World
YS Jagan Davos Tour: దావోస్‌లో బిజీబిజీగా ఏపీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి, తొలిరోజు పలు కీలక భేటీల్లో పాల్గొన్న జగన్, పలువురు ఆర్ధికవేత్తలతో భేటీ
Naresh. VNSదావోస్‌లో (Davos) జరుగుతున్న వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం సదస్సులో (World Economic forum) పాల్గొంటున్న ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తొలిరోజు బిజీబిజీగా గడిపారు. పలువురు ప్రముఖులతో వరుస సమావేశాల్లో సీఎం జగన్‌ పాల్గొన్నారు. ఈ క్రమంలోనే కాలుష్యం లేని ఇంధనాలపై సీఎం జగన్‌ ప్రత్యేక దృష్టి సారించారు. రాష్ట్రంలో మౌలిక సదుపాయాల అభివృద్ధిపై సీఎం వివరించారు
Russia Bans 963 US Citizens: అమెరికా అధ్యక్షుడ్ని నిషేదించిన రష్యా, తమ దేశంలోకి రాకుండా బ్యాన్ విధిస్తూ నిర్ణయం, లిస్ట్‌ లో అమెరికా అధ్యక్షుడు, ఉపాధ్యక్షురాలు, పలువురు సెలబ్రెటీలు, ఇప్పటి వరకు 963కు చేరిన నిషేదిత జాబితా
Naresh. VNSఅమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden), ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్‌ను (Kamala Harries) తమ దేశంలోకి రాకుండా రష్యా (Russia) ప్రభుత్వం శాశ్వత నిషేధం విధించింది. దీంతో రష్యా ప్రభుత్వం ద్వారం శాశ్వత నిషేదానికి గురైన అమెరికా పౌరుల సంఖ్య 963కి చేరింది.
Modi Japan Tour: జపాన్ వెళ్లనున్న ప్రధాని మోదీ, రష్యా- ఉక్రెయిన్ వార్ నేపథ్యంలో ఆసక్తికరంగా మోదీ పర్యటన, క్వాడ్ సదస్సులో పాల్గొననున్న ప్రధాని, బిజీ బిజీగా షెడ్యూల్
Naresh. VNSరష్యా- ఉక్రెయిన్ (Russia- Ukraine) మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రధాని మోదీ విదేశీ టూర్ ఆసక్తికరంగా మారింది. రెండు రోజుల పాటూ ప్రధాని మోదీ (PM Modi) జపాన్ లో పర్యటించనున్నారు. ఈ నెల 23, 24 తేదీల్లో ఆయన జపాన్‌లో పర్యటించనున్నారు. మే 24న టోక్యోలో జరిగే క్వాడ్ సదస్సుకు హాజరవుతారు. పర్యటనలో భాగంగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, జపాన్ ప్రధాని కిషిదతో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు.
Monkeypox: గే, బైసెక్సువల్‌ సెక్స్ చేసే వారి ద్వారా మంకీపాక్స్‌ వైరస్‌ వ్యాప్తి, పురుషుడితో మరో పురుషుడు సెక్స్ చేసేవారిలో మంకీపాక్స్‌ లక్షణాలు, జాగ్రత్తగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసిన అమెరికా సీడీసీ
Hazarath Reddyఇప్పటిదాకా ఆఫ్రికాలో మాత్రమే కనిపించిన మంకీపాక్స్‌ వైరస్‌ తాజాగా యూరప్‌, యూకే, నార్త్‌ అమెరికాలోనూ విజృంభిస్తోంది. కేసులు (Monkeypox) తక్కువగానే నమోదు అవుతున్నప్పటికీ దాని వ్యాపి ఆందోళకనకరంగా మారింది. ఈ విజృంభణలో చాలావరకు కేసులు.. శారీరక కలయిక ద్వారానే వ్యాప్తి (gay, bisexual men against the virus) చెందినట్లు స్పష్టమవుతోంది
IAF 3rd On Global Ranking: పాకిస్తాన్, చైనాలకు భారీ షాక్, అత్యంత శక్తివంతమైన వైమానిక దళం జాబితాలో భారత్ మూడవస్థానం, 2022 గ్లోబల్ ఎయిర్ పవర్స్ ర్యాంకింగ్‌ను ప్రచురించిన WDMMA
Hazarath Reddyభారత వైమానిక దళం (IAF) ప్రపంచంలోని వివిధ దేశాలకు చెందిన వివిధ వైమానిక సేవల యొక్క మొత్తం పోరాట శక్తి పరంగా ప్రపంచ వాయు శక్తి సూచికలో మూడవ స్థానంలో నిలిచింది. వరల్డ్ డైరెక్టరీ ఆఫ్ మోడరన్ మిలిటరీ ఎయిర్‌క్రాఫ్ట్ (WDMMA) 2022 గ్లోబల్ ఎయిర్ పవర్స్ ర్యాంకింగ్‌ను ప్రచురించింది. ఈ జాబితాలో భారత్‌ ముందు పాకిస్థాన్‌ ఎక్కడా లేదు. అమెరికా, రష్యాల తర్వాత భారత వైమానిక దళం మూడో స్థానంలో ఉంది.
