New Raipur, JAN 09: ఇనుము తయారీ కంపెనీలో ఘోర ప్రమాదం జరిగింది. ముడి సరుకు నిలువ ఉంచేందుకు ఏర్పాటు చేసిన భారీ సైలో స్ట్రక్చర్ కుప్పకూలింది. ప్రమాదంలో నలుగురు కూలీలు దుర్మరణం పాలయ్యారు. తీవ్రంగా గాయపడిన మరో కూలీని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఛత్తీస్‌గఢ్ (Chhattisgarh) రాష్ట్రం ముంగేలి జిల్లా (Mungeli district) లోని సర్గావ్ (Sargoan) పట్టణంలో గురువారం మధ్యాహ్నం ఈ ఘటన చోటుచేసుకుంది.
సైలో స్ట్రక్చర్ ఒక్కసారిగా కుప్పకూలడంతో అక్కడే పనిచేస్తున్న పలువురు కూలీలు దాని కింద చిక్కుకున్నారు. కంపెనీ యాజమాన్యం పోలీసులకు సమాచారం ఇచ్చింది.
4 Killed After Silo Collapses At Chhattisgarh
#WATCH | Chhattisgarh: Silo structure of a smelting plant in Sargaon, Mungeli collapsed reportedly trapping labourers. One injured labourer has been admitted to a hospital. Police and Administration are present at the spot. Rescue operation is underway. pic.twitter.com/TVjqTX3An0
— ANI (@ANI) January 9, 2025
సమాచారం అందుకున్న రెస్క్యూ టీమ్స్ హుటాహుటిన ఘటనా ప్రాంతానికి చేరుకున్నాయి. ఒక క్షతగాత్రుడిని రక్షించి చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించాయి. ఆ తర్వాత మరో నాలుగు మృతదేహాలను వెలికితీశాయి. కాగా సైలో స్ట్రక్చర్ కింద చిక్కుకున్న మిగతా వారిని రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.