Vaikunta Ekadasi 2025 Wishes In Telugu:  వైకుంఠ ఏకాదశి పర్వదినం శ్రీమహావిష్ణువు అత్యంత ఇష్టమైన పర్వదినాల్లో ఒకటిగా చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ దినాన ఉత్తర ద్వార దర్శనం చేసుకోవడం ద్వారా శ్రీమహావిష్ణువు ఆశీర్వాదం ప్రత్యేకంగా పొందవచ్చు. తెలుగు రాష్ట్రాలతో పాటు భారతదేశమంతటా వైష్ణవ దేవాలయాల్లో ఉత్తర ద్వార దర్శనం నిర్వహిస్తారు. ఈ పర్వదినాన భక్తులంతా ఉపవాసం చేసి శ్రీమహావిష్ణువును కొలుస్తారు ఈ రోజున దానధర్మాలు చేయడం ద్వారా జీవితంలో పడుతున్న కష్టాల నుంచి విముక్తి పొందవచ్చని పురాణాలు చెబుతున్నాయి. వైకుంఠ ఏకాదశి పర్వదినాన మీ బంధుమిత్రులకు శుభాకాంక్షలు తెలియజేయాలి అనుకున్నట్లయితే ఇక్కడ ఉన్న ఫోటో గ్రీటింగ్స్ ఉపయోగించుకోవచ్చు. వైకుంఠ ఏకాదశి పర్వదినం రోజున పెద్ద ఎత్తున వైష్ణవ దేవాలయాలకు భక్తులు తరలి వస్తారు. కనుక ఈ రోజు ఉత్తర ద్వార దర్శనం సందర్భంగా ప్రత్యేక మైన ఏర్పాటు చేస్తారు. అంతేకాదు ఈరోజు శ్రీమహావిష్ణువును దర్శించుకుంటే సకల పుణ్యాలు లభిస్తాయి అని పురాణాలు చెబుతున్నాయి ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రత్యేకంగా ఉత్తర ద్వార దర్శనం నిర్వహిస్తారు. అలాగే తెలంగాణ రాష్ట్రంలోని యాదగిరిగుట్ట భద్రాచలము అలాగే ఆంధ్రప్రదేశ్లోని సింహాచలము అన్నవరము మంగళగిరి దేవాలయాల్లో కూడా పెద్ద ఎత్తున వైకుంఠ ఏకాదశి పర్వదినం నిర్వహిస్తారు అలాగే అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి కదిరి నరసింహ స్వామి దేవాలయంలో ఉత్తర ద్వార దర్శనం ప్రత్యేకంగా నిర్వహిస్తారు ఇక్కడ కూడా భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తారు.

వైకుంఠ: పురుషః ప్రాణః ప్రాణదః ప్రణవః పృథుః ౹ హిరణ్యగర్భః శత్రుఘ్నో వ్యాప్తో వాయు రథోక్షజః ౹ తెలుగు ప్రజలందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుని మంగళకరమైన దీవెనలు రాష్ట్ర ప్రజలందరిపై ఉండాలని, వైకుంఠ నాథుడుని కోరుకుంటూ తొలి ఏకాదశి శుభాకాంక్షలు.

విష్ణుం వందే సర్వలోకైక నాథమ్! పుణ్యనదీ స్నానాలతో, ఉత్తరద్వార దర్శనాలతో ఉపవాసాలతో ఆ మహా విష్ణువును దర్శించి, పూజిస్తున్న భక్తులందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు..

నమోస్త్వనంతాయ సహస్రమూర్తయే సహస్ర పాదాక్షి శిరోరుబాహవే... సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటి యుగధారిణే నమః... సహస్రకోటి యుగధారిణే నమః ఓం నమ ఇతి... ప్రజలందరికీ పవిత్ర వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు.