Technology

Wipro Elite 2021: విప్రోలో ఉద్యోగ అవకాశాలు, ఎలైట్ నేషనల్ టాలెంట్ హంట్ 2021 ని ప్రకటించిన విప్రో, రూ.30 వేల జీతం.. ఉద్యగానికి సంబంధించిన పూర్తి వివరాలు ఓ సారి తెలుసుకోండి

Hazarath Reddy

కరోనా సమయంలో భారతదేశానికి చెందిన మల్టీ నేషనల్ ఐటీ కంపెనీ విప్రో ఉద్యోగ అవకాశాలను (Wipro Elite 2021) కల్పించేందుకు రెడీ అయింది. ఇంజనీరింగ్ కంప్లీట్ చేసుకున్న విద్యార్థులకు, అలాగే 2021లో ఇంజనీరింగ్ పూర్తి చేయనున్న ఇంజనీరింగ్‌ విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలను కల్పిస్తోంది.

PM-WANI: దేశంలో భారీ ఎత్తున పబ్లిక్ వైఫై, పీఎండబ్ల్యూఏఎన్‌ఐకు ఆమోదం తెలిపిన కేంద్ర కేబినెట్, మీడియాకు కీలక వివరాలను వెల్లడించిన కేంద్ర ఐటీ, న్యాయ శాఖా మంత్రి రవి శంకర్‌ ప్రసాద్

Hazarath Reddy

దేశంలో భారీ ఎత్తున పబ్లిక్ వైఫై (Public Wi-Fi System) త్వరలో అందుబాటులోకి రానుంది. ఈ ప్రణాళికకు కేంద్ర కేబినెట్ బుధవారం ఆమోదం తెలిపింది. ఎటువంటి లైసెన్స్‌, ఫీజు, రిజిస్ట్రేషన్‌ అవసరం లేకుండా దేశంలో త్వరలోనే పబ్లిక్‌ డేటా సెంటర్లు ప్రారంభం కానున్నాయని కేంద్ర ఐటీ, న్యాయ శాఖా మంత్రి రవి శంకర్‌ ప్రసాద్‌ (Ravi Shankar Prasad) అన్నారు.

Jio 5G Service to Launch in India: తక్కువ ధరకే జియో 5జీ, 2021లో ఇండియాకు 5జీ సేవలను తీసుకువస్తున్నట్లు ప్రకటించిన ముఖేష్ అంబానీ, అతి త‌క్కువ ధ‌ర‌కే ఆండ్రాయిడ్ ఫోన్‌

Hazarath Reddy

రిలయన్స్ జియో అధినేత ముకేష్ అంబానీ 5జీపై కీలక ప్రకటన చేశారు. ఇండియాలో జియో 5జీ సేవ‌లను 2021 ద్వితీయార్ధంలో తీసుకువ‌స్తున్న‌ట్లు (Jio 5G Service to Launch in India) వెల్ల‌డించారు.

Gionee Phones: భారీ మోసం వెలుగులోకి, ప్రమాదంలో రెండు కోట్ల స్మార్ట్‌ఫోన్లు, జియోనీ ఫోన్లలో ట్రోజన్ హార్స్ వైరస్, జియోనీ ఫోన్‌లతో సంబంధం ఉన్న వివాదాస్పద అంశంపై తీర్పు ఇచ్చిన చైనా కోర్టు

Hazarath Reddy

చైనాలోని ఒక కోర్టు జియోనీ ఫోన్‌లతో సంబంధం ఉన్న వివాదాస్పద అంశంపై తీర్పు ఇచ్చింది. చైనా జడ్జిమెంట్ డాక్యుమెంట్ నెట్‌వర్క్ ప్రచురించిన ఒక నివేదిక ప్రకారం, జియోనీ ఫోన్‌లలో (Gionee Phones) అమలు చేయబడినట్లు గుర్తించిన కంప్యూటర్ సమాచార వ్యవస్థలపై అక్రమ నియంత్రణపై తీర్పు ఇవ్వబడింది. ఈ తీర్పు ప్రకారం జియోనీ ఫోన్‌లలో ఉద్దేశపూర్వకంగానే 2 కోట్లకుపైగా ఫోన్లలో ట్రోజన్ హార్స్ అనే వైరస్ ను సంస్థ ప్రవేశపెట్టినట్లు వెల్లడించింది.

