World
US Plane Crash Video: ఇంటి పెరట్లో కూలిన విమానం, ఇద్దరు వ్యక్తులు మృతి, సోషల్ మీడియాలో వీడియో వైరల్
Hazarath Reddyయునైటెడ్ స్టేట్స్‌లోని ఫ్లోరిడాలో జరిగిన ఒక దురదృష్టకర సంఘటనలో, మిరామార్ ఇంటిపైన ఒక చిన్న విమానం కూలిపోవడంతో విమానంలోని ఇద్దరు వ్యక్తులు మరణించారు. మిరామార్‌లోని ఓ ఇంటి పెరట్లో చిన్న విమానం కూలిన ఘటన సోమవారం ఉదయం చోటు చేసుకుంది.
Nigeria Floods: నైజీరియాను ముంచెత్తిన వరదలు, 600 మందికి పైగా మృతి, 2 మిలియన్లకు పైగా ప్రజలు రోడ్ల మీదకు..
Hazarath Reddyఆఫ్రికా దేశం నైజీరియాలో విపరీతమైన వరదలు అతలాకుతలం చేయడంతో 600 మందికి పైగా మరణించారు. వరదల కారణంగా 2 మిలియన్లకు పైగా ప్రజలు ప్రభావితమయ్యారు మరియు 200,000 గృహాలు పూర్తిగా లేదా పాక్షికంగా ధ్వంసమయ్యాయి.
Pakistan Shocker: ఆస్పత్రి పైకప్పుపై వందలాది కుళ్లిపోయిన శవాలు, కొన్నింటికి గుండె, కళ్లు, లివర్ లేకపోవడంతో అనుమానాలు, పాకిస్థాన్‌ లో బయటపడ్డ శవాల గుట్టపై విచారణ ప్రారంభం, శవాలు ఎవరివో కూడా గుర్తుపట్టలేని పరిస్థితి
Naresh. VNSఆసుపత్రి పైకప్పుపై కనిపించిన ఈ మృతదేహాల వీడియో సోషల్ మీడియాలో వైరల్ (viral) అవుతోంది. ప్రజలు ఈ వీడియో చూసి భయబ్రాంతులకు గురవుతున్నారు. ఈ ఆందోళన కరమైన ఘటనపై పంజాబ్ సీఎం పర్వేజ్ ఇలాహీ తీవ్రంగా స్పందించారు. దర్యాప్తుకు ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేశారు.
Coronavirus in China: చైనాలో మళ్లీ కరోనా కల్లోలం, స్కూళ్లు, సినిమా హాల్స్‌,బార్లు,జిమ్‌లు మూసివేత, షాంఘైలో ఒక్కసారిగా పెరిగిన కోవిడ్ కేసులు
Hazarath Reddyచైనా మళ్లీ కరోనా కల్లోలాన్ని చూస్తోంది. దేశంలో ఒక్కసారిగా కోవిడ్ కేసులు (Coronavirus in China) పెరిగాయి. ప్రధాన ఆర్థిక నగరం షాంఘైలో మ‌ళ్లీ కోవిడ్ కేసులు భారీగా పెరిగాయి. గ‌డిచిన మూడు నెల‌ల్లో అత్య‌ధిక స్థాయిలో న‌మోదు అయ్యాయి. దీంతో షాంఘై న‌గ‌రంలో స్కూళ్ల‌ను (schools close) మూసివేశారు.
Pakistan: పాకిస్తాన్‌లో ఘోర ప్రమాదం, మంటల్లో చిక్కుకున్న రన్నింగ్ బస్సు, 18 మంది అక్కడికక్కడే సజీవ దహనం, మరో పది మందికి తీవ్ర గాయాలు
Hazarath Reddyపాకిస్తాన్‌ లో సింధ్‌ ప్రావిన్స్‌ కరాచీ-హైదరాబాద్‌-జామ్‌షోరో నగరాలను కలుపుతూ ఉన్న ఎం-9 మోటర్‌వేపైఘోర ప్రమాదం చోటు చేసుకుంది. బుధవారం రాత్రి సమయంలో ఓ రన్నింగ్‌ బస్సు మంటల్లో చిక్కుకుంది.
