టెక్నాలజీ
Jio Plans 2020: జియో నుంచి సరికొత్త ప్రీపెయిడ్ ప్లాన్లు, జియో నుండి ఇతర నెట్‌వర్క్‌లకు 12000 నిమిషాల టాక్ టైం, కొత్త ప్లాన్ల వివరాలు ఇవే
Hazarath Reddyరిలయన్స్ జియో కొత్త పథకాలతో (Jio Plans 2020) వినియోగదారులకు ఆకట్టుకుంటోంది. తాజాగా ఫెయిర్ యూసేజ్ పాలసీ లిమిట్ (ఎఫ్‌యూపీ) కింద కొత్త ప్రీపెయిడ్ ప్లాన్లను (Reliance Jio prepaid plans) అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇందులో భాగంగా రిలయన్స్ జియో నుండి ఇతర నెట్‌వర్క్‌లకు 12000 నిమిషాల టాక్ టైం అందిస్తోంది. అయితే ఈ పరిమితి అయిపోయాక ఇతర నెట్ వర్క్ లకు చేసే కాల్స్ పై 6 పైసల ఐయూసీ చార్జీలను జియో వసూలు చేయనుంది.
Chingari App: టిక్‌టాక్‌కు ధీటుగా చింగారి యాప్, 10 లక్షల మంది డౌన్‌లోడ్ చేసుకున్న మేడ్ ఇన్ ఇండియా యాప్ గురించి తెలుసుకోండి
Hazarath Reddyచైనీస్ యాప్ టిక్‌టాక్ తో పాటు 59 చైనీస్ యాప్‌లను ప్రభుత్వం నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకున్న సంగతి విదితమే. ఈ నేపథ్యంలో ఇండియా యాప్ చింగారి (Chingari Made in India app) వచ్చేసింది. ఈ యాప్ ను గంటలోనే ఈ యాప్‌ను ( Chingari APP) పదిల‌క్ష‌లమంది దాకా డౌన్‌లోడ్ చేసుకున్న‌ారు. షార్ట్ వీడియో స‌ర్వీస్‌తో అచ్చం టిక్‌టాక్ ( TikTok) మాదిరే ఉన్న ఈ యాప్‌పై ప్ర‌స్తుతం భార‌తీయులు మ‌క్కువ చూపిస్తున్నారు. తెలుగు, ఇంగ్లీష్, హిందీ, బెంగాలీ, గుజరాతీ, మరాఠీ, కన్నడ, పంజాబీ, మలయాళం, తమిళం భాష‌ల్లో ఈయాప్ అందుబాటులో ఉంది.
PAN-Aadhaar Card Linking: గుడ్ న్యూస్, ఆధార్-పాన్ లింక్ గడువు 2021 మార్చి 31వ తేదీ వరకు పొడిగింపు, ఎలా లింక్ చేయాలో తెలుసుకోండి
Hazarath Reddyఆధార్‌ కార్డును పాన్‌ కార్డుతో కనెక్ట్ చేసేందుకు చివరి తేదీని మరోసారి పొడిగించారు. 2021 మార్చి 31వ తేదీ వరకూ పొడిగిస్తూ ఇన్‌కమ్ టాక్స్ విభాగం అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఆధార్‌ కార్డును పాన్‌ కార్డుతో కనెక్ట్ చేయడాన్ని ఆదాయపు పన్ను విభాగం గతంలోనే తప్పనిసరి చేసింది. పైగా ఏడాది మార్చి 31లోగా పాన్ కార్డును ఆధార్‌ కార్డుతో అనుసంధానం చేయకపోతే పాన్ కార్డు పనిచేయబోదని గతంలోనే స్పష్టం చేసింది.
