Linking Aadhaar with PAN Card

PANs of 10 crore NRIs made inactive: ఆధార్-పాన్ లింకింగ్ గురించి ఒక వ్యక్తి ట్విటర్ వేదికగా దాదాపు 10 కోట్లకు పైగా ఎన్ఆర్ఐ పాన్ కార్డులు పనిచేయడం లేదని, భారతదేశంలో వారి పెట్టుబడులు, బ్యాంక్ బ్యాలన్స్ వంటివి ఫ్రీజ్ అయినట్లు వెల్లడించాడు. ఎన్ఆర్ఐ అందించిన పిర్యాదు మేరకు ఆదాయ పన్ను శాఖ స్పందిస్తూ.. గతంలో వెల్లడించిన విధంగానే పాన్ కార్డుతో ఆధార్ నెంబర్ లింక్ చేయకుండా పోతే.. పాన్ పనిచేసే అవకాశం లేదని, ఈ కారణంగా తప్పకుండా కొన్ని ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. అయితే 10 కోట్ల పాన్ కార్డులు క్లోజ్ అయ్యాయా? లేదా? అనే దానిపైన ఎటువంటి అధికారిక వివరాలు వెల్లడి కాలేదు.

కొంపలు ముంచిన సమోసాల బిల్లు, రూ.1.40 లక్షలు ఆన్‌లైన్‌‌లో పోగొట్టుకున్న వైద్యుడు, లబోదిబోమంటూ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు

నిబంధనల ప్రకారం.. ఎవరైతే ఎన్ఆర్ఐ లేదా ప్రవాస భారతీయులు ఉంటారో వారు ముందుగా వారి స్టేటస్ ఆదాయ పన్ను శాఖకు తెలియజేసినట్లయితే వారికి పాన్-ఆధార్ లింక్ నుంచి మినహాయింపు లభిస్తుంది. కావున వారికి ఎటువంటి సమస్య ఉండదని ఆదాయపన్ను శాఖ క్లారిటీ ఇచ్చింది. అంతే కాకుండా ఇప్పటి వరకు ఎవరైనా ప్రవాస భారతీయులు తమ ఎన్ఆర్ఐ స్టేటస్ చెప్పకుండా.. పాన్ కార్డు పని చేయలేదని నిర్దారించుకుంటారో, అలాంటి వారు ఆన్‌లైన్ ద్వారా జ్యూరిస్డిక్షనల్ అసెస్సింగ్ ఆఫీసర్ (JAO)ని సంప్రదించవలసిందిగా వెల్లడించింది.

Here's Tweet

ఇందులో భాగంగా వారి పాస్‌పోర్ట్ కాఫీ వంటివి వారికి అందించాల్సిన అవసరం కూడా ఉందని తెలిపింది. ఆలా కాకుంటే పాన్ కాఫీ, సంబంధిత డాక్యుమెంట్స్ adg1.systems@incometax.gov.in లేదా jd.systems1.1@incometax.gov.in అనే ఇమెయిల్‌కి కూడా పంపవచ్చని ఆదాయ పన్ను శాఖ వెల్లడించింది.

వీడియో ఇదిగో, తొలి ఏఐ యాంకర్‌ లీసా వచ్చేసింది, అవలీలగా వార్తలు చదివేస్తున్న మిషన్ లేడీ

ఆలస్య రుసుముగా రూ. 1000 చెల్లించి పాన్‌ను ఆధార్‌తో లింక్ చేయడానికి చివరి తేదీ జూన్ 30తో ముగిసింది. రుసుము చెల్లించి, లింక్ చేయడంలో విఫలమైన వినియోగదారుల కోసం, అటువంటి కేసులు సక్రమంగా పరిగణించబడతాయని పన్ను శాఖ తెలిపింది.