Crimea Bridge Blast: క్రిమియా బ్రిడ్జిని పేల్చేందుకు 23టన్నుల పేలుడు పదార్ధాలు, భారీగా ప్లాన్ చేసిన నిందితులు, దర్యాప్తును వేగవంతం చేసిన రష్యా, ఇప్పటి వరకు 8మంది అరెస్ట్, పేలుడు కుట్ర వెనుక ఉన్నదెవరంటే?
Naresh. VNSకెర్చ్ వంతెన పేలుడుతో సంబంధం ఉన్న ఎనిమిది మందిని అరెస్టు చేసినట్లు రష్యా పేర్కొంది. అందులో ఐదుగురు రష్యా జాతీయులు ఉండటం గమనార్హం. మిగిలిన ముగ్గురిలో ఉక్రెయిన్, అర్మేనియా జాతీయులుగా తెలిసింది.
Burnt Hair by Elon Musk: పెర్ఫ్యూమ్‌ సేల్స్ మెన్ గా మారిన ఎలాన్ మస్క్, బర్న్ట్‌ హెయిర్ పేరుతో ఒక పెర్ఫ్యూమ్‌ విడుదల, ట్విట్టర్లో ఆడుకుంటున్న నెటిజన్లు
Hazarath Reddyటెస్లా సీఈవో ఎలాన్ మస్క్ ది ఫైనెస్ట్‌ ఫ్రాగ్రెన్స్‌ ఆఫ్ ది ఎర్త్‌ అంటూ ‘బర్న్ట్‌ హెయిర్’ పేరుతో ఒక పెర్ఫ్యూమ్‌ను విడుదల చేశాడు. నా పేరులాంటి పేరుతో ఫ్రాగ్రెన్స్‌ బిజినెస్‌లోకి అనివార్యంగా వస్తున్నా..అంటూ ట్విటర్‌ బయోలో ఏకంగా పెర్‌ఫ్యూమ్‌ సేల్స్‌ మేన్‌ అని మార్చుకోవడం వార్తల్లో నిలిచింది.
VIDEO: షాకింగ్ వీడియో, బోయింగ్ 747 విమానం గాల్లోకి ఎగురుతుండగా ఊడిన చక్రం, ఇంటర్నెట్లో వైరల్ అవుతున్న క్లిప్
Hazarath Reddyఇటలీలోని టరాన్టో-గ్రోటాగ్లీ విమానాశ్రయం నుండి బయలుదేరిన కొద్ది సేపటికే బోయింగ్ 747 డ్రీమ్‌లైఫర్‌లోని ప్రధాన చక్రాలలో ఒకటి బయటకు వచ్చింది. వీడియోలో, చక్రాలలో ఒకటి అండర్ క్యారేజ్ నుండి విడిపోయి రన్‌వే నుండి బౌన్స్ అవుతూ నేలపై పడింది.
Russia-Ukraine War: రష్యాకు G7 దేశాలు వార్నింగ్, ఉక్రెయిన్‌పై యుద్ధం ఆపకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిక
Hazarath Reddyఉక్రెయిన్ నగరాలపై రష్యా పెద్ద ఎత్తున క్షిపణి దాడులు చేసిన ఒక రోజు తర్వాత, గ్రూప్ ఆఫ్ సెవెన్ (G7) దేశాలు ఈ దాడులను ఖండించాయి. వైట్ హౌస్ విడుదల చేసిన ఒక ప్రకటన ప్రకారం.. ఉక్రెయిన్‌పై అణ్వాయుధాలను ఉపయోగించడం వల్ల తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించాయి.
Video Games Threat: మీ పిల్లలు వీడియో గేమ్స్ ఆడుతున్నారా? అయితే డేంజర్‌లో పడ్డట్లే! వీడియో గేమ్స్ ఆడే పిల్లల గుండెకు ముప్పు, ప్రాణాపాయం ఉండే అవకాశముందని పరిశోధకుల హెచ్చరిక
Naresh. VNSవీడియో గేమ్స్‌.. గుండె లయ సక్రమంగాలేని పిల్లల్లో తీవ్ర ప్రమాదానికి కారణమవుతాయి. ఒక్కసారిగా గుండె ఆగిపోయేలా చేస్తాయి. వీడియో గేమ్‌ ఆడుతూ ఆడుతూ పిల్లలు కుప్పకూలిపోతారు.’ అని అధ్యయనానికి నేతృత్వం వహించిన ఆస్ట్రేలియాలోని ది హార్ట్‌ సెంటర్‌ ఫర్‌ చిల్డ్రన్‌ పరిశోధకులు (The Heart Centre for Children) తెలిపారు.