Advertisement

Netflix India: ఉచితం..ఉచితం, రెండు రోజుల పాటు నెట్‌ఫ్లిక్స్‌ ఉచిత సేవలు, ‘స్ట్రీమ్‌ఫెస్ట్’ ఆఫర్ కింద నేడు, రేపు ఫ్రీగా ఉపయోగించుకోవచ్చని తెలిపిన నెట్‌ఫ్లిక్స్‌ ఇండియా

Hazarath Reddy

కొన్ని రోజులుగా సినిమా అభిమనులను నెట్‌ఫ్లిక్స్‌ ఊరిస్తూ బంపర్‌ (Netflix India is Free for Two Days)అంటూ ప్రచారం చేస్తున్న సంగతి విదితమే. నేటి నుంచి ఆఫర్ వచ్చేసింది. సినిమా ప్రేమికుల ఎదురుచూపులకు తెరదించతూ రెండు రోజుల ఫ్రీ ఆఫర్‌ను ప్రకటించింది. స్ట్రీమ్ ఫెస్ట్‌లో ( StreamFest Begins) భాగంగా భారత దేశమంతటా నేడు, రేపు ఫ్రీగా నెట్‌ఫ్లిక్స్‌ను వినియోగించుకోవచ్చని ఆ సంస్థ తెలిపింది.

Fact Check: కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రతి వ్యక్తికి రూ.1,30,000, ఇలా వచ్చే లింక్‌ను ఎవరూ క్లిక్ చేయకండి, అది ఫేక్ అని నిర్ధారించిన పీఐబీ ఫాక్ట్-చెక్ బృందం

Hazarath Reddy

18 ఏళ్ల వయసు దాటిన ప్రతి పౌరుడికి కరోనా నిధుల కింద రూ.1,30,000 ఇస్తామని భారత ప్రభుత్వం ప్రకటన చేసిందనే వార్త తాజాగా వాట్సప్ లో వైరల్ అవుతోంది. ఈ డబ్బును అందుకోవాలంటే పూర్తి వివరాలు నమోదు చేయాలని పేర్కొంటూ, ఓ లింక్‌ను పంపుతున్నారు. అయితే, దాన్ని క్లిక్ చేయొద్దని, ఆ ప్రచారంలో నిజం లేదని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో తెలిపింది.

Google Pay: వినియోగదారులకు గూగుల్ పే షాక్, త్వరలో నగదు బదిలీ ఛార్జీలు వసూలు చేయనున్న గూగుల్ పే, గూగుల్ పే వెబ్​యాప్ సేవలు 2021 నుంచి క్లోజ్

Hazarath Reddy

డిజిటల్ చెల్లింపుల్లో దూసుకుపోతున్న గూగుల్ పే వినియోగదారులకు షాకింగ్ వార్తను అందించింది. వచ్చే ఏడాది జనవరి నుండి గూగుల్ పే వెబ్​యాప్ ( Google Pay web app) సేవలను నిలివేయనున్నట్లు తెలిపింది. దీంతో పాటు గూగుల్ పే (Google Pay) నుండి తక్షణ నగదు బదిలీ చేసినందుకు గాను ఛార్జీలు వసూలు చేసే యోచనలో గూగుల్ పే ఉన్నట్లు తెలుస్తోంది.

43 Chinese Apps Banned: మళ్లీ 47 చైనా యాప్స్‌పై నిషేధం, కీలక నిర్ణయం తీసుకున్న MeitY, ఇన్ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీ చ‌ట్టం సెక్ష‌న్ 69ఎ కింద వీటిపై నిషేధం

Hazarath Reddy

భారతదేశం, చైనా మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న తరుణంలో, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (MeitY) కీలక నిర్ణయం తీసుకుంది. తాజాగా కేంద్ర ప్ర‌భుత్వం మ‌రోసారి 43 మొబైల్ యాప్‌ల‌ను (43 Chinese Apps Banned) నిషేధించింది.

