Newdelhi, Nov 6: విశ్వంలో (Universe) అంతుబట్టని రహస్యాలెన్నో. వీటిని ఛేదించేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్న అమెరికా (America) ఖగోళ పరిశోధకులు ఓ షాకింగ్ విషయాన్ని కొనుగొన్నారు. విశ్వంలో జరిగే కిలో నోవా (Kilonova) అంతరిక్ష పేలుడు భూమిపై ఉన్న జీవం అంతానికి కారణమవుతుందని తేల్చారు. రెండు న్యూట్రాన్ నక్షత్రాలు ఢీకొట్టుకోవడం లేదా న్యూట్రాన్ స్టార్ బ్లాక్ హోల్ లో కలిసిపోవడాన్ని కిలోనోవా అంటారు. భూమి నుంచి 36 కాంతి సంవత్సరాల దూరంలో గనుక ఈ కిలోనోవా దృగ్విషయం సంభవిస్తే గామా, ఎక్స్, కాస్మిక్ కిరణాలు ప్రాణాంతకమైన రేడియేషన్‌ను విడుదల చేస్తాయని, దీనివల్ల భూమిపై ఉన్న జీవరాశి తుడుచుకుపెట్టుకుపోతుందని పరిశోధకులు గుర్తించారు.
'Extinction-Level Event': Kilonova Space Explosion Could End Life On Earth For 1,000 Years https://t.co/R75BEzD5nI
Nobody can touch anything in earth 🌍. God will protect the earth.
— Arun Panicker (@apbosstweet) November 5, 2023
ఇప్పుడు కాదు
భూమికి ఇప్పటికిప్పుడు ముంచుకొచ్చిన ప్రమాదమేమీ లేదని, కిలోనోవాలాంటి దృగ్విషయాలు చాలా అరుదుగా జరుగుతాయని తెలిపారు. ఒకవేళ ఇలాంటి విపత్తు జరుగాల్సి ఉంటే అది వెయ్యి ఏండ్ల తరువాతే అని పేర్కొన్నారు.