Bhadradri Sitaram Kalyana Talambralu (Photo-Video Grab)

శ్రీరామనవమి సందర్భంగా భద్రాద్రిలో జరిగే సీతారాముల కల్యాణ తలంబ్రాలను భక్తులకు అందించాలని ఆర్టీసీ నిర్ణయించింది. కావాల్సినవారు తమ కార్గో పార్సిల్‌ కేంద్రాల్లో రూ.116 చెల్లించి వివరాలను నమోదు చేసుకోవాలని సంస్థ ఎండీ సజ్జనార్‌ సూచించారు. హైదరాబాద్‌లోని బస్‌భవన్‌లో కల్యాణ తలంబ్రాల బుకింగ్‌ పోస్టర్‌ను బుధవారం ఆయన ఆవిష్కరించారు.

కల్యాణోత్సవం అనంతరం తలంబ్రాలను భక్తుల ఇంటికే పంపిస్తామని తెలిపారు. గతేడాది దాదాపు 89 వేల మందికి తలంబ్రాలను అందించాం. శ్రీరామనవమికి వెళ్లలేని భక్తులు ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలి’ అని సజ్జనార్ కోరారు. ఈ సేవలను పొందాలనుకునేవారు 9177683134, 7382924900, 9154680020 ఆర్టీసీ లాజిస్టిక్స్‌ విభాగం ఫోన్‌ నంబర్లలో సంప్రదించాలని సూచించారు.

Here's Video