Canadian MP Chandra Arya: కెన‌డా పార్ల‌మెంట్‌లో క‌న్న‌డ భాష మాట్లాడిన ఎంపీ, తన మాతృభాష మాట్లాడినందుకు గర్వంగా ఉందని వెల్లడి, సోషల్ మీడియలో నెటిజన్ల ప్రశంసలు
Hazarath Reddyకెనడా పార్లమెంట్‌లో ఆ దేశ ఎంపీ క‌న్న‌డ‌లో అన‌ర్గ‌ళంగా మాట్లాడేశారు. ఈ వీడియో సోష‌ల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. మాతృభాష‌ను అంద‌ళ‌మెక్కించినందుకు నెటిజ‌న్లు తెగ ప్ర‌శంస‌లు కురిపించారు. కెన‌డా ఎంపీ చంద్రఆర్య కెన‌డా పార్ల‌మెంట్‌లో క‌న్న‌డ భాష‌లో మాట్లాడారు.
Angrez Dadaji Dances: ఇంటర్నెట్‌ని షేక్ చేస్తోన్న అంగ్రేజీ దాదాజీ వీడియో, ష‌కీరా..వాకా వాకా, బెయాన్స్ క్రేజీ ఇన్ ల‌వ్ పాట‌పై అదిరిపోయే స్టెప్పులు
Hazarath Reddyయూకేలోని సౌత్‌పోర్ట్‌లో ఆ వృద్ధుడు ప్ర‌పంచంతో త‌న‌కెలాంటి సంబంధం లేన‌ట్లు డ్యాన్స్‌లో మునిగిపోయాడు. నీలిరంగు చొక్కా, న‌ల్ల‌టి ప్యాంటు, టోపీ ధ‌రించి ష‌కీరా..వాకా వాకా, బెయాన్స్ క్రేజీ ఇన్ ల‌వ్ పాట‌పై అదిరిపోయే స్టెప్పులేశాడు. ఈ వీడియోను ‘గుడ్‌న్యూస్‌ మూవ్‌మెంట్‌’ అనే పేజీ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది
Monkeypox: అమెరికా సహా యూరప్ లో మంకీపాక్స్ కలకలం, అసలు ఈ వైరస్ లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసా? మంకీపాక్స్ సోకిందా? లేదా? ఎలా తెలుసుకోవాలంటే!
Naresh. VNSమంకీపాక్స్ (Monkey pox) అనేది అరుదైన, తేలికపాటి వైరస్. సాధారణంగా ఆఫ్రికాలోని (Africa) కొన్ని ప్రాంతాల్లో ఈ వ్యాధి సోకిన అడవి జంతువుల నుండి మనుషులకు వ్యాపిస్తుంది. ఇది తొలిసారి 1958లో పరిశోధనల్లో భాగంగా కోతుల నుంచి ఈ వ్యాధిని కనుగొన్నారు. అందుకే పేరు మంకీపాక్స్ (Monkey pox) అని పెట్టారు. యూకేలోని ఎన్ హెచ్ఎస్ వెబ్‌సైట్ ప్రకారం 1970లో మొదటిసారిగా మనుషుల్లో ఈ వ్యాధి కనిపించింది.
Monkeypox in US: అమెరికాలో తొలి మంకీపాక్స్ కేసు, వ్యాధి సోకిన వ్య‌క్తి శ‌రీరాన్ని తాకితే ఈ వైరస్ వచ్చేస్తుంది, మంకీ పాక్స్ వైరస్ లక్షణాలు ఇవే, సెక్స్ వ‌ర్క‌ర్ల ద్వారా ఎక్కువగా వ్యాప్తి
Hazarath Reddyకరోనాతో విలవిలలాడుతున్న అమెరికాలో మంకీపాక్స్ వైర‌స్ కేసు (Monkeypox in US) న‌మోదు అయ్యింది. ఆ దేశ అంటువ్యాధుల సంస్థ సీడీసీ (CDC) ఈ కేసును ద్రువీక‌రించింది. మాసాచుసెట్స్‌కు చెందిన ఓ వ్య‌క్తికి ఈ వైర‌స్ సోకిన‌ట్లు నిర్ధార‌ణ‌కు వ‌చ్చారు.
