World
Washington Post Lays Off: మీడియాకు పాకిన లే ఆఫ్స్, 20 మంది జర్నలిస్టులకు ఉద్వాసన పలికిన వాషింగ్టన్ పోస్ట్, ఆన్‌లైన్ గేమింగ్ వర్టికల్ లాంచర్ మూసివేస్తున్నట్లు ప్రకటన
Hazarath Reddyమీడియా దిగ్గజం వాషింగ్టన్ పోస్ట్ ఉద్యోగులను తొలగించడం ప్రారంభించింది, కనీసం 20 మంది జర్నలిస్టులను తన న్యూస్ రూం నుండి తొలగించింది. వాషింగ్టన్ పోస్ట్ తన సిబ్బందికి పంపిన నోట్ ప్రకారం, మంగళవారం తన న్యూస్‌రూమ్ నుండి 20 మందిని తొలగించింది. ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ సాలీ బజ్బీ పంపిన నోట్‌లో కంపెనీ భర్తీ చేయని 30 ఓపెన్ పొజిషన్‌లను కూడా గుర్తించిందని చెప్పారు.
New Zealand PM: న్యూజిలాండ్ కొత్త ప్రధానిగా క్రిస్ హిప్‌కిన్స్‌, కరోనా కట్టడిలో కీలకంగా వ్యవహరించిన క్రిస్, అక్టోబర్‌ వరకు పదవిలో కొనసాగనున్న కొత్త పీఎం
VNSన్యూజిలాండ్ కొత్త ప్రధానిగా క్రిస్ హిప్‌కిన్స్ (Chris Hipkins) ఎన్నికయ్యారు. దేశ 41వ ప్రధానిగా క్రిస్ బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. లేబర్ పార్టీ తరఫున ప్రధాని పదవికి క్రిస్ (Chris Hipkins) ఒక్కడే పోటీ పడగా, పార్టీ ఆయనను ప్రధాని అభ్యర్థిగా ఎన్నుకుంది. 44 ఏళ్ల క్రిస్ గతంలో కోవిడ్ నియంత్రణ విభాగాన్ని పర్యవేక్షించడంతోపాటు, పోలీస్ మినిస్టర్‌గా కూడా పని చేశారు.
Sues to Twitter: మరో చిక్కుల్లో ట్విట్టర్, ఆఫీసుల అద్దె కట్టలేదని ఎలాన్‌ మస్క్‌ కు నోటీసులు, రెండు నెలలుగా రెంట్‌ కట్టకపోవడంతో కోర్టులో దావా వేసిన భవన యజమానులు
VNSప్రముఖ మైక్రో బ్లాంగ్‌ ప్లాట్‌ఫామ్‌ ట్విట్టర్‌ కారణంగా కంపెనీ సీఈవో ఎలాన్‌ మస్క్‌ మరోసారి వార్తల్లో నిలిచారు. యూకే, అమెరికాలోని ట్విట్టర్‌ కార్యాలయాలకు అద్దె చెల్లించడంలో ప్రపంచ కుబేరుడు విఫలమయ్యాడు. ఈ క్రమంలో యూఎస్‌లోని శాన్‌ ఫ్రాన్సిస్కో ప్రధాన కార్యాలయానికి ట్విట్టర్‌ దాదాపు 3.42 మిలియన్ల అద్దెను చెల్లించాల్సి ఉంది.
Cough Syrup Deaths Row: దగ్గు మందు కారణంగా 300 మంది చిన్నారులు మృతి, దగ్గు మందులో విషపూరిత రసాయనాలు కారణం, ఆ మందులపై తక్షణం కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసిన WHO
Hazarath Reddyఇటీవలికాలంలో దగ్గు మందు కారణంగా చాలా మంది చిన్నారులు మృతి చెందిన విషయం తెలిసిందే. ఇండోనేషియా, ఉబ్జెకిస్తాన్‌లో ఐదేళ్లపు చిన్నారులు దాదాపు 300 మందికిపైగా చనిపోయారని ప్రపంచ ఆరోగ్య సంస్థ సోమవారం ప్రకటనలో పేర్కొంది.
