World

Indian Jailed in Dubai: పొరపాటున అకౌంట్లోకి రూ. 1.28 కోట్లు, వాటిని తిరిగి ఇవ్వనందుకు భారతీయునికి జైలు శిక్ష వేసిన దుబాయ్‌ కోర్టు, ఆ వ్యక్తి ఏమన్నాడంటే..

Hazarath Reddy

021 అక్టోబర్‌లో మెడికల్ ట్రేడింగ్ కంపెనీ పొరపాటున ఓ వ్యక్తి బ్యాంక్ ఖాతాకు తప్పుగా బదిలీ చేసిన AED 570,000 (సుమారు రూ. 1.28 కోట్లు) బదిలీ చేసింది.

RT-PCR Must for Flyers: కరోనాపై కేంద్ర కీలక నిర్ణయం, ఆ ఆరు దేశాల నుంచి వచ్చే వారికి ఆర్టీపీసీఆర్‌ టెస్టులు తప్పనిసరి, ఆదేశాలు జారీ చేసిన కేంద్ర ఆరోగ్య శాఖ

Hazarath Reddy

కరోనా కొత్త వేరియెంట్‌ భారత్ లో కలవరపెడుతున్న నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం ప్రకటించింది. జనవరి 1వ తేదీ నుంచి కరోనా విజృంభిస్తు‍న్న దేశాల నుంచి భారత్‌కు వచ్చే వచ్చే ప్రయాణికులకు ఆర్టీపీసీఆర్‌ టెస్టులు (RT-PCR Must for Flyers) తప్పనిసరి చేస్తున్నట్లు ప్రకటించింది.

US Winter Storm: అమెరికాలో 62 మంది మృతి, రక్తం గట్టకట్టే చలిలో వణికిపోతున్న ప్రజలు, బాంబ్ సైక్లోన్ దెబ్బకి మంచు దిబ్బల్లా మారిన అనేక ప్రాంతాలు

Hazarath Reddy

మంచు తుఫాన్ వల్ల అమెరికాలో ఇప్పటివరకు 62 మందికిపైగా చనిపోయారు. కొందరు మంచులోనే గడ్డకట్టి కన్నుమూశారు. మరికొందరు వివిధ ప్రమాదాల్లో మరణించారు.చరిత్రలో ఎన్నడు లేని విధంగా మంచు భారీగా కురవడంతో అమెరికాలోని అనేక ప్రాంతాలు మంచు దిబ్బల్లా మారాయి.

Bomb Cyclone Video: మంచు తుపాను దెబ్బ, కారు కంట్రోల్ కాక రోడ్డు మీద జారిపోతున్న వీడియో వైరల్, చుక్కలు చూపిస్తోన్న బాంబ్ సైక్లోన్

Hazarath Reddy

అమెరికాను మంచు తుఫాన్‌ 'బాంబ్ సైక్లోన్' వణికిస్తోంది. రక్తం గట్టకట్టే చలిలో ప్రజలు వణికిపోతున్నారు.చరిత్రలో ఎన్నడు లేని విధంగా మంచు భారీగా కురవడంతో అమెరికాలోని అనేక ప్రాంతాలు మంచు దిబ్బల్లా మారాయి. రోడ్లు, ఇళ్లు శ్వేత వర్ణాన్ని సంతరించుకున్నాయి

Advertisement

Uzbekistan Child Deaths: దగ్గు మందు తాగి 18 మంది చిన్నారులు మృతి, మేడిన్ ఇండియా మందు తీసుకోవడం వల్లే చనిపోయారని ఉజ్బెకిస్తాన్‌ ఆరోపణ, వివరాలు కోరిన భారత్

Hazarath Reddy

ఉజ్బెకిస్తాన్‌లో సిరప్ తాగి 18 మంది చిన్నారులు మృతి (Uzbekistan Child Deaths) చెందారు. పిల్లల మరణానికి భారత్‌కు చెందిన ఫార్మాస్యూటికల్‌ కంపెనీ తయారు చేసిన దగ్గు సిరప్‌ కారణమని ఉజ్బెకిస్తాన్‌ ఆరోపణలు గుప్పిస్తోంది.

