World
5 Lakh Free Air Tickets: 5 లక్షల ఉచిత విమానయాన టిక్కెట్లను అందిస్తోన్న హాంగ్‌కాంగ్, టూరిజంలో ద్వారా ఆర్థిక వ్యవస్థ మెరుగుపరుచుకునే పనిలో పర్యాటక దేశం
Hazarath Reddyహాంగ్‌కాంగ్ తమ దేశానికి వచ్చే పర్యాటకులను ఆకర్షించే ప్రయత్నంలో 5 లక్షల ఉచిత విమానయాన టిక్కెట్లను, వోచర్లను అందిస్తోంది.ఇటీవలి నెలల్లో నగరం కోవిడ్ ప్రయాణ పరిమితులను ఉపసంహరించుకుంది. మహమ్మారి తన పర్యాటక పరిశ్రమపై చూపిన భారీ ప్రభావం నుండి ఇప్పుడు తిరిగి బౌన్స్ అవ్వాలని భావిస్తోంది.
Pakistan Mosque Blast: మసీదును పేల్చిన ఉగ్రవాదులు, 100 మందికి పైగా మృతి, వారిలో 97 మంది పాకిస్తాన్ పోలీసులే..
Hazarath Reddyపాకిస్థాన్‌లోని పెషావర్‌లో గల ఓ మసీదులో ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ దాడిలో మృతుల సంఖ్య 100కి పెరిగినట్లు పోలీసులు తాజాగా వెల్లడించారు. అందులో 97 మంది పోలీసులే ఉన్నట్లు తెలిపారు. ఈ దాడిలో సుమారు 150 మందికిపైగా గాయపడ్డారు.
FedEx Layofffs: మరో కంపెనీలో ఊడుతున్న ఉద్యోగాలు, 10 శాతం ఎంప్లాయిస్‌ను తొలగించనున్న ఫెడెక్స్, రానున్న రోజుల్లో మరింత ఉద్యోగాలు ఊస్ట్
VNSఇప్పటికే ఐటీ కంపెనీలు, పలు మల్టీ నేషనల్ కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తున్నాయి. తాజాగా ఫెడెక్స్ (FedEx) కూడా ఆ జాబితాలో చేరిపోయింది. ఆఫీసర్, డైరక్టర్ ర్యాంకుల్లోని 10 శాతం మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ఫెడెక్స్ (FedEx) ప్రకటించింది. ఖర్చులను తగ్గించుకోవడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ తెలిపింది.
Mukesh Ambani Overtakes Gautam Adani: గౌతం అదానీని వెనక్కి నెట్టేసిన ముఖేష్ అంబానీ, 84.3 బిలియన్‌ డాలర్ల సంపదతో ప్రపంచంలోనే సంపన్నుడైన భారతీయుడిగా బిలియనీర్
Hazarath Reddyరిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ చైర్మన్‌, బిలియనీర్ ముఖేష్ అంబానీ సంపదలో అదానీ గ్రూప్‌ చైర్మన్‌ గౌతమ్‌ అదానీని వెనక్కి నెట్టేశారు. ప్రస్తుతం 84.3 బిలియన్‌ డాలర్ల సంపదతో అంబానీ ప్రపంచంలోనే సంపన్నుడైన భారతీయుడిగా అవతరించారు. గౌతమ్‌ అదానీ 83.9 బిలియన్‌ డాలర్ల సంపదతో అంబానీ తర్వాత స్థానానికి పడిపోయారు.
Layoffs in PayPal: మరో మూడు కంపెనీల్లో భారీగా ఉద్యోగుల తొలగింపు, అన్ని కంపెనీలకు పాకిన లే ఆఫ్స్, ఈ ఏడాది మరిన్ని సంస్థల్లో ఉద్యోగులకు కష్టాలు తప్పేలా లేదు, పేపాల్, హబ్ స్పాట్, హర్పర్ కొలిన్స్ లో పెద్ద ఎత్తున ఉద్యోగుల తొలగింపు
VNSతాజాగా పేపాల్ (Layoffs in PayPal) కంపెనీతో పాటూ హబ్ స్పాట్, హర్పల్ కొలిన్స్ కంపెనీలు తమ ఉద్యోగుల్లో కొంతమందికి ఉద్వాసన పలికాయి. పేపాల్ కంపెనీలోని 2వేల మందిని తొలగిస్తున్నట్లు ప్రకటించింది. అటు హబ్ స్పాట్ (Layoffs in HubSpot) కూడా తమ కంపెనీలో పనిచేస్తున్న 500 మందిని తొలగించింది. ఆర్ధిక భారాన్ని తగ్గించుకునేందుకు ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు కంపెనీలు ప్రకటిస్తున్నాయి.