Jeff Bezos to Sell Washington Post?: వాషింగ్టన్ పోస్ట్‌ న్యూస్ పేపర్ అమ్మకానికి పెట్టినట్లుగా వార్తలు, అంతా పుకారేనని ఖండించిన బెజోస్ అధికార ప్రతినిధి
Hazarath Reddyఅయితే ఈ వార్తలను బెజోస్ అధికార ప్రతినిధి ఖండించారు. ఆ వార్తలో నిజం లేదని కొట్టిపారేశారు. వాషింగ్టన్ పోస్ట్‌ను అమ్మడం లేదని తెలిపారు.వాషింగ్టన్‌ పోస్ట్‌ను బెజోస్‌ 2013లో 250 మిలియన్‌ అమెరికన్‌ డాలర్లకు సొంతం చేసుకున్నారు.
Des Moines Shooting: అమెరికా స్కూల్లో విద్యార్థులపై కాల్పులు, ఇద్దరు విద్యార్థులు అక్కడికక్కడే మృతి, మృత్యువుతో పోరాడుతున్న మరో టీచర్
Hazarath Reddyఅమెరికాలో మరో తుపాకీ దాడి. లాస్ ఏంజిల్స్‌లో కాల్పులు జరిగిన మూడు రోజుల తర్వాత, దేశం మళ్లీ కాల్పుల మోతతో దద్దరిల్లింది.డెస్ మోయిన్స్ పాఠశాలలో విద్యా కార్యక్రమంలో సోమవారం కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు విద్యార్థుల చనిపోగా ఓ ఉపాధ్యాయుడికి తీవ్ర గాయాలయ్యాయి.
US Mass Shooting: కాల్పుల మోతతో మళ్లీ దద్దరిల్లిన అమెరికా కాలిఫోర్నియా, విచక్షణారహితంగా కాల్పులు జరిపిన దుండగుడు, ఏడుగురు అక్కడికక్కడే మృతి
Hazarath Reddyఅమెరికా కాలిఫోర్నియాలో మరోసారి కాల్పుల మోతమోగింది. సోమవారం రెండు వేరు చోట్ల ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో ఏడుగురు మరణించారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. అతడ్ని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సాన్ మటేవో కౌంటీలోని హాల్ఫ్ మూన్‌ బే ప్రాంతంలో ఈ ఘటనలు జరిగాయి.
World Migration Report 2022: విదేశాలకు వెళుతున్న వారిలో మనమే టాప్, భారత్‌ను వదిలిన 1.80 కోట్ల మంది, పొట్టకూటి కోసం ఎడారి దేశానికే ఎక్కువగా వలసలు, ప్రపంచ వలస నివేదిక 2022లో సంచలన విషయాలు
Hazarath Reddyవిదేశాలకు వలసబాటపడుతున్న వారిలో ప్రపంచంలోనే భారతీయులు మొదటి స్థానంలో ఉన్నారని World Migration Report 2022 వెల్లడించింది. విద్య, ఉపాధి అవకాశాల కోసం అత్యధికంగా భారతీయులు (India tops list of countries) విదేశాలకు వెళుతున్నారని నివేదిక తెలిపింది
Pakistan Power Outage Memes: పాకిస్తాన్‌లో నిలిచి పోయిన విద్యుత్ సరఫరా, ట్విట్టర్లో పేలుతున్న జోకులు, వైరల్ అవుతున్న మీమ్స్ ఇవే..
Hazarath Reddyదాయాది దేశం పాకిస్తాన్‌లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. గ్రిడ్ ఫెయిల్యూర్ కారణంగా పలు నగరాల్లో సోమవారం ఉదయం 7:30 గంటల నుంచి కరెంటు సరఫరా ఆగిపోయింది. పాకిస్తాన్ మీడియా సంస్ధలు ఈ విషయాన్ని వెల్లడించిన తర్వాత ఆ దేశ విద్యుత్ శాఖ కూడా ట్వీట్ చేసింది.