COVID Hits North Korea: కిమ్ నిర్లక్ష్యానికి బలవుతున్న ప్రజలు, ఉత్తర కొరియాలో కరోనా విలయతాండవం, ఇప్పటికీ ప్రారంభం కాని వ్యాక్సినేషన్‌ ప్రక్రియ
Hazarath Reddyఉత్తరకొరియాలో కొద్దిరోజుల కిత్రం ఒమిక్రాన్‌ మొదటి కేసు నమోదు కాగా తాజాగా భారీ సంఖ‍్యలో పాజిటివ్‌ కేసులు (COVID Hits North Korea) పెరగడం నార్త్‌ కొరియా అధ్యక్షుడు కిమ్‌జోంగ్‌ ఉన్‌ను ఆందోళనకు గురిచేస్తోంది. అయితే, ఇప్పటివరకు వరకు నార్త్‌ కొరియాలో కరోనా వైరస్‌తో 42 మంది మృతి చెందినట్టు ఆ దేశ మీడియా కొరియన్‌ సెంట్రల్‌ న్యూస్‌ ఏజెన్సీ(KCNA) ఓ ప్రకటనలో తెలిపింది.
Vladimir Putin: పుతిన్ ఆరోగ్యపరిస్థితి వెరీ సీరియస్, బ్లడ్ క్యాన్సర్ సహా పలు వ్యాధులతో బాధపడుతున్న రష్యా అధ్యక్షుడు, ఆయన ఆరోగ్యం గురించి సంచలనం రేపుతున్న ఆడియో టేప్
Naresh. VNSరష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ( Vladimir Putin) బ్లడ్ క్యాన్సర్‌తో (Blood Cancer) బాధపడుతున్నట్లు సమాచారం. రష్యాలో అధికార పార్టీకి అత్యంత సన్నిహితులైన ఓలిగర్‌లలో ఒకరు ఈ విషయాన్ని వెల్లడించారు. పుతిన్ ఆరోగ్యంపై ఒక వ్యాపారవేత్తతో జరిపిన సంభాషణను ఓలిగర్ రికార్డు చేశాడు.
New York Shocker: అమెరికా మరోసారి కాల్పుల మోత, సూపర్ మార్కెట్లో ప్రవేశించి తుపాకితో 10 మందిని కాల్చి చంపిన దుండగుడు, సోషల్ మీడియాలో లైవ్ స్ట్రీమింగ్ ఇస్తూ చంపేశాడు...
Krishna. సైనికుడి దుస్తులు, కెమెరా ఉన్న హెల్మెట్ ధరించి సోషల్ మీడియాలో లైవ్ స్ట్రీమింగ్ చేస్తూ.. తుపాకీతో సూపర్‌ మార్కెట్‌లోకి ప్రవేశించిన దుండగుడు.. అక్కడున్న వారిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపినట్లు పోలీసులు తెలిపారు. ఈ దుశ్చర్యలో 10 మంది అక్కడికక్కడే మరణించగా.. ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.
Rat Problem In New York: న్యూయార్క్ నగరాన్ని పట్టి పీడిస్తున్న ఎలుకల సమస్య, విపరీతంగా పెరిగిపోయిన ఎలుకల జనాభా, న్యూయార్క్ జనాభా కన్నా 5 రెట్లు పెరిగిన ఎలుకల జనాభా..
Krishnaన్యూయార్క్ నగరంలో గడిచిన దశాబ్ద కాలంతో పోల్చితే ఈ సంవత్సరం ఎలుకల జనాభా భారీగా పెరిగింది. న్యూయార్క్ లో ఎలుకల జనాభా ఎంత పెరిగిందో ప్రస్తుతానికి చెప్పలేమని, అయితే కోవిడ్ -19 మహమ్మారి నేపథ్యంలో జనసంచారం రోడ్లపై, ఆఫీసుల్లో తగ్గడంతో, ప్రస్తుతం వాటి సంఖ్య భారీగా పెరిగిందని న్యూయార్క్ స్టేట్ టౌన్ ప్లానింగ్ అధికారులు చెబుతున్నారు.
COVID Hits North Korea: కిమ్ రాజ్యంలో కరోనా కల్లోలం, ఆరుమంది మృతి, గృహ నిర్భంధంలో లక్షా 87 వేల మంది పౌరులు
Hazarath Reddyకిమ్‌ రాజ్యంలో కరోనా కల్లోలం రేపుతోంది. రాజధాని ప్యాంగాంగ్‌లో జర్వంతో మొత్తం ఆరుగురు మరణించారని, వారిలో ఒకరికి కరోనా పాజిటివ్‌ వచ్చిందని కొరియన్‌ సెంట్రల్‌ న్యూస్‌ ఏజెన్సీ తెలిపింది. మృతుడిలో ఒమిక్రాన్‌ సబ్‌ వేరియంట్‌ బీఏ.2ను గుర్తించినట్లు పేర్కొన్నది.