Flipkart: తెలుగు ప్రజలకు ప్లిప్‌కార్ట్‌ శుభవార్త, ఇకపై మీరు తెలుగు భాషలో కూడా షాపింగ్ చేయవచ్చు, కొత్త ఫీచర్‌ని యాడ్ చేసిన ప్లిప్‌కార్ట్‌
Hazarath Reddyఈ- కామర్స్‌ లో దూసుకుపోతున్న దిగ్గజం ప్లిప్‌కార్ట్‌ (Flipkart) తాజాగా తెలుగు, తమిళ, కన్నడ ప్రజలకు ప్లిప్‌కార్ట్‌ శుభవార్త తెలిపింది. ఇక మీదట (తెలుగు, తమిళ, కన్నడ భాషల)కు చెందిన వినియోగదారులు తమ ప్రాంతీయ భాషలలో (Flipkart Rolls Out Language Interfaces) షాపింగ్‌ చేయవచ్చని ఫ్లిప్‌కార్ట్‌ పేర్కొంది. ప్లిప్‌కార్ట్‌లో ఇప్పటివరకు కేవలం హిందీ మొబైల్‌ అప్లికేషన్‌కు మాత్రమే ఈ వెసలుబాటు ఉండేది.
ATM Usage Charges: రూ.5 వేలు కన్నా ఎక్కువ డ్రా చేస్తే ఛార్జీల మోత తప్పదా? పలు రకాల ఛార్జీలు పెంచుతూ నివేదికను తయారుచేసిన ఆర్బీఐ కమిటీ, నిశితంగా పరిశీలిస్తున్న అత్యున్నత అధికారులు
Hazarath Reddyకోవిడ్-19 కారణంగా తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కుంటున్న రిజర్వ్ బ్యాంక్ (Reserve Bank of India) ఈ పరిస్థితుల నుండి గట్టెక్కేందుకు మరో కీలక నిర్ణయం తీసుకోనుందనే వార్తలు వస్తున్నాయి. ఇందులో భాగంగా ఏటీఎం ఛార్జీలను (ATM Usage Charges) మరింత పెంచే యోచనలో ఆర్బీఐ ఉన్నట్లు తెలుస్తోంది. ఒక ఏటీఎం ట్రాన్సక్షన్‌లో 5వేలు మాత్రమే విత్‌డ్రాకు అవకాశం ఇచ్చేలా నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.
Happy Summer 2020: ఇకపై పగలు ఎక్కువ, రాత్రులు తక్కువ, హ్యాపీ సమ్మర్ సీజన్ 2020 వచ్చేసింది, జూన్ 21 నుంచి సెప్టెంబర్ 22 వరకు కొనసాగనున్న సమ్మర్ సీజన్
Hazarath Reddyనాలుగు సమశీతోష్ణ సీజన్లలో వేసవి అనేది చాలా హాటెస్ట్ సీజన్ గా (Happy Summer 2020) చెప్పవచ్చు. ఇది (Summer Season) వసంత రుతువు తరువాత అలాగే శరదృతువు ముందు వస్తుంది. ఈ వేసవికాలంలో సూర్యోదయం, సూర్యాస్తమయంలో పలు మార్పులు సంభవిస్తాయి. రోజులు చాలా ఎక్కువ అనిపిస్తాయి. రాత్రులు తక్కువగానూ పగలు ఎక్కువగా ఉంటుంది. కాలం గడుస్తున్న కొద్ది పగలు తగ్గిపోయి రాత్రి ఎక్కువ అవుతుంది. కాగా వేసవి ప్రారంభ తేదీ (Happy Summer 2020 Dates) వాతావరణం, సంప్రదాయం మరియు సంస్కృతి ప్రకారం మారుతుంది. ఉత్తర అర్ధగోళంలో వేసవి ఉన్నప్పుడు, ఇది దక్షిణ అర్ధగోళంలో శీతాకాలంతో విరుద్ధంగా ఉంటుంది. ఈ సీజ్ జూన్ 21న ప్రారంభమై సెప్టెంబర్ 22 వరకు ఉంటుంది.
