Telangana Road Accident: చౌటుప్పల్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం, కూలీలతో వెళ్తున్న ఆటోను ఢీకొట్టిన బస్సు, ముగ్గురు అక్కడికక్కడే మృతి, మరికొందరికి తీవ్ర గాయాలు

తెలంగాణ యాదాద్రి జిల్లాలోని చౌటుప్పల్ వద్ద గురువారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో (Telangana Road Accident) ముగ్గురు మృతి చెందారు. కూలీలతో వెళ్తున్న ఆటోను తేజస్ ఫుడ్ ఇండస్ట్రీస్‌కు చెందిన ప్రైవేటు బస్సు ఢీకొనడంతో ప్రమాదం (Three Killed After Bus Collides With Auto) జరిగింది.

Telangana Road Accident: చౌటుప్పల్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం, కూలీలతో వెళ్తున్న ఆటోను ఢీకొట్టిన బస్సు, ముగ్గురు అక్కడికక్కడే మృతి, మరికొందరికి తీవ్ర గాయాలు
Telangana Road Accident (photo-Video Grab)

Hyd, Feb 16: తెలంగాణ యాదాద్రి జిల్లాలోని చౌటుప్పల్ వద్ద గురువారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో (Telangana Road Accident) ముగ్గురు మృతి చెందారు. కూలీలతో వెళ్తున్న ఆటోను తేజస్ ఫుడ్ ఇండస్ట్రీస్‌కు చెందిన ప్రైవేటు బస్సు ఢీకొనడంతో ప్రమాదం (Three Killed After Bus Collides With Auto) జరిగింది. పలువురికి గాయాలవడంతో వారిని స్థానికులు వెంటనే హయత్‌నగర్‌లోని సన్‌రైజ్ ఆస్పత్రికి తరలించారు. అయితే ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ముగ్గురు మృతి చెందారు.

ప్రియుడితో నగ్నంగా రూంలో అక్క ఉండగా చూసిన తమ్ముడు, తల్లిదండ్రులకు చెబుతానని బెదిరింపు, భయపడి కొడవలితో యువకుడి గొంతు కోసిన లవర్స్

మరొకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. మరో నలుగురికి వైద్యులు చికిత్స అందజేస్తున్నారు. ప్రమాద సమయంలో ఆటోలో 12 మంది కూలీలు ఉన్నారు. మృతులు దేవులమ్మ నాగారం గ్రామానికి చెందిన సిలువేరు ధనమ్మ (30), వర్గాంతం అనసూయ (50), డాకోజి ధనమ్మ (25)గా గుర్తించారు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. సీఐ మల్లికార్జున్‌ రెడ్డి, ఎస్సై సీతాపాండు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.మృతులు పారిశ్రామిక వాడలోని ఓ కంపెనీలో పనిస్తున్నారని పోలీసులు తెలిపారు.

(The above story first appeared on LatestLY on Feb 16, 2023 01:13 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).