Advertisement

PUBG Mobile India: ఇండియాకు పబ్‌జీ రీ ఎంట్రి, పబ్‌జీ మొబైల్ ఇండియా పేరుతో టీజర్ విడుదల, భారత గేమింగ్ పరిశ్రమలో రూ.700 కోట్లకు పైగా పెట్టుబడి పెడతామని హామీ ఇచ్చిన పబ్‌జీ కార్పొరేషన్

Hazarath Reddy

పబ్‌జీ ప్రేమికులకు కంపెనీ శుభవార్తను అందించింది. పబ్‌జీ గేమ్ తిరిగి భారత్ లోకి "పబ్‌జీ మొబైల్ ఇండియా" (PUBG Mobile India) పేరుతో లాంచ్ చేస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. దీనికి సంబంధించిన టీజర్ కూడా యూట్యూబ్‌లో రిలీజ్ చేసింది. కొత్తగా తీసుకొచ్చిన పబ్‌జీ మొబైల్ ఇండియా గేమ్ (Battle Royale Online Game) ను భారత మార్కెట్‌కు తగ్గట్టుగా పబ్‌జీ కార్పొరేషన్ డిజైన్ చేస్తోంది.

Avast Warning: వెంటనే ఈ 7 యాప్స్ మీ మొబైల్ నుంచి డిలీట్ చేయండి, వినియోగదారులను హెచ్చరించిన ప్రముఖ డిజిటల్ సెక్యూరిటీ దిగ్గజం అవాస్ట్

Hazarath Reddy

డిజిటల్ సెక్యూరిటీ దిగ్గజం ‘అవాస్ట్’ గేమర్స్‌ని టార్గెట్ చేస్తున్న 7 యాప్స్‌ని గుర్తించి లిస్ట్ (Avast Warning) బయటపెట్టింది. కాగా మైన్‌క్రాఫ్ట్ వీడియో గేమ్ అభిమానులనే ఈ యాప్స్ (Malicious mobile apps) ఎక్కువగా టార్గెట్ చేస్తున్నాయి. ఫ్లీస్‌వేర్ అప్లికేషన్స్ యూజర్లకు వాల్‌పేపర్స్, మాడిఫికేషన్స్ లాంటివి ఎర వేసి డబ్బులు కాజేస్తున్నాయి.

Google: జీమెయిల్ వినియోగదారులకు హెచ్చరిక, రెండు సంవత్సరాలు మీ అకౌంట్ ఉపయోగించకుంటే ఖాతాను డిలీట్ చేయనున్న గూగుల్

Hazarath Reddy

గూగుల్ జీమెయిల్ వాడేవారికి షాక్ లాంటి వార్త చెప్పింది. ఇందులో భాగంగా వచ్చే ఏడాది జూన్‌ 1 నుంచి మీరు ఒకటి, అంతకంటే ఎక్కువ సేవల్లో రెండు సంవత్సరాలు ఉపయోగించనటైతే (inactive accounts) మీ ఖాతాలోని క్రియారహితంగా ఉన్న సమాచారాన్ని గూగుల్‌ (Google) తొలగించనుంది.

RIL Investments Row: ముఖేష్ అంబానీ కంపెనీ భారీ పెట్టుబడులు, బ్రేక్‌త్రూ ఎనర్జీలో రిలయన్స్ రూ.373 కోట్ల పెట్టుబడి, Urban Ladderలో రూ. 182.12 విలువైన ఈక్విటీ షేర్లు కొనుగోలు

Hazarath Reddy

ప్రముఖ పారిశ్రామికవేత్త ముకేశ్‌ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ (Reliance Industries Ltd) అమెరికాలో ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌ సహ వ్యవస్థాపకుడు బిల్‌ గేట్స్‌కి (Bill Gates) చెందిన బ్రేక్‌త్రూ ఎనర్జీ వెంచర్స్‌ (Breakthrough Energy Ventures) సంస్థలో 50 మిలియన్‌ డాలర్ల (రూ.373 కోట్ల) పెట్టుబడి పెట్టనున్నది.

