టెక్నాలజీ
Mobile Bill May Rise: మళ్లీ పేలనున్న మొబైల్ బాంబు, టారిఫ్ ధరలను పెంచే యోచనలో కంపెనీలు, 25 నుంచి 30 శాతం వరకూ పెరిగే అవకాశం, విపరీతంగా పెరిగిన మొబైల్ వినియోగం
Hazarath Reddyటెల్కోలు మళ్లీ మొబైల్ యూజర్లపై బాంబును పేల్చేందుకు రెడీ అయింది. దేశంలో వంద కోట్లకు పైగా ఉన్న మొబైల్‌ ఫోన్‌ యూజర్లపై ఈ ఏడాది అధిక చార్జీల భారం(Mobile Bill May Rise) పడనుందనే సంకేతాలు వస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం యూజర్‌ (Mobile User) నుంచి సగటు రాబడి ఇంకా తక్కువగానే ఉండటమే..ఈ నేపథ్యంలో టెలికాం కంపెనీలు(Telcos) మొబైల్‌ టారిఫ్‌ను(Mobile tariff) మరోసారి 25 నుంచి 30 శాతం వరకూ పెంచే అవకాశం ఉందని భావిస్తున్నారు.
GSAT-30: ఈ ఏడాది ఇస్రో ఆరంభం అదుర్స్, నింగిలోకి విజయవంతంగా దూసుకువెళ్లిన GSAT 30, ఇంటర్నెట్ రంగంలో విప్లవాత్మక మార్పులకు నాంది పలకనున్న ఇస్రో శాటిలైట్
Hazarath Reddyభారత అంతరిక్ష పరిశోధన సంస్థ( ఇస్రో) ( ISRO)ఖాతాలో మరో అరుదైన ఘనత సాధించింది. ఇందులో భాగంగానే ఈ ఏడాది అంతరిక్ష ప్రయోగాల్లో ISRO బోణీ కొట్టింది. ఇంటర్నెట్‌ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చే అత్యాధునిక Gsat -30 ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించింది. ఫ్రెంచ్‌ గయానాలోని యూరోపియన్‌ స్పేస్‌ పోర్టు నుంచి ఎరియన్‌-5 రాకెట్‌ ద్వారా కక్ష్యలో ప్రవేశపెట్టింది.
TRAI Good News: కేబుల్ టీవీ వినియోగదారులకు గుడ్ న్యూస్, రూ.130కే 200 ఛానల్స్, 12 రూపాయలకే నచ్చిన స్పోర్ట్స్ ఛానల్, తాజాగా సవరణలు చేసిన ట్రాయ్
Hazarath Reddyకేబుల్ టీవీ వినియోగదారులకు ట్రాయ్(టెలికాం రెగులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా) (Telecom Regulatory Authority of India (TRAI))శుభవార్తను చెప్పింది. ట్రాయ్ తాజా సవరణల ప్రకారం బిల్లు భారం ఇకపై కాస్త తగ్గనుంది. కొత్త సవరణలతో కేబుల్ బిల్లులో 14 శాతం ఆదా అయ్యే అవకాశం ఉంది.
Free Jio Wi-Fi Calling: జియో కస్టమర్లకు శుభవార్త, ఉచితంగా వైఫై కాలింగ్‌ సేవలు, జియో వైఫై కాలింగ్‌ను సపోర్ట్‌ చేసే ఫోన్ల లిస్టులో మీది ఉందో లేదో ఓ సారి చెక్ చేసుకోండి
Hazarath Reddyటెలికాం సంస్థ రిలయన్స్‌ జియో తన కస్టమర్లకు వైఫై కాలింగ్‌ పేరిట (Free Jio Wi-Fi calling)మరో అద్భుతమైన ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఇకపై జియో వినియోగదారులు (Jio Users) ఏ వైఫై నెట్‌వర్క్‌కు కనెక్ట్‌ అయి ఉన్నా సరే ఆ వైఫై ద్వారా వాయిస్‌, వీడియో కాల్స్‌ (Voice, Video Calls) చేసుకోవచ్చు. జియో యూజర్ల కోసం ప్రత్యేకించి ఈ ఫీచర్ ఉచితంగా అందిస్తున్నట్టు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.