Reliance Net Debt-Free: జియో ముఖేష్ అంబానీ మ్యాజిక్, రిల్‌లోకి 58 రోజుల్లో రూ.1,68,818 కోట్ల పెట్టుబడులు, రిలయన్స్ ఇపుడు బంగారు దశాబ్దంలో ఉందన్న జియో అధినేత
Hazarath Reddyరిలయన్స్ ఇండస్ట్రీస్ (RIL) అధినేత, ఆసియా కుబేరుడు ముకేశ్ అంబానీ (Mukesh Ambani) అనుకున్నది సాధించాడు. వరుస పెట్టుబడుల సునామీతో రిలయన్స్ ను అప్పులు లేని సంస్థగా (Reliance Net Debt-Free) మార్చివేశాడు. కాగా 2021 మార్చి నాటికి ఆర్ఐఎల్ (Reliance) సంస్థను రుణ రహిత సంస్థగా తీర్చిదిద్దుతానన్న వాగ్దానాన్ని ముందే నెరవేర్చామని ఛైర్మన్ ముకేశ్ అంబానీ శుక్రవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో వెల్లడించారు. అనుకున్న లక్ష్యాన్ని నిర్దేశిత సమయంకంటే ముందుగానే సాధించాం. "రిలయన్స్ ఇపుడు బంగారు దశాబ్దంలో" (Reliance In Golden Decade) ఉందని బిలియనీర్ అంబానీ ప్రకటించారు. కాగా రిలయన్స్ ఇండస్ట్రీస్ గత 58 రోజుల్లో రిలయెన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ రూ.1,68,818 కోట్లు సేకరించింది.
Atmanirbhar Bharat: చైనాకు దిమ్మతిరిగే షాక్ ఇవ్వబోతున్న ఇండియా, 4జీ అప్‌గ్రేడ్‌‌లో చైనా పరికరాల వినియోగం బంద్, బీఎస్ఎన్ఎల్ ఇతర టెలికం సంస్థలకు త్వరలో డాట్ ఆదేశాలు
Hazarath Reddyభారత్ - చైనా సరిహద్దులోని గాల్వార్ లోయ దగ్గర జరిగిన ఘర్షణలో 20 మంది సైనికులను పొట్టనబెట్టుకున్న చైనాకు (China) తగిన గుణపాఠం చెప్పాలని భారత్ భావిస్తోంది. కేవలం సైనిక చర్యల ద్వారా మాత్రమే కాకుండా వాణిజ్యపరంగానూ తగిన సమాధానం చెప్పాలని నిర్ణయానికి వచ్చింది. ఇందులో భాగంగా ప్రభుత్వరంగ టెలికమ్ సంస్థ భారత సంచార్ నిగమ్ లిమిటెడ్ (Bharat Sanchar Nigam Limited) (బీఎస్ఎన్ఎల్) 4జీ అప్‌గ్రేడ్‌లో చైనా పరికరాలను వినియోగించరాదని నిర్ణయించారు. భద్రత కారణాల వల్ల చైనా పరికరాలను పక్కనబెట్టాలని టెలికం శాఖ (Department of Telecom) నిర్ణయించినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. అంతేకాదు, ఈ పనులకు సంబంధించి రీ-టెండరింగ్‌ కూడా వెళ్లాలని నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొన్నాయి.
Jio Fiber Offers: జియో నుంచి మరో సంచలన ఆఫర్, ఏడాది పాటు అమెజాన్ ప్రైమ్ మెంబర్ షిప్ ఉచితం, జియో ఫైబర్ గోల్డ్, ఆపైన ప్లాన్ లో ఉన్నవారికి మాత్రమే
Hazarath Reddyదేశీయ టెలికాం రంగంలో దూసుకుపోతున్న రిలయన్స్ జియో తాజాగా జియోఫైబర్ (Reliance Jio Fiber) వినియోగదారులకు మరో బంపర్ ఆఫర్ (Jio Fiber offers) అందిస్తోంది. రూ. 999 అమెజాన్ ప్రైమ్ సభ్యత్వాన్ని ఉచితంగా (free Amazon Prime) అందిస్తున్నట్టు రిలయన్స్ జియో ప్రకటించింది. జియో ఫైబర్ గోల్డ్ , ఆపైన ప్లాన్ లో ( Jio Fiber Bronze plans) ఉన్న జియోఫైబర్ వినియోగదారులకు ఇది అందుబాటులో ఉంటుందని తెలిపింది. ఈ పథకం గోల్డ్, డైమండ్, ప్లాటినం మరియు టైటానియం ప్లాన్‌లపై లభిస్తుంది.
