New Delhi, Oct 12: దేశంలో ఇంకా 4జీ పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాలేదు. 5జీ ఊసే లేదు. ఇప్పుడు ఏకంగా 6జీపై ఇండియా (6G in India) కసరత్తు చేస్తోంది. 5జీ టెక్నాలజీ అందరికీ అందుబాటులోకి రాకముందే అప్పుడే 6జీ టెక్నాలజీ మీద పనులు ప్రారంభించాలని కేంద్రం పేర్కొంది. భవిష్యత్ టెక్నాలజీల్లో ప్రపంచ మార్కెట్‌ను అందుకోవాలంటే 6జీ టెక్నాలజీలపై దృష్టి సారించాలని ప్రభుత్వ యాజమాన్యంలోని టెలికాం పరిశోధన, అభివృద్ధి సంస్థ సీ-డాట్‌కు (C-DoT) టెలికాం కార్యదర్శి కే రాజారామన్ (Telecom secretary K Rajaraman) సూచించారు.
శాంసంగ్, హువావే, ఎల్‌జీ, మరికొన్ని ఇతర కంపెనీలు ఇప్పటికే 6జీ టెక్నాలజీలపై (6G Technology) కృషి ప్రారంభించాయి. 5జీ కన్నా 50 రెట్లు వేగం ఉన్న ఈ టెక్నాలజీని 2028-2030 సంవత్సరాల మధ్యకాలంలో ప్రారంభించే ఆస్కారం ఉంది. 5జీ టెక్నాలజీ వేగం సెకనుకి 20 గిగాబైట్ ఉంటుందని అంచనాలు చెబుతున్నాయి. బీఎస్ఎన్‌ఎల్ 4 జీ టెక్నాలజీతో తొలి కాల్: దేశీయంగా అభివృద్ధి చేసిన 4జీ టెక్నాలజీని ఇన్‌స్టాల్ చేసిన బీఎస్ఎన్‌ఎల్ నెట్‌వర్క్‌పై తొలి కాల్‌ను టెలికాం శాఖ కార్యదర్శి కే రాజారామన్ ఆదివారంనాడు చేశారు.
ఆయన టెలి కాం శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కి కాల్ చేసి మాట్లాడారు. దేశీయంగా అభివృద్ధి చేసిన 4జీ టెక్నాలజీపై చేసిన తొలికాల్ ఆత్మనిర్భర్ భారత్ విజన్‌కు మరింత స్ఫూరినిస్తుందని వైష్ణవ్ ఈ సందర్భంగా ట్వీట్ చేశారు.
Here's MInister Ashwini Vaishnaw Tweet
Made first call over Indian 4G network of BSNL (Designed and Made in India).
PM @narendramodi Ji’s vision of Aatmanirbhar Bharat taking shape.
— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) October 10, 2021
6జీ టెక్నాలజీ 5జీ కంటే 50 రెట్లు వేగంగా ఉంటుందని, 2028-2030 మధ్య వాణిజ్యపరంగా అందుబాటులోకి రానున్నట్లు భావిస్తున్నారు. వొడాఫోన్ ఐడియా భారతదేశంలో ట్రయల్స్ సమయంలో అత్యధిక గరిష్ట వేగం 3.7 జీబీపీలను సాధించినట్లు పేర్కొంది. దేశంలోని రిలయన్స్ జియో నెట్ వర్క్ టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా(ట్రాయ్) సెకనుకు 20 మెగాబిట్ వద్ద 4జీ టాప్ స్పీడ్ ను నమోదు చేసింది. అక్టోబర్ 1న డీఓటీ కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన రాజరామన్ టెక్నాలజీ వాణిజ్యీకరణపై దృష్టి పెట్టాలని, వేగవంతమైన సాంకేతిక వాణిజ్యీకరణ కోసం సి-డిఒటిలో ఇంక్యుబేటర్లను ఏర్పాటు చేయడాన్ని పరిగణనలోకి తీసుకోవాలి అని సీ-డీఓటీకి సూచించారు.
ఇప్పటికే అమెరికా, చైనా వంటి దేశాలు 6జీ టెక్నాలజీ అభివృద్ధి, పరిశోధనలకు సంబంధించిన పనులు ప్రారంభించాయి. ఇప్పుడు వాటితో పోటీగా మన దేశంలో కూడా నూతన టెక్నాలజీల పనిచేయాలని డీఓటీ పేర్కొంది. ఆగ్మెంటెడ్ రియాలిటీ, వర్చువల్ రియాలిటీ, మిక్స్ డ్ రియాలిటీ కలిసిన XR టెక్నాలజీతో.. ఎంటర్‌టైన్‌మెంట్, మెడిసిన్, సైన్స్, విద్య, తయారీ పరశ్రమల బౌండరీలను 6జీ పెంచనుంది.