World

Better.com CEO Vishal Garg: జూమ్ మీటింగ్‌ లో 3వేల మంది జాబ్ తీసేశాడు! మరోసారి వార్తల్లోకెక్కిన విశాల్ గార్గ్, గతంలోనూ 9వందల మందిని తొలగించిన విశాల్

Naresh. VNS

మరోసారి సంచలనంగా మారారు Better.com సీఈఓ విశాల్ గార్గ్ . గతంలో జూమ్ వీడియో కాల్‌ ద్వారా 900 మంది ఉద్యోగులను తీసేసిన విశాల్ గార్గ్....తాజాగా మరోసారి అదే తరహా నిర్ణయం తీసుకొని వార్తల్లోకి ఎక్కాడు. గతేడాది డిసెంబర్లో కరోనా సెకండ్ వేవ్ ఊపందుకుంటున్న సమయంలో తమ సంస్థలో పనిచేస్తున్న 900 మంది ఉద్యోగులను తీసేస్తున్నట్లు ఒక్క జూమ్ వీడియో కాల్ ద్వారా విశాల్ ప్రకటించాడు.

First Pig Heart Transplant Dies: పంది గుండె అమర్చిన వ్యక్తి మృతి, ఆపరేషన్ జరిగిన రెండు నెలలకు కన్నుమూసిన పేషెంట్, ఎలా చనిపోయాడని పరిశోధిస్తున్న వైద్యులు, చరిత్రలో అరుదైన ఆపరేషన్ ఫెయిల్

Naresh. VNS

కొద్దిరోజుల క్రితం పంది గుండెను (Pig Heart) మనిషికి అమర్చి చరిత్ర సృష్టించారు అమెరికా వైద్యులు. అప్పట్లో ఆ ఆపరేషన్ సక్సెస్ (Surgery) అయినట్లు ప్రకటించారు. కానీ రెండు నెలల తర్వాత అతను చనిపోయాడు. రెండు నెలల తర్వాత అతను చనిపోయాడు. గత జనవరి 7న వైద్యులు డేవిడ్ బెన్నెట్ (57) (David Bennett)అనే వ్యక్తికి పంది గుండెను అమర్చారు.

Russia-Ukraine War: భారత ప్రధాని మోదీకి పాక్ మహిళ కృతజ్ఞతలు, అత్యంత క్లిష్టమైన పరిస్థితి నుంచి బయటపడేందుకు సాయం చేశారని వీడియోలో వెల్లడి

Hazarath Reddy

కీవ్‌లోని భారత రాయబార కార్యాలయం సహకారంతో ఉక్రెయిన్ నుంచి బయటపడిన పాకిస్థాన్ బాలిక భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీకి థ్యాంక్స్ చెబుతూ పోస్టు చేసిన వీడియో వైరల్ అవుతోంది. ఆ బాలిక పేరు ఆస్మా షఫీక్.

Ukrainian President Zelensky Compromise: రష్యాతో రాజీకి సిద్ధమైన ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ, నాటో చేరేది లేదని ప్రకటన, మెత్త బడ్డ పుతిన్, 14 రోజుల యుద్ధం ముగింపునకు వచ్చే అవకాశం..

Krishna

రష్యాతో రాజీకి సిద్ధమైనట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ప్రకటించారు. తమ దేశంపై రష్యా దురాక్రమణను ఆపేలా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. యుద్ధానికి కారణమైన నాటోలో తమ దేశం చేరే ఆలోచనను విరమించుకుంటున్నట్టు వెల్లడించారు.

Advertisement

Ukraine Crisis: రష్యాకు జో బైడెన్‌ షాక్, ర‌ష్యా ఆయిల్ దిగుమ‌తుల‌పై యూఎస్ నిషేధం.. ఆకాశాన్ని తాకిన బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధ‌ర‌లు

Hazarath Reddy

ఉక్రెయిన్‌పై యుద్ధానికి దిగిన ర‌ష్యా ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను పూర్తిగా దెబ్బ తీసేందుకు అమెరికా సిద్ధ‌మైంది. ఇందులో భాగంగా రష్యాపై మరిన్ని ఆంక్షలు విధిస్తూ అమెరికా (America) నిర్ణయం తీసుకుంది. రష్యా నుంచి గ్యాస్‌, ఆయిల్‌ దిగుమతులపై నిషేదం ( Ban on All Imports of Russian Gas, Oil) విధిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ (Joe Biden) ప్రకటన చేశారు.

