తీసుకోవచ్చు.

మహాబుధ్ధి ర్మహావీర్యో మహాశక్తి ర్మహాద్యుతిః | అనిర్దేశ్య వపుః శ్రీమా నమేయాత్మా మహాద్రిధృక్ || అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు.

కోటి ఏకాదశులకు సమానమైన ఈ వైకుంఠ ఏకాదశి ఆ నారాయణుడి ఆశీస్సులతో ప్రజలందరూ ఆయురారోగ్యాలతో వర్ధిల్లి, వారి జీవితాల్లో కోటి కాంతులు ఇవ్వాలని కోరుకుంటూ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు

శ్రీమహావిష్ణువు ఆశీర్వాదంతో రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికీ సకల శుభాలు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రజలందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు..

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుని మంగళకరమైన దీవెనలు ప్రజలందరిపై ఉండాలని ఆ వైకుంఠనాధుని కోరుకుంటూ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు

ముక్కోటి దేవతల వైకుంఠ గమనం, శ్రీ విష్ణు భగవానుని ప్రత్యేక దర్శనం, అష్టైశ్వర్యాలు సిద్ధించే ఆశీర్వాదం.. ప్రజలందరికీ దక్కాలి గొప్ప పుణ్యం, మీకు మీ కుటుంబ సభ్యులకు వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు.!