Sheikh Khalifa Bin Zayed Al Nahyan Dies: యుఎఈ అధ్యక్షుడు కన్నుమూత, అనారోగ్యంతో మరణించిన షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్, సంతాపం తెలిపిన పలు దేశాల ప్రముఖులు
Hazarath Reddyయునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (UAE) అధ్యక్షుడు షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ మృతి చెందారు. 73 ఏళ్ల అబుదాబి పాలకుడు షేక్‌ ఖలీఫా.. శుక్రవారం కన్నుమూసినట్లు అక్కడి ప్రభుత్వం ఒక ప్రకటనలో పేర్కొంది. షేక్‌ ఖలీఫా 2014, నవంబర్‌ 3 నుంచి యూఏఈ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు.
Serbia: 5వ భర్త బద్దకంగా ఉన్నాడని..అతన్ని ముక్కలు ముక్కలుగా నరికేసిన భార్య, ఆ ముక్కలతో కడాయిలో కూర చేసిన కసాయి, ఇంట్లో ఉన్న దృశ్యాలను చూసి షాక్ తిన్న పోలీసులు
Hazarath Reddyసెర్బియాలోని జ్రెంజనిన్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. తన భర్తకు బద్ధకం ఎక్కువైందని, పనిలో సాయం చేయడం లేదన్న కోపంతో అతడిని (Wife Kills Husband) చంపేసింది. అంతటితో ఆగకుండా భర్త మృతదేహాన్ని ముక్కలుగా నరికి వాటితో కూర వండేసింది.
Viral Wedding Video: ఇదేమి వెడ్డింగ్, మంటల్లో వధూవరులు, షాకయిన పెళ్లికి వచ్చిన అతిధులు, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో
Hazarath Reddyఓ వెడ్డింగ్ జంట చేసిన సాహసం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గేబ్-అంబిర్ అనే ఆ కొత్త జంట ప్రొఫెషనల్ స్టంట్ మాస్టర్స్ కావడంతో ఫైర్ స్టంట్ చేశారు. స్టంట్‌ ప్రారంభించే ముందు ఇద్దరూ ఒకరి చేయి ఒకరు పట్టుకుని ఒకచోట నిలుచున్నారు.
Sri Lanka New PM: లంక నూతన అధ్యక్షుడిగా రణిల్ విక్రమసింఘే, ఆరోసారి ప్రమాణస్వీకారం చేసిన సింఘే, సంక్షోభాలను చక్కదిద్దడంలో దిట్ట, లంక కొత్త ప్రధాని గురించి మరిన్ని వివరాలు ఇవే!
Naresh. VNSప్రజాగ్రహం, తీవ్ర ఒత్తిడికి తలొగ్గి ప్రధాని పదవి నుంచి మహింద రాజపక్స (Mahinda rajapakse) వైదొలగాల్సి వచ్చింది. ఆయన స్థానంలో రణిల్ విక్రమసింఘే ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. దేశాధ్యక్షుడు గొటబయ రాజపక్స(Gotabayarajapakse) సోదరుడు మహింద రాజపక్స ప్రధాని పదవికి రాజీనామా చేసినప్పటి నుంచి రణిల్ విక్రమసింఘే పేరు ఎక్కువగా వినిపించింది.
China Flight Fire: చైనాలో రన్ వే పై ఉన్న విమానంలో మంటలు, తృటిలో తప్పిన ప్రమాదం, 113 మంది ప్రయాణికులు సురక్షితం, వీడియో వైరల్..
Krishnaచైనాలో మరో విమాన ప్రమాదం జరిగింది. టిబెట్ ఎయిర్‌లైన్స్ విమానం గురువారం ఉదయం చాంగ్‌కింగ్ జియాంగ్‌బీ అంతర్జాతీయ విమానాశ్రయం లో అగ్నిప్రమాదానికి గురయింది. , అయితే ప్రయాణీకులు, సిబ్బంది అందరూ "సురక్షితంగా తప్పించుకున్నారు" అని విమానయాన సంస్థ తెలిపింది.
Bill Gates Covid: పూర్తి స్థాయిలో వ్యాక్సిన్లు తీసుకున్నా..కరోనా బారీన పడిన బిల్ గేట్స్, పూర్తిగా రికవరీ అయ్యేవరకు ఐసోలేషన్‌లోనే ఉంటానని ట్వీట్‌
Hazarath Reddyమైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ (Bill Gates) కరోనా బారిన పడ్డారు. తనకు తేలికపాటి కరోనా లక్షణాలున్నాయని ఆయన స్వయంగా వెల్లడించారు. సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా మారేవరకు తాను ఐసోలేషన్‌లోనే ఉంటానని ట్వీట్‌ చేశారు. తాను వైద్యుల సలహాలను అనుసరిస్తున్నానని పేర్కొన్నారు.