iQOO 3 Volcano Orange: ఐక్యూ 3 స్మార్ట్‌ఫోన్ యొక్క ఆకర్శనీయమైన వోల్కనో ఆరెంజ్ కలర్ వేరియంట్ భారత మార్కెట్లో విడుదల; ధర, ఫీచర్లు మరియు ఇతర స్పెసిఫికేషన్లు ఇలా ఉన్నాయి
Team Latestlyఆఫర్ల విషయానికొస్తే, ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిట్ మరియు డెబిట్ కార్డుల ద్వారా కొనుగోలు చేసే వారికి రూ. 3,000 డిస్కౌంట్ పొందవచ్చు. ఎక్స్ఛేంజ్‌ ద్వారా కూడా గరిష్ఠంగా రూ.13,950 వరకు తగ్గింపు పొందవచ్చు....
OnePlus Smart TV: తక్కువ ధరలకే వన్‌ప్లస్ స్మార్ట్ టీవీలు, ధరలు రూ. 1X,999/- నుండి ప్రారంభమవుతాయని సస్పెన్స్ క్రియేట్ చేసిన సంస్థ
Team Latestlyవన్‌ప్లస్ ఇండియా ఇటీవల చేసిన ట్వీట్‌లో రాబోయే వన్‌ప్లస్ టీవీ సిరీస్ ధరకు సంబంధించిన విషయాన్ని కొద్దిగా సస్పెన్స్ లో ఉంచుతూ టీజర్‌లో చూపించారు. ఈ స్మార్ట్ టీవీ మోడళ్ల ధర రూ .1X, 999 నుండి ప్రారంభమవుతాయని ట్వీట్‌లో పేర్కొన్నారు....
Upcoming WhatsApp Features: వాట్సాప్‌లోకి 5 కొత్త ఫీచర్లు, త్వరలో అందుబాటులోకి వచ్చే అవకాశం, ఫీచర్ల వివరాలపై ఓ లుక్కేయండి
Hazarath Reddyప్రముఖ మెసేజింగ్‌ యాప్‌ వాట్సాప్‌ త్వరలో మరో ఐదు వినూత్న ఫీచర్లను (Upcoming WhatsApp features) అందుబాటులోకి తీసుకురానుంది.ఇప్పటికే డార్క్‌ మోడ్‌ ఫీచర్‌ను లాంఛ్‌ చేసిన వాట్సాప్‌ గ్రూప్‌ వాయిస్‌, వీడియో కాల్‌ పరిమితిని నలుగురి నుంచి ఎనిమిదికి పెంచి యూజర్లను ఆకట్టుకుంది. మల్టిపుల్‌ డివైజ్‌ సపోర్ట్‌ ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చేందుకు వాట్సాప్‌ (WhatsApp) కసరత్తు ముమ్మరం చేసింది.
PUBG Addiction: తెల్లారేదాక పబ్‌జీ ఆడాడు, తరువాత ఉరేసుకున్నాడు, రాజస్థాన్‌లో విషాదకర ఘటన, కేసు నమోదు చేసిన కోట పోలీసులు
Hazarath Reddyపబ్‌జీ గేమ్ లు ఇప్పటికే ఎందరో ప్రాణాలు తీసిన విషయం తెలిసిందే.. తాజాగా ఓ 14 ఏళ్ల కుర్రాడు తెల్లారేదాకా పబ్జీ గేమ్ ఆడి, అనంతరం పక్క గదిలోకి వెళ్లి ఉరేసుకుని (Rajasthan Teen Hangs Self) మరణించాడు..
IMEI Fraud: ఒకే IMEI నంబరుతో 13 వేల ఫోన్లు, ఉత్తరప్రదేశ్‌లో షాకింగ్ న్యూస్ వెలుగులోకి, మొబైల్ ఫోన్ తయారీ సంస్థపై కేసు నమోదు చేసిన మీరట్ పోలీసులు
Hazarath Reddyదొంగిలించబడిన మొబైల్ ఫోన్‌లను (mobile phones) గుర్తించడం చాలా కష్టంతో కూడుకున్న పని. అయితే దొంగిలించిన ఫోన్ IMEIను మార్చివేసి చాలామంది ఫోన్లను అమ్మేస్తుంటారు. అయితే ఓ IMEI నంబరును 13000 ఫోన్లకు ఎక్కించడం నిజంగా షాకింగ్ కలిగించే అంశమే.. వివరాల్లోకెళితే.. ఉత్తర ప్రదేశ్ పోలీసులు భారతదేశంలో 13,000 కంటే ఎక్కువ హ్యాండ్‌సెట్‌లు ఒకే ప్రత్యేకమైన IMEI (ఇంటర్నేషనల్ మొబైల్ ఎక్విప్‌మెంట్ ఐడెంటిటీ) పై నడుస్తున్నట్లు కనుగొన్నారు.