Pak Ex- Minister Son Sentenced to Death: చెప్పినట్లు డ్యాన్స్ చేయలేదని హిజ్రాలను కాల్చి చంపిన మాజీ మంత్రి కుమారుడు, ఉరిశిక్ష విధించిన కోర్టు, ఐదేళ్ల తర్వాత పోలీసుల చేతికి చిక్కిన నిందితుడు

VNS

అహ్మద్ బిలాల్ చీమా 2008లో సియోల్‌కోట్‌లోని తన ఔట్ హౌస్ వద్ద ఓ డ్యాన్స్ పార్టీ ఏర్పాటు చేశాడు. పార్టీకి అతని స్నేహితులను పిలిచాడు. పార్టీలో ఎంటర్ టైన్ మెంట్ కోసం మజ్‌హర్ హుస్సేన్, ఆమిర్ షాజద్, అబ్దుల్ జబ్బార్ అనే ముగ్గురు హిజ్రాలను డ్యాన్స్ ప్రోగ్రామ్ కోసం పిలిచాడు. వారు డ్యాన్స్ చేస్తుండగా అహ్మద్ బిలాల్ స్నేహితులు వారితో అసభ్యంగా ప్రవర్తించారు.

Cambodia Fire: క్యాసినోలో చెలరేగిన మంటలు, 10 మంది మృతి, 30 మందికి పైగా గాయాలు, ఇంకా లోపల పదుల సంఖ్యలో చిక్కుకున్న స్థానికులు, మంటలను అదుపులోకి తెచ్చేందుకు రంగంలోకి హెలికాప్టర్లు

VNS

కంబోడియాలో ఘోర అగ్ని ప్రమాదం (Cambodia Fire) జరిగింది. పోయ్‌పెట్ లోని గ్రాండ్ డైమండ్ క్యాసినోలో (Grand Diamond Casino) మంటలు చెలరేగాయి. దీంతో 10 మంది మరణించారు. మరో 30 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనలో గాయపడ్డవారిని ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. గతరాత్రి జరిగిన ప్రమాదంలో మంటలు అదుపులోకి తెచ్చేందుకు ఫైర్ సిబ్బంది శ్రమిస్తున్నారు.

Twitter Down: మరోసారి మొరాయించిన ట్విట్టర్, లాగిన్ సమస్యలతో ఇబ్బందిపడ్డ వేలాది మంది యూజర్లు, గత రెండు వారాల్లో ఇది రెండో సారి

VNS

ట్విట్టర్‌ మరోసారి డౌన్ (Twitter down) అయింది. లాగిన్ సమస్యతో వేలాది మంది యూజర్లు ఇబ్బంది పడ్డారు. ఈ మేరకు డౌన్ డిటెక్టర్. కామ్‌ కు(Downdetector.com) వేలాది ఫిర్యాదులు వచ్చాయి. అమెరికా సహా పలు దేశాల్లో వేలాది మంది యూజర్లు ట్విట్టర్ లో లాగిన్ అయ్యేందుకు ఇబ్బందులు ఎదుర్కున్నారు. దీనిపై ట్విట్టర్ (Twitter down) నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు

Advertisement

Niagara Falls Frozen: గడ్డ కట్టుకుపోయిన నయాగారా జలపాతం, మంచు గడ్డలను చూసి ముగ్ధులై పోతున్న పర్యాటకులు, ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్

Hazarath Reddy

అమెరికాను మంచు తుపాను(Bomb cyclone) గజగజ వణికిస్తోంది. నయాగరా జలపాతం గడ్డకట్టుకుపోయింది. నయాగరాకు 25 మైళ్ల దూరంలో బఫెలో ఉంటుంది. నయాగరాలో కొన్ని ప్రదేశాల్లో నీరు గడ్డకట్టినా.. ప్రవాహం కారణంగా కొన్ని చోట్ల మాత్రం జలపాతం పరవళ్లు తొక్కుతోంది. గట్టకట్టుకుపోయిన నయాగరా జలపాతం ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.

COVID Third Wave Coming?: భారత్‌లో కరోనా థర్డ్ వేవ్‌ హెచ్చరికలు, వచ్చే 40 రోజులే చాలా కీలకం, జనవరి నెలలో దేశంలో కరోనా కేసులు భారీగా పెరిగే అవకాశం ఉందని హెచ్చరిస్తున్న అధికార వర్గాలు

Hazarath Reddy

జనవరిలో భారతదేశంలో COVID-19 కేసులు పెరిగే అవకాశం ఉన్నందున రాబోయే 40 రోజులు చాలా కీలకమైనవి, మునుపటి వ్యాప్తి యొక్క నమూనాను గుర్తు చేస్తూ అధికారిక వర్గాలు బుధవారం హెచ్చరించాయి.

