చౌటుప్పల్ కేంద్రంలో టీఆర్‌ఎస్ పార్టీ నిర్వహించిన రోడ్ షోలో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు. అవసరమైతే ఓటుకు తులం బంగారం ఇస్తానని రాజగోపాల్ రెడ్డి చెబుతుండంట. ఆ తులం బంగారం తీసుకోండి.. ఓటు మాత్రం అండగా ఉన్న కారు గుర్తుకు వేయండి. ఈ పైసలు గుజరాత్ గద్దల పైసలు. మునుగోడు ఆత్మగౌరవాన్ని కొనేందుకు ఎర వేస్తున్నారు. డబ్బు అహంకారానికి ఓటుతో సమాధానం చెప్పాలని ఓటర్లకు కేటీఆర్ పిలుపునిచ్చారు.
Pawan Kalyan: పవన్ కల్యాణ్‌కు ఏపీ మహిళా కమిషన్ షాక్, మహిళలకు క్షమాపణ చెప్పాలని నోటీసులు..
నల్లగొండ జిల్లాలో ఫ్లోరైడ్ సమస్య ఉన్నదని.. దాని నిర్మూలించేందుకే సీఎం కేసీఆర్ మిషన్ భగీరథ ప్రారంభించారు. నీతి ఆయోగ్ ఆ ప్రాజెక్టును ప్రశంసించి, రూ. 19 వేల కోట్లు ఇవ్వాలని కేంద్రానికి సిఫారసు చేసింది. కానీ కేంద్రం 19 పైసలు కూడా ఇవ్వలేదు. రాజగోపాల్ రెడ్డికి మాత్రం రూ. 18 వేల కోట్ల కాంట్రాక్ట్ ఇచ్చిండు. రాజగోపాల్ రెడ్డిని అడ్డం పెట్టుకుని ఇక్కడ చొరబడుతున్నాడు.