Newdelhi, October 23: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో (ISRO) గత అర్ధరాత్రి సరిగ్గా 12.07 గంటలకు చేపట్టిన ఎల్‌వీఎం-3 ప్రయోగం విజయవంతమైంది. వన్‌వెబ్ (Oneweb) అభివృద్ధి చేసిన 36 ఉపగ్రహాలతో విజయవంతంగా నింగికెగసిన రాకెట్ (Rocket) వాటిని నిర్ణీత కక్ష్యలో (Orbit) ప్రవేశపెట్టింది. ఎల్‌వీఎం3-ఎం2/వన్‌వెబ్ ఇండియా-1 మిషన్ విజయవంతంమైందని, 36 ఉపగ్రహాలను నిర్ణీత కక్ష్యలో ప్రవేశపెట్టామని ఇస్రో ప్రకటించింది. జియోసింక్రనస్ లాంచ్ వెహికల్ (జీఎల్ఎల్‌వీ ఎంకే-3)కి అప్‌గ్రేడెడ్ వెర్షన్ అయిన లాంచ్ వెహికల్ మార్క్-3 ద్వారా ఉపగ్రహాలను నింగిలోకి పంపింది. శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ఈ ప్రయోగం జరిగింది.
జీఎస్ఎల్‌వీ ఎల్‌వీఎం 3 పేలోడ్ సామర్థ్యం 10 టన్నులు కాగా, ఆరు టన్నుల బరువుతోనే నింగిలోకి దూసుకెళ్లింది. ఎల్‌వీఎం-3 ద్వారా చేపట్టిన తొలి వాణిజ్య ప్రయోగం ఇదే. ఈ మిషన్ కోసం వన్‌వెబ్-న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ మధ్య ఒప్పందం కుదిరింది. ఈ శాటిలైట్లను రాకెట్ జియోసింక్రనస్ కక్ష్యలో కాకుండా భూమికి 1200 కిలోమీటర్ల ఎత్తులో లో ఎర్త్ ఆర్బిట్ (ఎల్ఈఓ)లో రాకెట్ ప్రవేశపెట్టింది. అందుకనే ఈ లాంచ్ వెహికల్ పేరును జీఎల్ఎల్‌వీ నుంచి ఎల్‌వీఎంగా మార్చారు. జియోసింక్రనస్ ఆర్బిట్ భూ మధ్య రేఖకు 35,786 కిలోమీటర్ల ఎత్తులో ఉంటుంది.
ISRO launches 36 satellites of OneWeb onboard #LVM3.
The LVM3-M2 mission is a dedicated commercial mission for a foreign customer OneWeb, through NSIL
🚀First Indian rocket with 6 ton payload. pic.twitter.com/1Cj0vmAMAn
— All India Radio News (@airnewsalerts) October 22, 2022