Realme 5i Smartphone: బడ్జెట్ ధరలో రియల్‌మి 5ఐ స్మార్ట్‌ఫోన్‌ భారత్‌లో విడుదల, దీని ధర మరియు ఇతర విశేషాలు ఇలా ఉన్నాయి
Vikas Mandaప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ రియల్‌మి మిడ్ బడ్జెట్ రేంజ్‌లో 'రియల్‌మి 5ఐ' (Realme 5i) స్మార్ట్‌ఫోన్‌ను భారత్‌లో విడుదల చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అంశాలు ఏమంటే, ఇందులో వెనక వైపు 4 క్వాడ్ కెమెరాలు ఉన్నాయి....
WhatsApp Tricks: వాట్సప్ వెబ్‌లో ఈ ట్రిక్స్ ప్రయత్నించారా..?, రెండు అకౌంట్లను ఎలా రన్ చేయవచ్చు..,వీడియోలు నేరుగా ఎలా చూడవచ్చు..,ఎమోజీలకు షార్ట్ కట్ ఏంటీ..,మరిన్ని వివరాలు తెలుసుకోండి
Hazarath Reddyమెసేజింగ్ రంగంలో దూసుకుపోతున్న ఇన్‌స్టంట్ మెసేజింగ్ దిగ్గజం వాట్సప్ (WhatsApp) ఎప్పటికప్పుడు వినియోగదారుల కోసం కొత్త ఫీచర్లను ప్రవేశపెడుతూనే ఉంది. 2015లో వెబ్-ఫ్రెండ్లీ వెర్షన్ యాప్ (WhatsApp Web) ప్రవేశపెట్టిన సంగతి విదితమే. మొబైల్ వెర్షన్ మాదిరిగానే డెస్క్ టాప్ యూజర్ల కోసం దీన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది.
ISRO Missions 2020: చంద్రయాన్ 3 ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం, ఈ ఏడాది గగన్‌యాన్ ప్రాజెక్టు కూడా చేపట్టబోతున్నట్లు వెల్లడించిన ఇస్రో చైర్మన్ కే. శివన్
Vikas Mandaఈ మిషన్ కు అయ్యే ఖర్చు చంద్రయాన్ -2 కంటే తక్కువగా ఉంటుందని మంత్రి తెలిపారు. వచ్చే ఏడాది చివరి నాటికి, బహుశా నవంబర్ లో చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండింగ్ కోసం ప్రయత్నాలు జరుగుతాయని ఇస్రో వర్గాల నుంచి వెల్లడవుతున్న సమాచారం.
PAN-Aadhaar Linking: భయపడకండి, పాన్-ఆధార్ లింక్ గడువును కేంద్రం పొడిగించింది, 2020 మార్చి 30 లోపు ఎప్పుడైనా మీరు లింక్ చేసుకోవచ్చని తెలిపిన ఆదాయపు పన్ను శాఖ
Hazarath Reddyఆధార్‌తో పాన్‌ కార్డు లింక్ (PAN-Aadhaar Linking) చేయలేదని భయపడుతున్నారా.. ఇకపై ఆ భయం అవసరం లేదు. ఆధార్‌తో (Aadhaar)పాన్‌ (PAN)వివరాలను లింక్‌ చేయని వారికి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్స్స్ (సీబీడీటీ)(Central Board of Direct Taxes)శుభవార్త అందించింది. పాన్ - ఆధార్ లింకింగ్ తేదీని పొడిగిస్తూ ఆదాయపు పన్ను శాఖ సోమవారం రాత్రి ట్వీట్ చేసింది. నేటితో ముగియనున్న గడువును మరో మూడు నెలల పాటు పొడిగించింది.
LED TV Free On LG G8X ThinQ: ఎల్‌జీ బంపరాఫర్, మొబైల్ కొంటే టీవీ ఉచితం, LG G8X ThinQపై ఆఫర్ ప్రకటించిన కంపెనీ, జూన్ 15 వరకు అందుబాటులో..,స్మార్ట్‌ఫోన్ ధర రూ.49 వేల 999
Hazarath Reddyన్యూ ఇయర్, పండుగ సీజన్ వస్తుండడంతో పలు కంపెనీలు భారీ డిస్కౌంట్లు,(Discounts) ఆఫర్లు (Offers) ప్రకటిస్తున్నాయి. అందులో భాగంగా ఎల్‌జీ(LG) కంపెనీ తమ సెల్ ఫోన్ కొంటే టీవీ ఫ్రీగా(LED TV Free On LG G8X ThinQ) తీసుకపోవచ్చని వెల్లడిస్తోంది. ఈ ఫోన్ ద్వారా వినియోగదారులకు టీవీని ఉచితంగానే డెలివరీ చేస్తామని ఆ కంపెనీ ప్రకటిస్తోంది.
