గత 30 నిమిషాలుగా వాట్సాప్ సేవలు నిలిచిపోయాయి.సోషల్ మీడియాలో నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. ట్విట్టర్ వేదికగా వాట్సాప్ సేవలు నిలిచిపోయాయంటూ స్క్రీన్ షాట్లు పెడుతున్నారు.కొన్ని సాంకేతిక సమస్యలతో వాట్సాప్ యూజర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సమాచారం ప్రకారం.. అక్టోబర్ 25 మధ్యాహ్నం 12:30 గంటల నుంచి దేశవ్యాప్తంగా వాట్సాప్ సేవలకు అంతరాయం ఏర్పడింది. వాట్సాప్‌లో యూజర్లు పంపిన మెసేజ్‌ల డెలివరీ స్టేటస్ చూపించడం లేదు. వాట్సాప్‌లో డబుల్ టిక్ , బ్లూటిక్ మార్కులు చూపించడం లేదు.
దీంతో మెసేజ్ వెళ్లిందా లేదా అన్నదానిపై అయోమయంలో ఉన్నారు యూజర్లు. ఇప్పటికే వేల మంది వినియోగదారులు వెబ్‌సైట్‌లో ఈ సమస్యపై ఫిర్యాదు చేశారు. అందులో కొందరు యూజర్లు మెసేజ్‌లు పంపడంలో సమస్యలను ఎదుర్కొంటుండగా, మరికొందరు సర్వర్ కనెక్షన్ సంబంధిత సమస్యలు ఉన్నాయని, బ్లూ టిక్ కనిపించడం లేదని ఫిర్యాదులో పేర్కొన్నారు.
WhatsApp services have been down for the last 30 minutes. pic.twitter.com/9WL4mMFTRO
— ANI (@ANI) October 25, 2022
మరోవైపు ట్విట్టర్‌లో వాట్సాప్ యూజర్లు.. ‘వాట్సాప్ డౌన్’ (#Whatsapp Down) అనే హ్యాష్‌ట్యాగ్‌ని ట్రెండింగ్‌లోకి తీసుకొచ్చారు. దీనిపై ఫన్నీగా స్పందిస్తూ కామెంట్లు పెడుతున్నారు.