చండీగఢ్ యూనివర్సిటీలో 60 మంది విద్యార్థినులు స్నానం చేస్తున్న వీడియోలు బయటకు వచ్చిన తరువాత దేశ వ్యాప్తంగా మహిళల భద్రత మరోసారి తెరపైకి వచ్చింది. ఈ నేపథ్యంలో మహిళలు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా మహిళలు బయట పబ్లిక్ టాయెలెట్లకు వెళ్లిన సమయంలో చాలా చోట్ల సీక్రెట్ కెమెరాలు (Secret Cameras) ఉంటున్నాయి. వీటిని (Hidden in Bathroom) మహిళలు గుర్తించలేకపోవడం వల్ల వారికి తెలియకుండానే వారి వీడియోలు బయటకు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో వాటిని ఎలా గుర్తించాలనే దానిపై కొన్ని టిప్స్ (How to Detect Hidden Cameras) ఇస్తున్నాం. ఓ సారి తెలుసుకోండి.
వాష్ రూమ్ కు వెళ్లగానే ముందుగా చుట్టు పక్కల పైన ఏవైనా ఎలక్ట్రికల్ పరికరాలు ఉన్నాయా చూడాలి. ముఖ్యంగా పైన కెమెరాలు అమర్చే ప్రమాదం ఉంది కాబట్టి పైన చూడాలి. అలాగే టిష్యూ బాక్స్ లో ఎవరూ పరిశీలించరు. అక్కడ కూడా కూడా కెమెరాలు పెడతారని ఊహించరు. కానీ టిష్యూ బాక్స్ లలో కూడా కెమెరాలను అమర్చే ప్రమాదం ఉందని నివేదికలు చెబుతున్నాయి. కాబట్టి టిష్యూ బాక్స్ లను కూడా ఖచ్చితంగా పరిశీలించాలి. మెబైల్ ఫోన్ ల ద్వారా కూడా సీసీ కెమెరాలు ఉన్నాయా లేదా అని గమనించవచ్చు.
మెబైల్ తో ఫోన్ చేసినప్పుడు కాల్ కు అంతరాయం కలిగితే అక్కడ సీసీ కెమెరాలు ఉన్నట్టు అనుమానించాలి. ఫోన్ కెమెరాతో కూడా సీక్రెట్ కెమెరాలు అమర్చి ఉన్నట్టయితే గుర్తించవచ్చు. మీ ఫోన్ కెమెరా సహాయంతో సీక్రెట్ కెమెరాల నుండి వచ్చే ఇన్ ఫ్రారెడ్ కిరణాలను గుర్తించవచ్చు. కాబట్టి ఏదైనా అనుమానం వస్తే మీ ఫోన్ కెమెరా తో చెక్ చేయడం మంచిది. ఇందుకోసం గూగుల్ ప్లే స్టోర్ నుండి కొన్ని యాప్స్ డౌన్లోడ్ చేసుకోవాలి. Hidden Camera Detector app గూగుల్ ప్లోస్టోర్ లో లభ్యం అవుతోంది. దీని ద్వారా మీరు సీక్రెట్ కెమెరాల గురించి తెలుసుకోవచ్చు.