రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో పాలిటిక్స్ గరంగరంగా మారాయి. ముఖ్యంగా మొదట రేవంత్ రెడ్డి.. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై మాట్లాడారు. అయితే ఆయన ఒక్క రాజగోపాల్ రెడ్డిని మాత్రమే ప్రస్తావించకుండా వెంకట్ రెడ్డి పేరు కూడా వచ్చేలా పరోక్షవ్యాఖ్యలు చేశారు. దీంతో రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
రేవంత్ రెడ్డి తనను రెచ్చగొడుతున్నారంటూ వెంకట్ రెడ్డి మండిపడ్డారు. తన సోదరుడు కాంగ్రెస్ నుంచి బయటకు వెళ్తే తనను ఎలా బాధ్యుడిని చేస్తారని ప్రశ్నించారు. కోమటిరెడ్డి బ్రాండ్ కాదని బ్రాందీషాపు అని ఎలా మాట్లాడతారంటూ రేవంత్ రెడ్డిని ఏకిపారేశారు. ఈ తరుణంలో రేవంత్ రెడ్డి సైలెంట్ గా ఉంటారని అంతా భావించారు. కానీ అలా ఉంటే ఆయన రేవంత్ రెడ్డి ఎందుకు అవుతారు? ఏకంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డిని టార్గెట్ చేస్తూ ఆయన మాట్లాడారు. హోంగార్డు ఎన్నిఏళ్లు పనిచేసినా హోంగార్డుగానే ఉంటాడు కానీ సివిల్స్ రాసి ర్యాంకు కొట్టిన ఐపీఎస్ ఎస్సీ అవుతాడంటూ చురకలంటించారు. అంటే పార్టీలోకి ఎప్పుడొస్తే ఏంటి? పీసీసీ చీఫ్ అయ్యామా లేదా అన్నదే ముఖ్యమనే పాయింట్ లో వ్యంగ్యంగా మాట్లాడారు.
దీంతో అసలే కాక మీదున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డికి మరింత కోపమొచ్చింది. రేవంత్ ముఖం చూడనంటూ గట్టిగానే మాట్లారు. తనకు తెలియకుండా తన ఎంపీ నియోజకవర్గంలో మీటింగ్ పెట్టడం, జాయినింగ్స్ చేయించుకోవడం, పైగా కౌంటర్లు ఇవ్వడం.. ఇలాంటివన్నీ హైకమాండ్ దగ్గరే తేల్చుకుంటానంటూ స్పష్టం చేశారు.
అసలే మునుగోడు ఉప ఎన్నిక ముంచుకొస్తున్న టైమ్. ఈ సమయంలో ఈ రచ్చ అంతా ఎందుకు అనుకున్నారో ఏమో? ఒక్కసారిగా తెలంగాణ కాంగ్రెస్ లీడర్లు అంతా సైలెంట్ అయిపోయారు. ఈలోపే అద్దంకి దయాకర్ .. కోమటిరెడ్డి వెంకటరెడ్డికి సారీ చెప్పారు. తన వ్యాఖ్యలకు చింతిస్తున్నానని చెప్పుకొచ్చారు. అది జరిగిన 3,4 రోజులకే మళ్లీ రేవంత్ రెడ్డి నోట కూడా సారీ మాట వచ్చింది. రేవంత్ రెడ్డి కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డికి సారీ చెప్పారు.
దుబాయ్ కు రెండు రోజులు ఆలస్యంగా దీపక్ హుడా, అవేష్ ఖాన్.. ఎందుకంటే?
ముఖ్యంగా హోంగార్డులను ఉటంకిస్తూ తాను మాట్లాడిన మాటలకు రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పారు. అంతేకాదు అద్దంకి దయాకర్ సారీ చెప్పినా, ఆయన మాటలు మాత్రం తప్పేనంటూ స్పష్టం చేశారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సీనియర్ అంటూ ఆయనను ఆకాశానికెత్తేశారు. మొత్తానికి రేవంత్ రెడ్డి సారీ చెప్పడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. కాంగ్రెస్ లో రాజకీయం ఎప్పుడు ఎలా ఉంటుందో, ఎవరూ అంచనా వేయలేరని తాజా పరిణామాలతో మరోసారి స్పష్టమైంది.