Airtel on Amazon Deal Report: అమెజాన్ పెట్టుబడులు ఒట్టి పుకారు, ఇలాంటి వార్తలు అనవసర పరిణామాలకు దారి తీస్తాయని తెలిపిన భారతీ ఎయిర్‌టెల్‌
Hazarath Reddyదేశీయ టెలికం కంపెనీ భారతీ ఎయిర్‌టెల్‌లో (Bharti Airtel) దాదాపు 2 బిలియన్‌ డాలర్ల (రూ.15 వేల కోట్ల) విలువైన వాటాను కొనుగోలుచేసేందుకు ఈ-కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ (Amazon) చర్చలు జరుపుతున్నట్టు వస్తున్న వార్తలపై భారతి ఎయిర్‌టెల్‌ స్పందించింది. ఎయిర్‌టెల్‌ ఈ రూమర్లను (Airtel on Amazon deal report) కొట్టి పారేసింది. ఇటువంటి ఊహాగానాలు అనవసరమైన పరిణామాలకు దారి తీస్తాయంటూ ఆందోళన వ్యక్తం చేసింది. ముఖ్యమైన అంశాలపై కంపెనీల స్పష్టమైన వివరణ లేకుండానే ఇలాంటి నివేదికలు వెలువడటం విచారకరమని వ్యాఖ్యానించింది.
Jio Investments: జియోలోకి భారీగా పెట్టుబడులు, నెరవేరుతున్న ముకేష్ అంబానీ లక్ష్యం, 1.85 శాతం వాటాను కొనుగోలు చేసిన ముబదాలా ఇన్వెస్ట్‌మెంట్
Hazarath Reddyజియో ప్లాట్‌ఫామ్‌లలో 1.85 శాతం వాటాను 9,093.60 కోట్లకు కొనుగోలు చేయనున్నట్లు అబుదాబికి చెందిన ముబదాలా ఇన్వెస్ట్‌మెంట్ (Mubadala Investment) కంపెనీ శుక్రవారం ప్రకటించింది. గత రెండు నెలల్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ జియో ప్లాట్‌ఫామ్‌లలో ఇది ఆరో పెద్ద పెట్టుబడిగా (Jio Investments) మారింది. దేశవ్యాప్తంగా లాక్డౌన్ (Lockdown) మధ్యలో, జియో ఆరు అంతర్జాతీయ సంస్థల నుండి పెట్టుబడులను కూడా చూసింది.
ZOOM Cloud Meetings: జూమ్ కొత్త వెర్షన్ వాడాలంటే డబ్బులు చెల్లించాలి, ఎఫ్‌‌బీఐ అధికారులతో పనిచేయనున్న జూమ్ సంస్థ, జూమ్‌ సీఈఓ ఎరిక్‌ యాన్‌ వెల్లడి
Hazarath Reddyప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలు లాక్‌డౌన్‌ విధించిన నేపథ్యంలో అందరూ ఇళ్లకు పరిమతమయ్యారు. ఈ నేపథ్యంలోనే వీడియో కాలింగ్ యాప్ లకు బాగా డిమాండ్ పెరిగింది. అత్యాధునిక వీడియో సెషన్స్‌కు పేరొందిన అమెరికాకు చెందిన జూమ్‌ యాప్‌ (ZOOM Cloud Meetings) లాక్‌డౌన్‌ కారణంగా గత రెండు నెలలుగా అధిక లాభాలను అర్జించినట్లు జూమ్‌ (ZOOM) సంస్థ తెలిపింది. అయితే టెక్నాలజీ, భద్రతకు ప్రాధాన్యతమిస్తు కొత్త అప్‌గ్రేడ్‌ వర్షన్‌ను ఇన్‌స్టాల్‌ చేశామని అయితే ఈ వెర్షన్‌ను ఫ్రీగా అందించడంలేదని, రీచార్జ్‌ చేసుకోవాలని జూమ్‌ సీఈఓ ఎరిక్‌ యాన్‌ తెలిపారు.