Valentine’s Day 2023: తొమ్మిది కోట్ల 50 లక్షల కండోమ్‌లు ఉచితంగా పంపిణీ చేస్తున్న థాయిలాండ్, సురక్షితమైన సెక్స్‌ను ప్రోత్సాహించే దిశగా అడుగులు వేస్తున్న ఆగ్నేయాసియా దేశం
Hazarath Reddyవాలెంటైన్స్ డే 2023 దగ్గరలోనే ఉంది.ఈ నేపథ్యంలో ఆగ్నేయాసియా దేశం ప్రేమికుల దినోత్సవానికి ముందు సురక్షితమైన సెక్స్‌ను ప్రోత్సహించాలని కోరుతున్నందున, లైంగికంగా సంక్రమించే వ్యాధులు (STDలు), యుక్తవయస్సులో గర్భధారణను అరికట్టడానికి థాయిలాండ్ 95 మిలియన్ల ఉచిత కండోమ్‌లను పంపిణీ చేయాలని యోచిస్తోంది.
Pakistan Mosque Blast: పెషావర్ మసీదులో ఆత్మాహుతి దాడి, 83కి పెరిగిన మృతుల సంఖ్య, పలువురి పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం
Hazarath Reddyపాకిస్థాన్‌లోని పెషావర్‌లో తాలిబన్‌లు ఆత్మాహుతి దాడికి పాల్పడిన ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. మంగళవారం ఉదయానికి మృతుల సంఖ్య 83కి పెరిగినట్లు అధికారులు వెల్లడించారు. ఈ దుర్ఘటనలో 150 మందికి పైగా గాయపడ్డారు. 100 మందికిపైగా క్షతగాత్రులు వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
Pakistan Horror: పాకిస్తాన్‌లో హిందూ మహిళపై గ్యాంగ్ రేప్, ఇస్లాం మతంలోకి రాలేదని కిడ్నాప్, 3 రోజులు బంధించి చిత్రహింసలకు గురి చేస్తూ సామూహిక అత్యాచారం
Hazarath Reddyపాకిస్తాన్ లో దారుణం చోటు చేసుకుంది. మతం మారలేదని హిందూ మహిళపై కామాంధులు (Married Hindu woman abducted, gang-raped) తెగబడ్డారు. మూడు రోజుల పాటు రూంలో బంధించి చిత్రహింసలకు గురి చేస్తూ గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారు. ఈ ఘటన నాలుగు రోజుల క్రితం జరిగింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
Pakistan Mosque Blast: మసీదును కూడా వదలని ఉగ్రవాదులు, పాక్ మసీదు బాంబ్ బ్లాస్ట్ మా పనేనని తెలిపిన తెహ్రిక్‌-ఐ-తాలిబన్‌ పాకిస్థాన్‌, ఘటనలో పెరుగుతున్న మృతుల సంఖ్య
Hazarath Reddyపాకిస్థాన్‌లోని పెషావర్‌లో సోమవారం ఆత్మాహుతి దాడి ఘటనలో (Pakistan Mosque Blast) మృతుల సంఖ్య అంతకంతకే పెరుగుతున్నది. ఇవాళ మధ్యాహ్నం దాడి జరగగా సాయంత్రానికి మృతుల సంఖ్య 32కు చేరింది. క్షతగాత్రుల్లో పలువురి పరిస్థితి విషమంగా ఉండటంతో మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నది.
Amgen Layoffs: 300 మంది ఉద్యోగులను ఇంటికి సాగనంపిన డ్రగ్‌మేకర్ ఆమ్జెన్, సంస్థాగత మార్పుల మధ్య కఠిన నిర్ణయం తీసుకోక తప్పదని వెల్లడి
Hazarath Reddyప్రపంచవ్యాప్తంగా టెక్ కంపెనీల భారీ తొలగింపుల మధ్య, డ్రగ్‌మేకర్ ఆమ్జెన్ యునైటెడ్ స్టేట్స్‌లో 300 మంది ఉద్యోగులను తొలగించింది. రాయిటర్స్‌లోని ఒక నివేదిక ప్రకారం, మొత్తం శ్రామిక శక్తిలో దాదాపు 1.2 శాతం మంది తొలగించారు.
