Hyderabad, AUG 13: స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా తెలంగాణవ్యాప్తంగా శనివారం నాడు ఫ్రీడం ర్యాలీలు (Freedom Rally) నిర్వహించారు అయితే మహబూబ్‌ నగర్ లో జరిగిన ఫ్రీడం ర్యాలీలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ (Minister Srinivas Goud) వ్యవహారశైలిపై విమర్శలు వస్తున్నాయి. పబ్లిక్ ప్లేస్‌ లో ఆయన గాల్లోకి కాల్పులు (Opens Fire in Air) జరిపారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌ గా (Viral video) మారింది. దీంతో ఆయన క్లారిటీ ఇచ్చారు. ఎస్పీ నుంచి తాను గన్ లాక్కోలేదన్నారు. స్వయంగా ఎస్పీయే గన్ తనకు ఇచ్చారని పేర్కొన్నారు. అది డమ్మీ, బ్లాంక్ గన్, బుల్లెట్లు ఉండవు అని అన్నారు. తనకు రైఫిల్ ఎలా వాడాలో తెలుసని చెప్పారు. కొందరు కావాలనే అసత్య ప్రచారం చేశారని తెలిపారు. మహబూబ్ నగర్ లో నిర్వహించిన ఫ్రీడమ్ ర్యాలీలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ హల్ చల్ చేశారు. పోలీసుల తుపాకీ తీసుకుని గాలిలోకి కాల్పులు జరిపారు. పోలీసులకు చెందిన ఎస్ఎల్ఆర్ వెపన్ తో గాలిలోకి కాల్పులు జరిపారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ కాలుస్తున్నా.. పోలీసులు అభ్యంతరం తెలపకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. అనంతరం ఆ ఫొటోలను తన సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేశారు. మంత్రి వ్యవహార శైలిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తున్నాయి.

దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 సంవత్సరాలు అవుతున్న శుభ సంద‌ర్భంగా భార‌త స్వాతంత్య్ర వ‌జ్రోత్స‌వాల పేరుతో తెలంగాణ ప్రభుత్వం పలు కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హిస్తున్న సంగ‌తి తెలిసిందే.

Revanth Reddy Apology to MP Komati Reddy: ఎంపీ కోమటి రెడ్డి వెంకటరెడ్డికి సారీ చెప్పిన రేవంత్ రెడ్డి, హోంగార్డు వ్యాఖ్యలపై చింతిస్తున్నట్లు ప్రకటన..  

ఇందులో భాగంగా శ‌నివారం రాష్ట్రవ్యాప్తంగా ఫ్రీడ‌మ్ ర్యాలీలు జ‌రుగుతున్నాయి. ఈ నేపథ్యంలో త‌న సొంత జిల్లా మ‌హ‌బూబ్ న‌గ‌ర్ లో జ‌రిగిన ఫ్రీడ‌మ్ ర్యాలీలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగానే ఆయ‌న పోలీసుల తుపాకీ తీసుకుని గాల్లోకి కాల్పులు జ‌రిపారు. ఈ ఫొటోలు, వీడియోల‌ను చూసిన నెటిజ‌న్లు.. పోలీసుల తుపాకీతో మంత్రి గాల్లోకి ఎలా కాల్పులు జ‌రుపుతారంటూ ట్రోల్ చేస్తున్నారు.