US House Bans TikTok: అమెరికా కీలక నిర్ణయం, ప్రభుత్వ డివైజ్‌లలో టిక్‌ టాక్‌ను బ్యాన్‌ చేస్తున్నట్లు ప్రకటన, మార్గదర్శకాల్ని విడుదల చేసిన యూఎస్ హౌస్

Hazarath Reddy

భద్రతా పరమైన సమస్యలు తలెత్తే అవకాశం ఉందంటూ అమెరికా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అమెరికా ప్రభుత్వ డివైజ్‌లలో టిక్‌ టాక్‌ను బ్యాన్‌ చేస్తున్నట్లు ప్రకటించింది.అందుకు సంబంధించి మార్గదర్శకాల్ని విడుదల చేసింది.

COVID in China: కోవిడ్ కల్లోలంలో చైనా సంచలన నిర్ణయం, జనవరి 8 నుంచి అంతర్జాతీయ రాకపోకలకు గ్రీన్ సిగ్నల్, కరోనా నెగెటివ్‌ సర్టిఫికెట్‌ చూపిస్తే చాలంటున్న డ్రాగన్ కంట్రీ

Hazarath Reddy

కరోనా కేసులతో చైనా ప్రజలు విలవిలలాడుతుంటే చైనా ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయ ప్రయాణాలపైనా ఆంక్షలను తొలగించాలని తాజాగా నిర్ణయించింది. జనవరి 8 నుంచి చైనాకు అంతర్జాతీయ రాకపోకలపై ఉన్న నిబంధనలను ఎత్తేస్తున్నట్టు నేషనల్‌ హెల్త్‌ కమిషన్‌ ప్రకటించింది.

Advertisement

COVID Surge in China: చైనాలో ఒకటి కాదు నాలుగు కరోనా వేరియంట్లు, అందుకే ఈ స్థాయిలో కేసులు నమోదు, కేంద్ర కోవిడ్ ప్యానల్ చీఫ్ ఎన్ కే అరోరా కీలక వ్యాఖ్యలు

Hazarath Reddy

చైనాలో కరోనావైరస్ విజృంభణ (Covid in China) కొనసాగుతోంది. రోజూ లక్షలాది మంది దాని బారిన పడుతున్నారు. షాంఘై సమీపంలోని పారిశ్రామిక నగరం జిజెయాంగ్‌లో రోజుకు కనీసం 10 లక్షలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. కొద్ది రోజుల్లోనే ఇవి రోజుకు పాతిక లక్షలు దాటే అవకాశం ఉందని చెబుతున్నారు.

Making Pig Livers Humanlike: మనుషులకు పంది కాలేయాన్ని అమర్చే ప్రయోగాలు, అమెరికాలో గత 12 ఏళ్ల నుంచి శరవేగంగా జరుగుతున్న ట్రయల్స్

Hazarath Reddy

అమెరికాలో మనుషులకు పంది కాలేయాన్ని అమర్చే ప్రయోగాలు వేగంగా జరుగుతున్నాయి. లివర్ అవయవ కొరతను అధిగమించేందుకు శాస్త్రవేత్తలు అమెరికాలో గత కొన్నేండ్లుగా ఈ ప్రయోగాలు చేస్తున్నారు. మనిషి కాలేయంలో ఉండే లక్షణాలను పంది కాలేయంలోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.

Philippines Floods: ఫిలిప్పీన్స్‌‌ను ముంచెత్తిన భారీ వరదలు, 13 మంది మృతి, 23 మంది గల్లంతు, 45 వేల మందికిపైగా ప్రజలు నిరాశ్రయులు

Hazarath Reddy

ముంచుకొచ్చిన భారీ వర్షాలు, విలయం సృష్టిస్తున్న వరదలతో ఫిలిప్పీన్స్‌ అతలాకుతలమవుతున్నది. ఇప్పటివరకు 13 మంది మరణించగా, 23 మంది గల్లంతయ్యారు. వర్షాల వల్ల 45 వేల మందికిపైగా ప్రజలు నిరాశ్రయులయ్యారు. దీంతో అధికారులు వారందరినీ పునరావాస కేంద్రాలకు తరలించారు. నదులు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో రోడ్లు కొట్టుకుపోయాయి.