Ludo Game Affair: లూడో గేమ్ ఆడుతూ ఇండియా అబ్బాయితో ప్రేమలో పడిన పాక్ యువతి, పెళ్లి చేసుకుని బెంగుళూరులో కాపురం, ఇద్దర్నీ అరెస్ట్ చేసిన పోలీసులు
Hazarath Reddyఓ విచిత్రమైన ఘటనలో ఓ పాకిస్థానీ యువతి ఆన్‌లైన్‌లో లూడో గేమ్ ఆడుతూ ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ అబ్బాయితో ప్రేమలో పడింది. నివేదికల ప్రకారం, అమ్మాయి సరిహద్దు నిబంధనలను ఉల్లంఘించి తన ప్రియుడిని కలవడానికి నేపాల్ మీదుగా భారతదేశానికి వచ్చింది.
Spotify Layoffs: స్ఫోటి ఫై లో ఉద్యోగాల కోత.. ఈ వారంలోనే!
Rudraఆర్ధిక మాంద్యం భయం, ఖర్చులు తగ్గించుకోవడంలో భాగంగా మరో టెక్ కంపెనీ ఉద్యోగులకు ఉద్వాసన పలుకనున్నది. స్వీడన్ కు చెందిన టెక్ సంస్థ స్ఫోటి ఫై ఈ వారంలో లే ఆప్స్ కు శ్రీకారం చుట్టనున్నట్టు సమాచారం.
Major Power Breakdown In Pakistan: పాకిస్థాన్ కు కరెంట్ కష్టాలు.. ఇస్లామాబాద్, లాహోర్, కరాచీలో గత కొన్ని గంటలుగా విద్యుత్తు సరఫరా కట్
Rudraఆహార, ఆర్ధిక సంక్షోభంతో సతమతం అవుతున్న పాకిస్థాన్ ను కరెంట్ కష్టాలు చుట్టుముట్టాయి. ప్రధాన నగరాలైన ఇస్లామాబాద్, లాహోర్, కరాచీలో గత కొన్ని గంటలుగా విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. దీంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
Corona In China: చైనాలో కొనసాగుతున్న కరోనా బీభత్సం.. ఇప్పటికే 80 శాతం జనాభాకు వైరస్... వారం రోజుల్లో 13 వేల మరణాలు
Rudraచైనాలో కరోనా మహమ్మారి కొత్త సబ్ వేరియంట్ ఒమిక్రాన్ బీఎఫ్-7 విజృంభణ కొనసాగుతోంది. ఇటీవల లాక్ డౌన్లు ఎత్తివేయడంతో అత్యధిక స్థాయిలో ఇన్ఫెక్షన్ రేటు నమోదవుతోందని అధికారులు చెబుతున్నారు. గడచిన వారం రోజుల్లో చైనాలో 13 వేల మంది కరోనాతో మృత్యువాత పడినట్టు వెల్లడైంది.
China Covid Deaths: చైనాలో కరోనా మరణ మృదగం, ప్రతిరోజు లక్షల్లో కరోనా కేసులు, గడిచిన వారంలో 13వేల మంది మరణించినట్లు వార్తలు
VNSఈ ఏడాది జనవరి 13 నుంచి 19 వరకు కేవలం వారం రోజుల వ్యవధిలోనే ఆ దేశంలో మొత్తం 13 వేల మంది కరోనా బాధితులు ప్రాణాలు కోల్పోయారు. కరోనా మహమ్మారి బారినపడి గడిచిన వారంలో 13 వేల మంది మరణించారని చైనా సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్ ప్రివెన్షన్‌ (CDC) తన అధికారిక ప్రకటనలో పేర్కొన్న
Bilimoria Praises Modi: భూ మండలంపై అత్యంత శక్తిమంతమైన నేత మోదీ.. బ్రిటన్ ఎంపీ లార్డ్ కరన్ బిలిమోరియా ప్రశంస (వీడియోతో)
Rudraభూ మండలంపై అత్యంత శక్తిమంతమైన నేత మోదీ అని బ్రిటన్ ఎంపీ లార్డ్ కరన్ బిలిమోరియా ప్రశంసించారు. చిన్నతనంలో చాయ్ అమ్మిన పిల్లాడు నేడు భారత ప్రధానియై భూమిపై అత్యంత శక్తిమంతమైన నేతగా ఎదిగారని కీర్తించారు.
