Tirupati, Jan 10: తిరుపతి (Tirupati) తొక్కిసలాట ఘటనలో గాయాలపాలై స్విమ్స్ లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను గురువారం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) పరామర్శించారు. ఈ క్రమంలో ఆసుపత్రి వద్ద పవన్ మీడియాతో మాట్లాడుతున్న సమయంలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. పవన్ ప్రసంగిస్తున్న సమయంలో ఆసుపత్రిలో ఒక్కసారిగా కోలాహలం నెలకొంది. ఈలలు, కేకలతో ఆసుపత్రి ప్రాంగణం మార్మోగిపోయింది. దాంతో పవన్ ప్రసంగం ఆపి పక్కనే ఉన్న జనసేన నేతను ఏంటది అని అడిగారు. దాంతో ఆ నేత... ఏపీ మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి వచ్చారు సార్ అని బదులిచ్చారు.
Video Here..
పవన్ ఏం చేశారు?
అది విన్న పవన్.. ఏమీ స్పందించకుండా తన ప్రసంగం కొనసాగించారు. కాగా జగన్ కూడా స్విమ్స్ లో తొక్కిసలాట బాధితులను పరామర్శించడం తెలిసిందే.