Advertisement

Vivo Diwali Offer: రూ.101 కే వివో స్మార్ట్‌ఫోన్లు, దివాళి ఆఫర్ అంటూ ట్వీట్ చేసిన వివో కంపెనీ, మైక్రోమాక్స్‌ నుంచి బడ్జెట్ ధరకు రెండు స్మార్ట్‌ఫోన్లు, ఫీచర్లపై ఓ లుక్కేయండి

Hazarath Reddy

రానున్న దీపావళి పండగ సీజన్‌ను పురస్కరించుకుని స్మార్ట్‌ఫోన్‌ తయారీదారు వివో బంపర్‌ ఆఫర్‌ (Vivo Diwali Offer) ప్రకటించింది. పండుగ సందర్భంగా వీ 20ఎస్‌, వీ 20, ఎక్స్‌ 50 సీరిస్‌ స్మార్ట్‌ఫోన్లను 101 రూపాయలకే సొంతం చేసుకోవచ్చని తెలిపింది. అలాగే ఐసీఐసీఐ, కోటక్, ఫెడరల్‌బ్యాంకు , బ్యాంక్ ఆఫ్‌బరోడాల కార్డు కొనుగోళ్లపై 10శాతం క్యాష్‌బ్యాక్‌ అందిస్తోంది.

PSLV-C49 Rocket: పీఎస్‌ఎల్‌వీ సి49 ప్రయోగం విజయవంతం, EOS-01 సహా మరో 9 ఉపగ్రహాలను కక్ష్యలో ప్రవేశపెట్టిన ఇస్రో

Team Latestly

ఇక ఈరోజు భారత్ ప్రయోగించిన ఉపగ్రహం EOS-01 విషయానికి వస్తే, ఇది దేశానికి సంబంధించిన భూతల పరిశీలన, వ్యవసాయం, అటవీ మరియు విపత్తు నిర్వహణ మొదలకు తదితర సేవలకు ఉద్దేశించబడింది....

WhatsApp Pay: ఇకపై వాట్సాప్ ద్వారా కూడా బ్యాంకింగ్ లావాదేవీలు నిర్వహించుకోవచ్చు, వాట్సాప్ ద్వారా నగదు చెల్లింపు మరియు పొందడంలో కొన్ని ముఖ్యవిషయాలు మీకోసం

Team Latestly

ఇది అచ్ఛంగా గూగుల్ పే, ఫోన్ పే, బిహెచ్ఐఎం మరియు బ్యాంకుల వివిధ అనువర్తనాలు ఉపయోగించే వ్యవస్థ. కాబట్టి మీరు వాట్సాప్ ‘వాలెట్’ లో డబ్బును నిల్వ చేసుకోనవసరం లేదు. డబ్బు నేరుగా మీ బ్యాంక్ ఖాతా నుంచే ఇతర వ్యక్తులకు బదిలీ చేయడానికి ఇది ఒక ప్లాట్‌ఫాంలా సహాయపడుతుంది....

BSNL New Plans: బీఎస్ఎన్ఎల్ మూడు సరికొత్త ప్లాన్లు, అపరిమిత వాయిస్ కాల్స్, డిసెంబర్ 1, 2020 నుంచి అందుబాటులోకి..

Hazarath Reddy

ప్రభుత్వ రంగ టెలికాం దిగ్గజం భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్(బీఎస్ఎన్ఎల్) సరికొత్త పోస్ట్‌పెయిడ్ ప్లాన్లను ( BSNL postpaid plans) కస్టమర్లకు పరిచయం చేసింది. ఇటీవల కొత్త బ్రాడ్ బ్యాండ్‌ ప్లాన్లను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్ తాజాగా డేటా రోల్‌ఓవర్ సదుపాయంతో పాటు ఏ నెట్‌వర్క్‌కైనా అపరిమిత వాయిస్ కాల్స్, రోజువారీ 100 ఉచిత ఎస్‌ఎంఎస్‌లందించే కొత్త పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లను (BSNL New Plans) ప్రకటించింది. డిసెంబర్ 1, 2020 నుంచి దేశవ్యాప్తంగా వీటిని లాంచ్ చేయనున్నామని తెలిపింది.