Pakistan Mosque Blast: పాకిస్థాన్ లోని పెషావర్ లో ఘోరం, మసీదులో సూసైడ్ బాంబ్ పేలి 32 మంది మృతి, 147 మందికి గాయాలు, మృతుల సంఖ్య పెరిగే అవకాశం
kanhaపెషావర్‌లోని పోలీస్ లైన్స్ ప్రాంతంలోని మసీదులో జరిగిన ఆత్మాహుతి పేలుడులో కనీసం 32 మంది మరణించారు.
Nigeria Road Accident: నైజీరియాలో ఘోర రోడ్డు ప్రమాదాలు, గుర్తు పట్టలేనంతగా కాలిపోయిన 11 మంది, మొత్తం 20 మంది మరణించారని తెలిపిన అధికారులు
Hazarath Reddyదక్షిణ నైజీరియాలో ట్రక్కులతో కూడిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో పిల్లలతో సహా 20 మంది మరణించారని అధికారులు తెలిపారు, చాలా మంది బాధితులు గుర్తుపట్టలేనంతగా కాలిపోయారు. నైజీరియా యొక్క వాణిజ్య కేంద్రమైన లాగోస్‌లో, నగరంలోని ఓజులెగ్బా ప్రాంతంలో రద్దీగా ఉండే వంతెనపై ఒక కమర్షియల్ బస్సుపై భారీ కంటైనర్‌ను తీసుకెళ్తున్న ట్రక్ పడిపోయింది.
Mexico Mass Shooting: మెక్సికో నైట్ క్లబ్‌లో మారణహోమం, ఇష్టం వచ్చినట్లుగా కాల్పులు జరిపిన దుండగులు, ఎనిమిది మంది మృతి, ఐదుగురికి గాయాలు
Hazarath Reddyఉత్తర మెక్సికోలోని జెరెజ్‌ పట్టణంలో ఉన్న ఓ నైట్‌క్లబ్‌లో సాయుధుడైన దుండగులు విచక్షణా రహితంగా కాల్పులకు తెగబడ్డారు. దీంతో ఎనిమిది మంది మృతిచెందారు. ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. భారీగా ఆయుధాలు ఉన్న వ్యక్తులు రెండు వాహనాల్లో ఎల్‌వానాడిటో అనే నైట్‌క్లబ్‌కు వచ్చారని, అనంతరం విచక్షనారహితంగా కాల్పులు జరిపారని పోలీసులు తెలిపారు.
Bubble Tea Doodle: బబుల్ టీ వేడుకలు, గూగుల్ డూడుల్ ద్వారా సెలబ్రేట్ చేసుకుంటున్న బబుల్ చాయ్ గురించి ఎవరికైనా తెలుసా, తైవాన్ దేశానికి చెందిన రెసిపీ గురించి ఓ సారి తెలుసుకుందామా..
Hazarath Reddyగూగుల్ ఈ రోజు (శనివారం) తన డూడల్ హ్యాండిల్‌లో ప్రపంచవ్యాప్తంగా ప్రజల ఆదరణ పొందిన ‘బబుల్ టీ’ వేడుకలను అత్యంత వైభవంగా జరుపుకుంటోంది. ఇందులో భాగంగా గూగుల్ బబుల్ చాయ్ (bubble Tea) పేరుతో డూడుల్ విడుదల చేసింది.
Petrol Price Hike: పెట్రోలు, డీజిల్‌పై లీటరుకు ఏకంగా రూ. 35 పెంచిన పాకిస్థాన్
Rudraతీవ్ర ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న పాకిస్థాన్ డబ్బుల్లేక విలవిల్లాడుతోంది. ఈ నేపథ్యంలో ఖజానాను నింపుకునేందుకు ప్రజలపై తీవ్ర భారాన్ని మోపింది. పెట్రోలు, డీజిల్ ధరను లీటరుకు రూ. 35 చొప్పున పెంచుతూ నిర్ణయం తీసుకుంది.
India-China Clash Row: సరిహద్దు గొడవలపై సంచలన నివేదిక బయటకు, భారత్‌, చైనా సైనికుల మధ్య ఘర్షణలు మరిన్ని జరిగే అవకాశం ఉందని తెలిపిన రాయిటర్స్
Hazarath Reddyభారత్‌, చైనా సైనికుల మధ్య సరిహద్దులో మరిన్ని ఘర్షణలు జరిగే అవకాశం ఉందంటూ ఓ నివేదిక బయటకు వచ్చింది. ఈ నెల 20 నుంచి 22 వరకు జరిగిన అత్యున్నత పోలీసు అధికారుల సమావేశంలో ఈ రహస్య నివేదికను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించినట్లు రాయిటర్స్ వార్తా సంస్థ తెలిపింది.