Colombia: 24 రోజుల పాటూ సముద్రంలోనే చిక్కుకున్న వ్యక్తి, ఒక్క బాటిల్ కెచప్, మ్యాగీ మాత్రమే ఆహారం, చివరికి ఎలా బయటపడ్డాడంటే?
VNSద్వీపదేశం డొమినికాకు (Dominica) చెందిన ఎల్విస్‌ ఫ్రాంకోయిస్‌ (Elvis Francois) గత డిసెంబర్‌లో తన పడవకు రిపేర్‌ చేస్తుండగా అలల ధాటికి పడవ సముద్రంలోకి కొట్టుకుపోయింది. తర్వాత అక్కడి నుంచి ఒడ్డుకు చేరేందుకు అతను ఎంత ప్రయత్నించినా సాధ్యంకాలేదు. దాంతో ఎవరైనా కాపాడకపోతారా అని ఎదురుచూస్తూ ఏకంగా 24 రోజులపాటు ఆయన సముద్రంలో గడపాల్సి వచ్చింది.
Elon Musk On Covid Vaccine: కరోనా రెండో డోస్ తీసుకొని ఆసుపత్రి పాలయ్యాను, ఎలాన్ మస్క్ సంచలన వ్యాఖ్యలు..
kanhaCOVID-19 వ్యాక్సిన్‌ల, తీవ్రమైన దుష్ప్రభావాలపై పెరుగుతున్న చర్చలో Twitter CEO ఎలోన్ మస్క్ శనివారం చేరారు. రెండవ బూస్టర్ షాట్ నుండి నాకు పెద్ద దుష్ప్రభావాలు ఉన్నాయని ఆయన చెప్పారు. ఆ రోజుల్లో తాను చనిపోతున్నట్లు అనిపించిందని ట్వీట్‌లో పేర్కొన్నాడు.
Chris Hipkins: న్యూజిలాండ్ కొత్త ప్రధానిగా క్రిస్ హిప్ కిన్స్ .. లేబర్ పార్టీ ప్రకటన
Rudraన్యూజిలాండ్ కొత్త ప్రధానిగా, జెసిండా ఆర్డెన్‌ స్థానాన్ని క్రిస్ హిప్ కిన్స్ భర్తీ చేయనున్నారు. ఈ మేరకు లేబర్ పార్టీ ఓ ప్రకటనలో వెల్లడించింది. కాగా న్యూజిలాండ్‌ ప్రస్తుత ప్రధానమంత్రి, లేబర్‌ పార్టీ నాయకురాలు జెసిండా ఆర్డెన్‌(42) ప్రధాని పదవికి రాజీనామా చేస్తున్నట్టు గురువారం సంచలన ప్రకటన చేశారు
India Population Overtake China: 142.3 కోట్ల జనాభాతో చైనాను దాటేసిన భారత్, ప్రపంచంలో అత్యంత జనాభా కలిగిన దేశంగా భారత్‌ అవతరించినట్లు తెలిపిన వరల్డ్‌ పాపులేషన్‌ రివ్యూ
Hazarath Reddyజనాభాలో చైనాను భారత్‌ ఇప్పటికే అధిగమించి తొలిస్థానానికి చేరుకున్నట్లు వరల్డ్‌ పాపులేషన్‌ రివ్యూ (WPR) అంచనా వేసింది. వరల్డ్‌ పాపులేషన్‌ రివ్యూ ప్రకారం ప్రపంచంలో అత్యంత జనాభా కలిగిన దేశంగా భారత్‌ అవతరించినట్లు పేర్కొంది.
Congo Boat Capsize: కాంగోలో ఘోర ప్రమాదం, లులోంగా నదిలో 200 మంది జలసమాధి, ఓవర్ లోడుతో బోటులో వెళ్తుండగా ఒక్కసారిగా మునిగిపోయిన బోటు
Hazarath Reddyవాయవ్య డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో(డీఆర్‌సీ) ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. లులోంగా నదిలో 200 మంది ప్రయాణికులతో వెళ్తున్న మోటారు బోటు ఓవర్ లోడుతో మునిగిపోయింది. ఈ దుర్ఘటనలో 145 మంది చనిపోయి ఉంటారని అధికారులు తెలిపారు.