TSRTC Image used for representational purpose only |Photo Wikimedia Commons

Hyderabad, OCT 22: మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో ప్రస్తుతం ఎన్నికల నియమావళి అమలులో (Election Code) ఉన్నందున టిఎస్ఆర్టీసి (TSRTC) ఉద్యోగులకు ఇవ్వనున్న పీఆర్సీకి (PRC) అవసరమైన చట్టపరమైన అనుమతుల కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రోడ్డు, భవనాలు, రవాణా శాఖ కార్యదర్శి ఎన్నికల ప్రధాన అధికారికి లేఖ రాశారని అన్నారు. టిఎస్ఆర్టీసీ సంస్థ (TSRTC) ఉద్యోగుల విజ్ఞప్తి మేరకు పీఆర్సీ పెంపు ప్రక్రియను ప్రారంభించడానికి అనుమతి ఇవ్వాలని ఆ లేఖలో పేర్కొన్నట్టు బాజిరెడ్డి గోవర్థన్ (Bajireddy govardhan) పేర్కొన్నారు. ఎన్నికల ప్రధాన అధికారి నిర్ణయం అనంతరం సంస్థ ఉద్యోగులకు వెంటనే పిఆర్సి అమలు చేయనున్నట్టు బాజిరెడ్డి గోవర్ధన్ స్పష్టంచేశారు.

Telangana High Court: జగన్ అక్రమాస్తుల కేసులో ఇండియా సిమెంట్స్‌కు తెలంగాణ హై కోర్టులో ఊరట 

టిఎస్ఆర్టిసి ఉద్యోగులకు నిన్న బస్ భవన్ సాక్షిగా 100 కోట్ల పెండింగ్ బకాయిలు, దీపావళి పండగ సందర్భంగా అడ్వాన్సులు ప్రకటించిన నేపథ్యంలో పిఆర్సి (PRC) గురించి మీడియా ప్రస్తావించగా ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ వివరణ ఇచ్చారు. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆర్టీసీ ఉద్యోగులకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారని, అందులో భాగంగానే ఈరోజు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుని మర్యాదపూర్వకంగా కలిసి సంస్థ ఉద్యోగుల పిఆర్సి గురించి చర్చించడం జరిగిందన్నారు. ఈ సందర్భంగానే ముఖ్యమంత్రి కేసీఆర్ పిఆర్సి అమలుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారన్నారు.

Munugode Bypolls: బీజేపీ వాళ్లు ఇచ్చే తులం బంగారం, డబ్బులు తీసుకొని ఓటు టీఆర్ఎస్ కు వేయండి, మంత్రి కేటీఆర్ పిలుపు..  

తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ సంస్థ ఉద్యోగులకు 2017 నుండి రివైజ్డ్ పే స్కేల్ పెండింగ్‌లో ఉంది. పెండింగ్‌లో ఉంటూ వస్తోన్న ఈ ప్రక్రియను వెంటనే ప్రారంభించడానికి కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ విసి సజ్జానార్ ప్రభుత్వానికి లేఖలు రాయడం జరిగిందని.. అందులో భాగంగానే నేడు తెలంగాణ రాష్ట్ర రవాణా మరియు రోడ్డు భవనాల శాఖ కార్యదర్శి ఎన్నికల ప్రధాన అధికారి లేఖలు రాసినట్టు బాజిరెడ్డి గోవర్థన్ మీడియాకు తెలిపారు. ఎన్నికల ప్రధాన అధికారి నుంచి అనుమతి వచ్చిన వెంటనే టిఎస్ఆర్టీసీ సిబ్బందికి పీఆర్సీ అమలు చేయనున్నట్టు బాజిరెడ్డి గోవర్థన్ తేల్చిచెప్పారు.