IBM Layoffs: కొనసాగుతున్న ఐబీఎంలో భారీగా ఉద్యోగాల కోత, 3900 మందిని తొలగిస్తూ నిర్ణయం, ఐటీ కంపెనీలపై కొనసాగుతున్న ఆర్ధిక మాంధ్యం ఎఫెక్ట్‌
VNSసాఫ్ట్‌వేర్‌ కంపెనీల్లో ఉద్యోగాల కోతలు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రముఖ మల్టీనేషనల్‌ టెక్‌ కంపెనీలైన గూగుల్‌ (Google), అమెజాన్‌ (Amazon), మైక్రోసాఫ్ట్‌, మెటా (Meta) ఇప్పటికే వేల సంఖ్యలో ఉద్యోగులను తొలగించాయి. మరింత మందిని వదిలించుకునేందుకు సిద్ధంగా ఉన్నాయి. తాజాగా ఈ జాబితాలో ఐటీ దిగ్గజం ఐబీఎం (IBM) కూడా చేరింది. కంపెనీలోని 3900 మంది ఉద్యోగులను తీసేస్తూ నిర్ణయం తీసుకున్నది.
Trump is Back on Facebook, Instagram: సోషల్ మీడియాలోకి డోనాల్డ్ ట్రంప్ రీ ఎంట్రీ, అమెరికా అధ్యక్ష ఎన్నికల ముందు ఆసక్తికర పరిణామం, రెండేళ్ల తర్వాత నిషేదం ఎత్తివేసిన మెటా
VNSఅమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌పై (Donald Trump) ఉన్న నిషేధాన్ని ప్రముఖ సామాజిక మాధ్యమాలైన ఫేస్‌బుక్‌ (Facebook), ఇన్‌స్టాగ్రామ్‌ (Instagram) ఎత్తివేశాయి. 2021లో యూఎస్‌ క్యాపిటల్‌పై జరిగిన దాడి తర్వాత ఆయనను బ్యాన్‌ చేశాయి. అయితే రెండేండ్ల తర్వాత ఆయన అకౌంట్లను పునరుద్ధరిస్తున్నట్లు ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ల మాతృసంస్థ మెటా (Meta) ప్రకటించింది.
Video: పార్ల‌మెంట్ భ‌వ‌నం ముందే ప‌విత్ర ఖురాన్ ప్రతులు కాల్చివేత, స్థానిక అధికారులే త‌మ‌కు ప‌ర్మిష‌న్ ఇచ్చిన‌ట్లు తెలిపిన నెద‌ర్లాండ్స్‌ వివాదాస్ప‌ద రాజకీయ నేత ఎడ్విన్ వాగెన్స్‌వెల్డ్‌
Hazarath Reddyనెద‌ర్లాండ్స్‌లో వివాదాస్ప‌ద నేతగా పేరున్న ఎడ్విన్ వాగెన్స్‌వెల్డ్‌.. డ‌చ్ పార్ల‌మెంట్ భ‌వ‌నం ముందే ప‌విత్ర ఖురాన్ పుస్త‌కంలో ప్ర‌తుల్ని చింపేశారు. వాటిని కాల్చివేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కాగా ఖురాన్‌ను ముస్లింలు ప‌విత్ర గ్రంధంగా భావిస్తారు
Lockdown in North Korea: ఉత్తర కొరియాలో అంతు చిక్కని వ్యాధి, కొత్త కరోనా అనే అనుమానాలు, 5 రోజులు పాటు రాజధానిలో లాక్‌డౌన్ విధించిన కిమ్ ప్రభుత్వం, ప్రజలంతా ఇళ్లలోనే ఉండాలని ఆదేశాలు
Hazarath Reddyఉత్తర కొరియా రాజధాని ప్యాంగ్యాంగ్ నగరాన్ని అంతుచిక్కని వ్యాధి వణికిస్తోంది. దీంతో అప్రమత్తమైన అధికారులు 5 రోజుల లాక్ డౌన్ (Lockdown in North Korea) విధించారు. ప్రజలంతా ఇళ్లకే పరిమితం కావాలని, ఎవ్వరూ బయటకు రావొద్దని హెచ్చరికలు జారీ చేశారు.