Jio New Offer: జియో తాజా ఆఫర్, రూ. 249 లేదా అంతకంటే ఎక్కువ రీచార్జ్ చేసుకునే వారికి నాలుగు డిస్కౌంట్ కూపన్లు, జూన్ 1 నుంచి 30వ తేదీ వరకు అందుబాటులో ఆఫర్
Hazarath Reddyప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్ జియో (Reliance Jio) తన వినియోగదారులకు కొత్త ఆఫర్ ను ( Jio New offfer) ప్రకటించింది. రూ. 249 లేదా అంతకంటే ఎక్కువ రీచార్జ్ చేసుకునే వారికి ఒకే విలువ గల నాలుగు డిస్కౌంట్ కూపన్లను ఇస్తున్నట్టు తెలిపింది. రిలయన్స్ ట్రెండ్స్, రిలయన్స్ డిజిటల్, రిలయన్స్ ట్రెండ్స్ ఫుట్ వేర్, ఎజియోలలో ఈ కూపన్ల ద్వారా డిస్కౌంట్ పొందవచ్చని తెలిపింది.
Cyclone Nisarga: ముంబైకి మరో పెను ముప్పు, కరోనా వేళ విరుచుకుపడనున్న నిసర్గ తుఫాన్, మొత్తం నాలుగు రాష్ట్రాల్లో హై అలర్ట్, మత్స్యకారులకు హెచ్చరిక జారీ చేసిన ఐఎండీ
Hazarath Reddyభారత ఆర్ధిక రాజధాని ముంబైపై (Mumbai) అల్పపీడనం తీవ్ర ప్రభావం (Cyclone Nisarga) చూపనుందని భారత వాతావరణ శాఖ(IMD) వెల్లడించింది. అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం బలపడుతూ తుపాన్‌గా మారనుందని తెలిపింది. ఉత్తర మహారాష్ట్ర, దక్షిణ గుజరాత్‌ మీదుగా అల్పపీడనం జూన్‌ 3న తీరం తాటుతుందని పేర్కొంది. కాగా, తుపాన్‌ మహారాష్ట్రను దాటే క్రమంలో ముంబై నగరంపై ఈ తుఫాను తీవ్ర ప్రభావం చూపనుందని ఐఎండీ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ మోహపాత్రా పేర్కొన్నారు. సోమవారం ఉదయం అల్పపీడనం ఉధృతంగా మారినట్లు తెలిపారు.
Earth's Magnetic Field Weakening: మొబైల్‌ ఫోన్లు,శాటిలైట్‌లు ఆగిపోవచ్చు, అయస్కాంత క్షేత్రాల బలహీనతే ప్రధాన కారణం, హెచ్చరిస్తున్న శాస్త్రవేత్తలు
Hazarath Reddyత్వరలో భూమి చుట్టూ ఉండే అయస్కాంత క్షేత్రం బలహీనపడుతుందని (Earth's Magnetic Field Weakening) శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. తద్వారా మొబైల్‌ ఫోన్‌లు (mobile phones), శాటిలైట్‌లు ( spacecraft) ఆగిపోవచ్చని శాస్త్రవేత్తలు (Scientists) అంచనా వేస్తున్నారు. భూమి చుట్టూ ఉండే అయస్కాంత క్షేత్రం సూర్యుడి నుంచి వచ్చే భయంకరమైన అతినీలలోహిత కిరణాల నుంచి కాపాడటమే కాకుండా మన మొబైల్‌ సిగ్నల్‌, శాటిలైట్‌ సిగ్నల్స్‌ అందించడంలో కూడా ప్రధాన పాత్ర పోషిస్తోందనే విషయం విదితమే.