Traffic (Photo Credit- PTI)

Hyderabad, Nov 7: హైదరాబాద్‌ లో పోలీసులు ట్రాఫిక్‌ ఆంక్షలు (Traffic restrictions) విధించారు. నగరం నడిబొడ్డున ఉన్న ఎల్బీ స్టేడియంలో (LB Stadium) మంగళవారం మధ్యాహ్నం బీజేపీ బహిరంగ సభ నిర్వహించనుంది. దీనికి ప్రధాని మోదీ (PM Modi) హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు అధికారులు ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. ఆ సమయంలో ఎల్బీ స్టేడియం చుట్టుపక్కన ప్రాంతాల్లో రహదారుల మూసివేత, దారిమళ్లింపులు ఉంటాయని వెల్లడించారు. ఈ నేపథ్యంలో వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని సూచించారు.

Narendra Modi to Hyderabad: నేడు హైదరాబాద్‌ కు ప్రధాని మోదీ.. సాయంత్రం గం. 5.05 లకు బేగంపేట విమానాశ్రయానికి ప్రధాని.. 5.30-6.10 గంటల మధ్య ఎల్బీ స్టేడియంలో బహిరంగసభ.. హాజరవనున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్.. పూర్తి షెడ్యూల్ ఇదిగో!

ఈ మార్గాల్లో ఆంక్షలు..

  • ఏఆర్‌ పెట్రోల్‌ పంప్‌ జంక్షన్‌ నుంచి బీజేఆర్‌ విగ్రహం వైపు ట్రాఫిక్‌ కు అనుమతి ఉండదు.
  • వాహనాలను నాంపల్లి, రవీంద్రభారతి వైపు మళ్లిస్తారు.
  • అబిడ్స్‌, గన్‌ ఫౌండ్రి నుంచి బీజేఆర్‌ విగ్రహం వైపు ట్రాఫిక్‌ను అనుమతించరు.
  • ఈ వాహనాలను ఎస్‌బీఐ గన్‌ ఫౌండ్రి నుంచి చాపల్‌ రోడ్డులోకి మళ్లిస్తారు.
  • ట్యాంక్‌ బండ్‌ నుంచి బషీర్‌ బాగ్‌ జంక్షన్‌ వైపు వెళ్లే వాహనాలను లిబర్టీ జంక్షన్‌ వద్ద హిమాయత్‌ నగర్‌ వైపు మళ్లిస్తారు.

Telangana Assembly Elections 2023: కామారెడ్డిలో సీఎం కేసీఆర్ మీద రేవంత్ రెడ్డి పోటీకి సిద్దం, కాంగ్రెస్ పార్టీ మూడవ జాబితా విడుదల