Advertisement

iPhone Sales: ఇండియాలో రికార్డు స్థాయిలో ఐఫోన్ అమ్మకాలు, యూజర్లకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపిన ఆపిల్ సీఈఓ టిమ్ కుక్, గ్లోబల్ ఐఫోన్ అమ్మకాల్లో క్షీణత

Hazarath Reddy

దేశీయ మొబైల్ మార్కెట్లో ఆపిల్ సత్తా చాటింది. దేశంలో తన తొలి ఆన్‌లైన్ స్టోర్ ప్రారంభించిన టెక్ దిగ్గజం ఆపిల్.. ప్రపంచవ్యాప్తంగా ఐఫోన్ అమ్మకాలు క్షీణించినా, దేశీయంగా గణనీయమైన అమ్మకాలను (Apple saw record sales in India) నమోదు చేసింది.

PUBG: గేమింగ్ అభిమానులకు షాక్, నేటి నుండి పబ్‌జీ ఎక్కడా కనపడదు, ఇండియాలో పబ్‌జీ సేవలన్నింటినీ ఆపేస్తున్నామని తెలిపిన టెన్సెంట్ గేమ్స్

Hazarath Reddy

వినియోగదారుల వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తున్నారన్న కారణంగా చైనాకి చెందిన చాలా కంపెనీల మొబైల్ యాప్స్ పై (China Mobile Apps) ఇండియా నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఆ విధంగానే పబ్జీ మొబైల్ పై (PlayerUnknown’s Battlegrounds) నిషేధం విధించింది. ఇండియాలో ఎక్కువ మంది ఆడుతున్న ఈ మొబైల్ గేమ్ ని (PUBG MOBILE) సెప్టెంబర్ 2వ తేదీన భారత ప్రభుత్వం నిషేధించింది. నిషేధం గురించిన ప్రకటన వచ్చిన తర్వాత కూడా పబ్జీ మొబైల్ చాలామందికి అందుబాటులో ఉండింది.

WhatsApp Privacy Features: వాట్సాప్ ఛాట్ సెక్యూరిటీగా ఉంచుకోవడం ఎలా? హ్యాకింగ్ బారీ నుండి మీ వాట్సాప్ ఛాట్‌ను కాపాడుకునేందుకు సులువైన మార్గాలు

Hazarath Reddy

Always Mute Option:వాట్సాప్ గ్రూపుల నుండి విముక్తి, ఆల్వేస్ మ్యూట్ ఆప్షన్‌ని అందుబాటులోకి తీసుకువచ్చిన వాట్స్‌యాప్, అధికారిక ట్విట్టర్లో వెల్లడించిన అమెరికా దిగ్గజం

Hazarath Reddy

అమెరికా దిగ్గజం ఫేస్‌బుక్ సారధ్యంలోని మెసేజింగ్ యాప్ వాట్స్‌యాప్ యూజర్ల కోసం కీలక ఫీచర్‌ను (WhatsApp new features) తీసుకొచ్చింది. గ్రూపు చాట్స్, అలర్ట్స్ తో విసిగిపోయిన యూజర్లుకు ఈ కొత్త అప్ డేట్ అందించింది. ఇకపై వాట్సాప్‌లోని గ్రూప్ చాట్‌లను ఆల్వేస్ మ్యూట్ అనే ఆప్షన్ (Always Mute Option) తో ఎప్పటికీ మ్యూట్ చేసే విధంగా ఫీచర్‌ను తాజాగా అందుబాటులోకి తెచ్చింది.

Advertisement
Advertisement