Free WiFi Services: దేశమంతా ఉచిత వైఫై, భారత్‌నెట్‌ ప్రాజెక్టు పరిధిలోకి అన్ని గ్రామాలు, వచ్చే మార్చిలోపు 2.5 లక్షల గ్రామ పంచాయతీలకు ఉచిత వైఫై అందించే దిశగా అడుగులు, వెల్లడించిన కేంద్ర ఐటీ మంత్రి రవిశంకర్ ప్రసాద్
Hazarath Reddyభారత్‌నెట్‌ (Bharatnet) ప్రాజెక్టు పరిధిలోని అన్ని గ్రామాలకూ వచ్చే మార్చి వరకు వైఫై ఉచితంగా (Free WiFi Services)అందిస్తున్నామని కేంద్ర మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ (IT Minister Ravi Shankar Prasad) హర్యానాలోని (Haryana) రేవారికి వచ్చిన సందర్భంగా చెప్పారు. ‘‘భారత్‌నెట్‌ ఆప్టికల్‌ ఫైబర్‌ నెట్‌వర్క్‌ను ఇప్పటికే 1.3 లక్షల గ్రామ పంచాతీయలకు అనుసంధానించాం. 2.5 లక్షల గ్రామ పంచాయతీలను చేరుకోవాలన్నది ప్రభుత్వ లక్ష్యమని ఆయన అన్నారు.
MIG-27: పాక్‌ను హడలెత్తించిన యుద్ధ విమానాలకు ఘనమైన వీడ్కోలు, కార్గిల్ యుద్ధంలో కీలక పాత్ర పోషించిన మిగ్-27, మూడు దశాబ్దాల పాటు సేవలు, వాటికి ఆర్మీ పెట్టిన ముద్దు పేర్లు ఓ సారి తెలుసుకోండి
Hazarath Reddyభారత వాయుసేనలో అతి శక్తిమంతమైన మిగ్‌-27 యుద్ధవిమానం (MIG-27) చరిత్ర పుటలకెక్కింది. మూడు దశాబ్దాలకు పైగా చెరగని సేవలందించిన ఈ లోహ విహంగాలకు ఐఏఎఫ్‌(IAF) ఘన వీడ్కోలు పలికింది. రాజస్థాన్‌లోని జోధ్‌పుర్‌ (JODHPUR)వైమానిక స్థావరం నుంచి ఏడు మిగ్‌ -27 విమానాలు చివరిసారి గగనవిహారం చేశాయి. చివరిసారిగా నింగికెగిరిన ఈ విమానాలకు ల్యాండింగ్‌ అయిన తర్వాత జల ఫిరంగుల ద్వారా గౌరవ వందనం సమర్పించారు.
CH59 Asteroid: ఎఫ్‌-16 యుద్ధ విమానాలను మించిన వేగంతో దూసుకువస్తున్న గ్రహశకలం, భూమికి దగ్గరగా వస్తున్న సీహెచ్59 ఆస్టరాయిడ్, అత్యంత ప్ర‌మాద‌క‌ర‌మైన ఈ గ్ర‌హ‌శ‌క‌లంతో భూమికి ప్రమాదం లేదన్న నాసా
Hazarath Reddyభారీ గ్ర‌హ‌శ‌క‌లం భూమికి(Earth) అత్యంత స‌మీపంగా వెళ్ల‌నున్న‌ది. నేడు ఆ గ్ర‌హ‌శ‌క‌లం (asteroid)భూ క‌క్ష్య‌కు ద‌గ్గ‌ర నుంచి వెళ్తుంద‌ని శాస్త్ర‌వేత్త‌లు వెల్ల‌డించారు. ఈ ఆస్ట‌రాయిడ్‌ను 2000 సీహెచ్‌59గా(2000 CH59)) గుర్తించారు. ఆ గ్ర‌హ‌శ‌క‌లం సుమారుగా 2034 అడుగుల వెడ‌ల్పు(2,034-foot asteroid) ఉన్న‌ది.
Jio ‘2020’ Offer: జియో నుంచి బంపరాఫర్, రూ.2020తో రీఛార్జ్ చేసుకుంటే ఏడాది‌ పాటు అన్ లిమిటెడ్, డిసెంబర్ 24 నుంచి ప్లాన్ అమల్లోకి, స్మార్ట్‌ఫోన్, జియోఫోన్ యూజర్లంతా అర్హులే
Hazarath Reddyటెలికాం రంగంలో దూసుకుపోతున్న దేశీయ దిగ్గజం రిలయన్స్ జియో (Reliance Jio)తాజాగా మరో బంపరాఫర్ ప్రకటించింది. కస్టమర్ల కోసం జియో 2020 హ్యాపీ న్యూ ఇయర్‌ ఆఫర్‌ను(2020 Happy New Year Offer) అందుబాటులోకి తీసుకువచ్చింది.
Airtel Wi-Fi Calling: అదనపు ఛార్జీలు అవసరం లేదు, ఎక్కడి నుంచైనా వైఫై కాలింగ్ సర్వీస్, తెలుగు రాష్ట్రాల్లో అందుబాటులోకి తీసుకువచ్చిన ఎయిర్‌టెల్, సపోర్ట్ చేసే ఫోన్ల లిస్ట్ ఓ సారి తెలుసుకోండి
Hazarath Reddyతెలుగు రాష్ట్రాల్లోని తమ కస్టమర్లకు ఎయిర్‌టెల్ (Bharti Airtel) మరో సదుపాయాన్నిఅందుబాటులోకి తీసుకువచ్చింది. డేటా కనెక్షన్, రీచార్జ్ లేకున్నా, వైఫై సదుపాయంతో కాల్ చేసుకునే సౌకర్యం వైఫై కాలింగ్ సర్వీసును (Airtel Wi-Fi Calling) యూజర్ల కోసం తీసుకువచ్చింది. దీని ద్వారా మరింత మెరుగైన వాయిస్ కాలింగ్ (Voice Calling)అనుభూతి కలుగుతుందని, ఏ నెట్ వర్క్‌లోని కస్టమర్లకైనా వైఫై ద్వారా కాల్స్ చేసుకోవచ్చని, రిసీవ్ చేసుకోవచ్చని, ఇందుకు ఎటువంటి అదనపు చార్జీలు ఉండవని కంపెనీ పేర్కొంది.
BSNL Mithram Plus Plan: బీఎస్ఎన్ఎల్ 5జీబీ డేటా ప్లాన్, 90 రోజుల వ్యాలిడిటీ, కేవలం 109 రూపాయలకే, 250 నిమిషాల వాయిస్ కాలింగ్‌ సదుపాయం
Hazarath Reddyప్రభుత్వ టెలికం రంగం దిగ్గజం భారత్ సంచార్ నిగం లిమిటెడ్ (Bharat Sanchar Nigam Limited)(బీఎస్ఎన్ఎల్) కొత్త ప్రీపెయిడ్‌ ప్లాన్‌ను లాంచ్‌ చేసింది. రూ. 90 రోజుల చెల్లుబాటుతో రూ. 109 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ తాజాగా వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. "మిత్రం ప్లస్" (Mithram Plus) పేరుతో తీసుకొచ్చిన ఈ ప్రీపెయిడ్ ప్లాన్‌లో మొత్తం 5జీబీ డేటాను యూజర్లకు అందిస్తోంది.
Windows 10 Good News: ఇకపై పీసీ నుంచే నేరుగా కాల్స్ చేసుకోవచ్చు, విండోస్ 10లోకి కొత్త ఫీచర్, ఫోన్‌కు వచ్చే ఎస్‌ఎంఎస్‌లను కూడా పీసీలోనే చూడవచ్చు, ఎలా లాగిన్ కావాలో ఓ సారి తెలుసుకోండి
Hazarath Reddyదిగ్గజ సాఫ్ట్‌వేర్ సంస్థ మైక్రోసాఫ్ట్ తన విండోస్ 10 పీసీ (Windows 10 PC Users) యూజర్ల కోసం ఓ సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఇకపై యూజర్లు తమ పీసీని, ఆండ్రాయిడ్ ఫోన్‌ను (Android Phone) కనెక్ట్ చేసుకుని నేరుగా పీసీ (PC) నుంచే కాల్స్ చేసుకోవచ్చు, అలాగే వాటిని రీసీవ్ చేసుకోవచ్చు.దీంతో పాటుగా ఫోన్‌కు (Android Phone) వచ్చే ఎస్‌ఎంఎస్‌లను(SMS) కూడా పీసీలోనే చూసుకోవచ్చు.