Astronaut Scam: అంతరిక్షంలో ఇరుక్కుపోయా.. కిందకు వచ్చేందుకు రాకెట్ కావాలంటూ రూ.25లక్షలు వసూలు, టికెట్‌కు కూడా డబ్బు లేదంటూ వృద్ధురాలికి వల, ప్రేమ పేరుతో 65 ఏళ్ల వృద్ధురాలి నుంచి డబ్బులు గుంజిన అజ్ఞాత వ్యక్తి, జపాన్‌లో వృద్ధురాలిని విచిత్రంగా మోసం చేసిన ఆగంతకుడు
Naresh. VNSతాను స్పేస్‌లో (Space) పనిచేస్తున్నాను, కిందకు వచ్చేందుకు టికెట్ డబ్బులు కావాలంటూ మోసం చేసి ఏకంగా 25లక్షలు వసూలు చేశాడు. పైగా నేను నిన్ను ప్రేమిస్తున్నాను, స్పేస్ నుంచి కిందకు రాగానే ఇద్దరం పెళ్లి చేసుకుందామంటూ తియ్యటి కబుర్లు చెప్పాడు.
Dubai Gold: దుబాయి నుంచి ఎంత బంగారం కొని ఇండియాకు తెచ్చుకోవచ్చు, దుబాయిలో బంగారం ధర ఎంత ఉంటుందో తెలుుసుకోండి
kanhaదుబాయ్ నుండి బంగారాన్ని కొనుగోలు చేయడం వెనుక అనేక కారణాలు ఉన్నాయి. దుబాయ్‌లో బంగారం ధర చాలా తక్కువగా ఉండడమే ఇందుకు మొదటి కారణం.
Covid In China: చైనాను వణికిస్తున్న ఇంకో కరోనా వైరస్, అత్యంత ప్రమాదకర ఒమిక్రాన్ సబ్-వేరియంట్‌లు BF.7, BA.5.1.7లతో డ్రాగన్ కంట్రీ విలవిల, ఒక్కసారిగా పెరిగిన కేసులు
Hazarath Reddyచైనాపై కరోనావైరస్‌ మరోసారి పంజా విసురుతోంది. దేశంలో తాజా కోవిడ్ పెరుగుదల (Covid In China) మధ్య చైనాలో కొత్త Omicron సబ్-వేరియంట్‌లు BF.7 మరియు BA.5.1.7 కనుగొనబడ్డాయి. రెండు ఉప-వేరియంట్‌లు (Omicron strains) ఎక్కువ ట్రాన్స్‌మిసిబిలిటీతో అత్యంత ప్రమాదకర అంటువ్యాధిగా చెప్పబడ్డాయి.
Russia-Ukraine War: రష్యాకు షాకిచ్చిన భారత్, UNGAలో ఉక్రెయిన్‌పై రహస్య బ్యాలెట్ కోసం రష్యా చేసిన డిమాండ్‌ను తిరస్కరిస్తూ ఓటు వేసిన ఇండియా
Hazarath Reddyఉక్రెయిన్‌లోని నాలుగు ప్రాంతాలను మాస్కో అక్రమంగా ఆక్రమించడాన్ని ఖండిస్తూ ముసాయిదా తీర్మానంపై ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో రహస్య ఓటింగ్ నిర్వహించాలన్న రష్యా డిమాండ్‌ను తిరస్కరించేందుకు భారత్ మంగళవారం ఓటు వేసింది. భారతదేశం బదులుగా బహిరంగ ఓటును కలిగి ఉండాలని అల్బేనియా పిలుపునిచ్చిన విధానపరమైన ఓటుకు అనుకూలంగా ఓటు వేసింది.
Paper in Samosa: వేడి వేడి సమోసా వచ్చింది.. ఆవురావురుమంటూ తిందామని అతను దాన్ని కొరికాడు.. ఇంతలో నోటికి ఏదో తగిలింది.. ఏమిటా అని చూస్తే.. షాక్.. ఐఆర్‌సీటీసీకి ప్రయాణికుడి ఫిర్యాదు.. క్షమాపణలు కోరిన సంస్థ.. ఇంతకీ ఏమైందంటే??