Misheck Nyandoro: ప్రతి రోజూ రాత్రికి నాలుగు సార్లు సెక్స్, 100 మంది భార్యలతో 1000 మంది పిల్లల్ని పుట్టించడమే లక్ష్యంగా పెట్టుకున్న జింబాంబ్వే వాసి మిషెక్ న్యాండోరో

Hazarath Reddy

జింబాంబ్వే లో ఉన్న మిషెక్ న్యాండోరో అనే వ్యక్తి గురించి చాలా మందికి తెలియదు. అతను 16 మంది భార్యలు, 151 మంది పిల్లలతో తన జీవితాన్ని గడపుతున్నారు. అతని కుటుంబానికి దాదాపు ఒక పట్టణాన్ని కలిగి ఉండవచ్చు. అయితే తన భార్యలను సంతృప్తి పరచడం కోసం ఈ ఫుల్‌టైమ్ జాబ్‌కి సంబంధించిన తను'రాత్రికి నాలుగు సార్లు సెక్స్' షెడ్యూల్‌ను ఇటీవల వెల్లడించాడు.

Advertisement

Man With 12 Wives and 102 Kids: డబ్బు బాగా ఉన్నప్పుడు 12 మంది భార్యలతో 102 మంది పిల్లల్ని కన్నాడు, ఇప్పుడు పోషించలేనంటూ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాడు, ఉగాండా వాసి కథ ఇదే..

Hazarath Reddy

పెరుగుతున్న జీవన వ్యయంతో చాలా మంది వెన్ను విరిగింది, అయితే అది వారిలో కొందరిని జ్ఞానవంతులను చేసింది. వారిలో ఒకరు ఉగాండాకు చెందిన రైతు మూసా హసహ్యా (మోసెస్ హసహయ). మూసాకు 12 మంది భార్యలు, 102 మంది పిల్లలు, 568 మంది మనుమలు ఉన్నారు.

Google: ఈ సారి గూగుల్ వంతు, 6 శాతం మంది ఉద్యోగులను తొలగించే పనిలో టెక్ దిగ్గజం, వీరంతా పేలవమైన పనితీరు కనబరుస్తున్నట్లుగా గూగుల్‌ సమావేశంలో చర్చలు

Hazarath Reddy

గత వారం గూగుల్‌లో జరిగిన సమావేశంలో ఉద్యోగుల పనితీరుపై చర్చలు జరిగాయి.ఈ సమావేశంలో 6 శాతం మంది ఉద్యోగులు పేలవమైన పనితీరు కనబరుస్తున్నట్లుగా చర్చకు వచ్చింది. ఇది వారిని ప్రమాదంలో పడేసే అవకాశం ఉందని తెలుస్తోంది.

Brain-Eating Amoeba: కొత్తగా ముక్కు నుంచి లోపలకి వెళ్లి మెదడును తినేసే వ్యాధి, బ్రెయిన్ ఈటింగ్ అమీబాతో కొరియాలో వ్యక్తి మృతి, న‌గ‌లేరియా ఫ్ల‌వ‌రీ లేదా బ్రెయిన్ ఈటింగ్ అమీబా గురించి పూర్తి వివరాలు ఇవే..

Hazarath Reddy

దక్షిణ కొరియాలో మరో వ్యాధి కలవరం పుట్టిస్తోంది. ఆ దేశంలో తొలి బ్రెయిన్ ఈటింగ్ అమీబా (Brain-Eating Amoeba) మరణం న‌మోదు అయ్యింది. దీన్నే న‌గ‌లేరియా ఫ్ల‌వ‌రీ ఇన్‌ఫెక్ష‌న్ అంటారు. ఈ వ్యాది (Brain-Eating Amoeba Case) సోకి ఆ దేశంలో 50 ఏళ్ల ఓ వ్య‌క్తి మ‌ర‌ణించాడు. అయితే అత‌నికి థాయిలాండ్‌లో ఆ ఇన్‌ఫెక్ష‌న్ సోకి ఉంటుంద‌ని అధికారులు అంచ‌నా వేస్తున్నారు.

Heavy Snow in Japan: మంచు తుపానులో చిక్కుకున్న జపాన్, 17 మంది మృతి, వందల మందికి తీవ్ర అనారోగ్యం, రహదారులపై 5 అడుగుల మేర మంచు

Hazarath Reddy

జపాన్‌ దేశం మంచు తుపాను ధాటికి వారం రోజులుగా విలవిలలాడిపోతోంది. మంచు తుపాను ప్రమాద ఘటనల్లో 17 మంది చనిపోగా వందల మంది తీవ్ర అనారోగ్యం పాలయ్యారు. వేలాదిగా ఇళ్లకు విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. తీవ్రంగా మంచు పేరుకుపోవడంతో రహదారులపై ట్రాఫిక్‌ ఎక్కడికక్కడే నిలిచిపోయింది.

Advertisement
Advertisement