Mobile Number Portability: 3 రోజుల్లో మొబైల్ నంబర్ పోర్టబిలిటీ, నేటి నుంచి అమల్లోకి రానున్న ట్రాయ్ నిబంధనలు, మీరు మీ నంబర్ పోర్ట్ చేయడానికి కనీస ఛార్జ్ రూ 6.46
Hazarath Reddyమొబైల్ నంబర్‌ను పోర్ట్ చేయడానికి ఇకపై వారాల తరబడి రోజులు వేచి ఉండాల్సిన అవసరం లేదు. ఒకే సర్కిల్‌లో అయితే కేవలం 3 రోజుల్లోనే నెంబర్‌ పోర్టబిలిటీ (Mobile Number Portability) ప్రక్రియను పూర్తి చేయవచ్చు. నేటి నుంచి ఈ నిబంధనలు అమల్లోకి వచ్చాయి. ఈ నూతన నిబంధనలతో టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్)(Telecom Regulatory Authority of India) మొబైల్ నంబర్ పోర్టబిలిటీ (ఎంఎన్‌పి) ప్రక్రియను సులభతరం చేసింది.
Fake iPhone On Flipkart: ఫ్లిప్‌కార్ట్‌లో భారీ మోసం, రూ.93 వేలు పెట్టి ఐఫోన్ 11 ప్రో ఆర్డర్ చేస్తే నకిలీ ఫోన్ పంపించారు, వెంటనే కంపెనీకి ఫిర్యాదు చేసిన కస్టమర్, కొత్త ఫోన్ ఇస్తామని తెలిపిన ఫ్లిప్‌కార్ట్‌ యాజమాన్యం
Hazarath Reddyఈ కామర్స్ వెబ్‌సైట్లలో అనేక మోసాలు జరుగుతున్నాయి. కస్టమర్లు ఒకటి ఆర్డర్ చేస్తే దాని ప్లేసులో మరొకటి డెలివరీగా వస్తోంది. వేలకు వేలు డబ్బులు కట్టించుకుని నకిలీ ఐటెమ్స్ డెలివరీ చేస్తున్నారు. ఇప్పటికే అనేక మోసాలు వెలుగు చూసిన నేపథ్యంలో తాజాగా ఫ్లిప్‌కార్ట్‌లో(Flipkart) మరో భారీ మోసం వెలుగు చూసింది.
WhatsApp New Tools: వాట్సప్‌లో బల్క్ మెసేజ్‌లు విసిగిస్తున్నాయా? ఇకపై అలాంటి బెడద లేదు, కొత్త టూల్స్‌ని తీసుకొస్తున్న వాట్సప్, స్పామర్లపై లీగల్ యాక్షన్ తీసుకుంటామన్న వాట్సప్
Hazarath Reddyసోషల్ మీడియలో దూసుకుపోతున్న ఇన్‌స్టంట్ మెసేజింగ్ దిగ్గజం వాట్సప్ యూజర్లకు (Whatsapp Users)శుభవార్తను చెప్పింది. ఇకపై మీ మొబైల్ లోని వాట్సప్ కు బల్క్ మెసేజ్ లు రాకుండా గట్టి చర్యలు తీసుకుంటున్నట్లు ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే వాట్సప్ బిజినెస్ స్పామర్లకు చెక్ పెట్టింది. బిజినెస్ యాప్ ప్లాట్ ఫాంపై స్పామ్ మెసేజ్ పంపే సంస్థలపై ఓ కన్నేసి ఉంచింది.
ISRO RISAT-2BR1: పిఎస్ఎల్వి-సి 48 ప్రయోగం విజయవంతం, భారత గూఢాచార వ్యవస్థను పటిష్ఠ పరిచే అధునాతన ఉపగ్రహహం రిసాట్ -2 బిఆర్1తో పాటు, 9 విదేశీ ఉపగ్రహాలను నిర్దేశిత కక్ష్యలో ప్రవేశపెట్టిన ఇస్రో
Vikas Mandaరిసాట్ -2 బిఆర్1 వెంట మరో తొమ్మిది విదేశీ ఉపగ్రహాలు అమెరికాకు చెందిన 4 మల్టీ-మిషన్ లెమూర్ ఉపగ్రహాలు, ఇజ్రాయెల్ కు చెందిన రిమోట్ సెన్సింగ్, డచిఫాట్ సేవల 3 ఉపగ్రహాలు, ఇటలీకి చెందిన...