Jai Kరైలు ప్రయాణంలో ఉల్లాసంగా సమోసా తిందామనుకొన్న ఓ ప్రయాణికుడికి చేదు అనుభవం ఎదురైంది. దానిని కొరకగానే అందులో ఓ పచ్చ కాగితం కనిపించింది. అంతే.. ప్రయాణికుడు అజి కుమార్ దానిని తినడం మాని ఫొటో తీసి ట్విట్టర్‌లో షేర్ చేశాడు. స్పందించిన ఐఆర్‌సీటీసీ క్షమాపణలు కోరింది.
Two Headed Snake: రెండు తలలు ఉన్నా మిగతా శరీరమంతా ఒకటే.. చేయి దగ్గర పెడితే, రెండు తలలతోనూ కాటు వేస్తుందోయ్.. అరుదైన రెండు తలల మిల్క్ స్నేక్... వీడియో ఇదిగో!
Jai Kతల పక్కనే మరో తలతో అక్కడక్కడ అరుదైన రీతిలో కొన్ని పాములు దర్శనమిస్తుంటాయి. అమెరికాలోని నార్త్ కరొలినాలో పాముల ఫామ్ నిర్వహిస్తున్న జిమ్మీ మేబ్.. ఇలాంటి ఓ అరుదైన రెండు తలల పాము వివరాలను వెల్లడించారు.
US Airports Cyber Attack: అమెరికా విమానాశ్రయాలపై సైబర్ దాడులు, రష్యాపై అనుమానం
kanhaఅమెరికాలోని కొన్ని అతిపెద్ద విమానాశ్రయాలు సోమవారం సైబర్ దాడులకు గురయ్యాయి. విమానాశ్రయంపై రష్యా హ్యాకర్లు సైబర్ దాడి చేసినట్లు అనుమానిస్తున్నారు. సైబర్ దాడికి రష్యా హ్యాకర్లే బాధ్యులని అమెరికా ప్రకటించింది.
Uber Ride: ఊబర్ క్యాబ్ బుక్ చేస్తున్నారా.. అయితే 15 నిమిషాల రైడింగ్‌కు రూ.32.4 ల‌క్ష‌లు బిల్లు న్యూస్ చదవాల్సిందే, బిత్తరపోయిన యూకేలో ఓ వ్యక్తి
Hazarath Reddyయూకేలో ఓ వ్యక్తికి వింత అనుభవం ఎదురైంది. మాంచెస్ట‌ర్‌కు చెందిన 22 ఏండ్ల ఒలివ‌ర్ ప‌బ్‌కు వెళ్లేందుకు ఊబర్ క్యాబ్ బుక్ చేసుకున్నాడు. అనంతరం ప‌బ్‌లో ఫ్రెండ్‌తో డ్రింక్ తీసుకుని మ‌రుస‌టి రోజు ఉద‌యాన్నే లేచేస‌రికి త‌న మొబైల్‌కు 39,317 డాల‌ర్లు (రూ.32.4 ల‌క్ష‌లు) క్యాబ్ బిల్లు వచ్చింది.
Venezuela Floods: భారీ వరదలకు అల్లాడుతున్న వెనిజులా, 22 మంది మృతి, 50 మందికి పైగా గల్లంతు, మూడు రోజుల జాతీయ సంతాప దినాలు
Hazarath Reddyవెనిజులాను వరదలు ముంచెత్తాయి. లాస్ టెజెరియాస్ నగరంలో కొండచరియలు విరిగిపడి పెద్ద ఎత్తున విధ్వంసాన్ని సృష్టించాయి. కొండచరియలు కారణంగా 22 మంది మరణించగా.. దాదాపు 50 మంది గల్లంతయ్యారు. వందలాది ఇండ్లు కూలిపోయాయి
Donald Trump: 3వ ప్రపంచ యుద్ధంపై డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు, ఈ భూమిపై ఏమీ మిగలదు, మూడో ప్రపంచ యుద్ధంతోనే ముగుస్తుందని హెచ్చరిక
Hazarath Reddyఉక్రెయిన్‌పై కొన్ని నెలలుగా సైనిక చర్య పేరుతో భీకర దాడులకు పాల్పడుతోంది రష్యా. అందుకు దీటుగా కీవ్‌ సేనలు బదులిస్తున్నారు. వందల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి