BSNL (Photo Credit: Livemint)

ప్రభుత్వరంగ సంస్థ BSNL బ్రాడ్ బ్యాండ్ సేవలపై ఎక్కువ దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా రూ.275 రూపాయలకే 75 రోజుల పాటు ఫైబర్ బ్రాడ్ బ్యాండ్ సేవలను ఆఫర్ చేస్తోంది. అయితే బీఎస్ఎన్ఎల్ లో రూ.275 రూపాయలతో రెగ్యులర్ బ్రాడ్ బ్యాండ్ నెలవారీ ప్లాన్ ఏదీ లేదు. భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాల సందర్భంగా ఈ ఆఫర్ ను (Independence Day 2022 Offer) ప్రకటించింది. బీఎస్ఎన్ఎల్ బ్రాడ్ బ్యాండ్ నెలవారీ ఆరంభ ప్లాన్ రూ.449. ఇప్పుడు ఆఫర్ లో భాగంగా ఈ ప్లాన్ లో చేరి మూడు నెలల పాటు సేవలను రూ.275కే పొందొచ్చు. ఆ తర్వాత నుంచి ప్రతి నెలా రూ.449 చెల్లించాల్సి ఉంటుంది.

అలాగే, రూ.599 రెగ్యులర్ ప్లాన్ ను సైతం 75 రోజుల పాటు (Get 75 Days of Broadband Service just Rs 275) రూ.275కే అందిస్తోంది. ఆ తర్వాత నుంచి ప్రతి నెలా రూ.599 చార్జ్ చేస్తారు. ఇక రూ.999 ప్లాన్ తీసుకుంటే.. ఆఫర్ కింద 75 రోజులకు రూ.775 చెల్లిస్తే చాలు. ఆ తర్వాత నుంచి ప్రతి నెలా రూ.999 చెల్లించాలి. రూ.449 ప్లాన్ కింద 30 ఎంబీపీఎస్ స్పీడ్ వేగంతో నెట్ సేవలు పొందొచ్చు. నెలవారీ 3.3 టీబీ డేటా వరకు ఈ స్పీడ్ అమలవుతుంది.

వాట్సాప్‌లో అదిరిపోయే కొత్త ఫీచర్, డిలీట్ అయిన మెసేజ్‌, ఫోటోలను రికవరీ చేయొచ్చు, మీకు కూడా ఈ ఫీచర్ కావాలంటే సింపుల్‌గా ఇలా చేయండి చాలు!

ఆ తర్వాత 2 ఎంబీపీఎస్ కు వేగం తగ్గుతుంది. రూ.599 ప్లాన్ లో 60 ఎంబీపీఎస్ వేగంతో డేటా సేవలు లభిస్తాయి. నెలవారీ 3.3టీబీ డేటా పరిమితి దాటితే, తర్వాత నుంచి 2 ఎంబీపీఎస్ కు వేగం తగ్గుతుంది. రూ.999 ప్లాన్ లో 150 ఎంబీపీఎస్ వేగంతో బ్రాడ్ బ్యాండ్ సేవలు లభిస్తాయి. 2 టీబీ డేటా వరకు ఈ వేగ పరిమితి ఉంటుంది. ఈ ప్లాన్ లో ఓటీటీ యాప్స్ కూడా ఉచితం.