Russia-Ukraine Conflict: రష్యాకు భారీ షాక్, ఉక్రెయిన్‌కు అండగా ప్రపంచ బ్యాంక్, ఆర్థిక అత్యవసర పరిస్థితి నుంచి బయటపడేందుకు 723 మిలియన్ డాలర్ల సహాయ ప్యాకేజీని ప్రకటిస్తున్నట్లు వెల్లడి

Hazarath Reddy

గత కొద్ది రోజులుగా సంపన్న దేశం రష్యాతో పోరాడుతున్న ఉక్రెయిన్‌ తీవ్రంగా (Russia-Ukraine Conflict) నష్టపోయింది. ఇప్పటికే యూకే పీఎం బోరిస్ జాన్సన్ 100 బిలియన్ డాలర్ల సాయం ప్రకటిస్తున్నట్లు చెప్పిన సంగతి తెలిసిందే. తాజాగా ప్రపంచ బ్యాంక్ కూడా ఉక్రెయిన్‌కు అండగా నిలబడేందుకు (Ukraine Amid Conflict With Russia) ముందుకొచ్చింది.

Russia-Ukraine Conflict: 200 మంది భారతీయులు సురక్షితంగా దేశానికి, 20 వేల మందిని ఉక్రెయిన్‌ నుంచి భారత్‌కు తరలించామని తెలిపిన విదేశాంగ శాఖ

Hazarath Reddy

సుమారు 20 వేల మందిని ఉక్రెయిన్‌ నుంచి భారత్‌కు సురక్షితంగా తరలించినట్లు భారత్‌ యూఎన్‌ అంబాసిడర్‌ టీఎస్‌ త్రిమూర్తి.. ఐరాస భద్రతా మండలిలో ప్రకటించారు.

Russia-Ukraine Conflict: భారత్ విజ్ఞప్తిని అంగీకరించిన రష్యా, నేడు కాల్పుల విరమణ, భారత విద్యార్థుల త‌ర‌లింపు సుర‌క్షితంగా చేపట్టాల‌ని ఇరు దేశాలతో సంభాషించిన ప్రధాని మోదీ

Hazarath Reddy

ర‌ష్యా ఈ రోజు కాల్పులు విర‌మ‌ణ ప్ర‌క‌టించింది. స్థానిక కాల‌మానం ప్ర‌కారం ఉద‌యం 10 గంట‌ల‌కు ఆయుధాలు మోగ‌బోనున్నాయి. విద్యార్థుల త‌ర‌లింపు నేప‌థ్యంలో భార‌త్ ఆందోళ‌న వ్య‌క్తం చేసిన విష‌యం తెలిసిందే. ఉక్రెయిన్‌లోని సుమీలో చిక్కుకున్న భారతీయుల త‌ర‌లింపు సుర‌క్షితంగా చేపట్టాల‌ని ప్ర‌ధాని మోదీ ఇప్ప‌టికే ఉక్రెయిన్‌, ర‌ష్యా అధ్య‌క్షుల‌తో సంభాషించారు.

Advertisement

International Women’s Day 2022: అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు తెలిపే మెసేజెస్, వాట్సప్ స్టిక్కర్స్, వాట్సప్ స్టేటస్ మీకోసం

Hazarath Reddy

మహిళలను ఆకాశంలో సగం అవనిలో సగం అంటారు. అటువంటి మహిళా లోకం శక్తికి ప్రతీకగా నిర్వహించే పండుగ, మహిళలంతా సంతోషంగా జరుపుకునే వేడుక, మహిళా సాధికారత దిశగా నడిపించటం కోసం నిర్వహించే సంబరమే అంతర్జాతీయ మహిళా దినోత్సవం. ప్రతి ఏడాది మార్చి 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటారు. నారీ మణులకు శుభాకాంక్షలు వీడియో ద్వారా తెలపండి

Russia-Ukraine Conflict: ఉక్రెయిన్ అధ్యక్షుడుతో పీఎం మోదీ ఫోన్ కాల్, భార‌త పౌరుల త‌ర‌లింపులో సాయం ప‌ట్ల జెలెన్ స్కీకి పీఎం కృత‌జ్ఞ‌త‌లు, దౌత్య మార్గాల్లో స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించుకోవాలని సూచన

Hazarath Reddy

ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్ స్కీతో భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఫోనులో మాట్లాడారు. వీరిద్ద‌రి మ‌ధ్య దాదాపు 35 నిమిషాల పాటు సంభాష‌ణ కొన‌సాగింది. ఉక్రెయిన్ నుంచి భార‌త పౌరుల త‌ర‌లింపులో సాయం ప‌ట్ల జెలెన్ స్కీకి మోదీ కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.

Visa, Mastercard Suspend Russia: రష్యాకు మరో షాక్, వీసా, అక్కడ మాస్టర్ కార్డులపై ఆంక్షలు విధించిన సంస్థలు, ఏటీఎంల ముందు క్యూ కట్టిన రష్యన్లు, ఆర్ధికంగా రష్యాకు భారీ ఎదురుదెబ్బ

Naresh. VNS

Russia-Ukraine Conflict: న్యూక్లియర్ వార్‌ కు దిగుతున్న రష్యా, మరో న్యూక్లియర్ విద్యుత్ ప్లాంట్ స్వాధీనం దిశగా దూసుకెళ్తున్న బలగాలు, రష్యా దూకుడుతో ఐక్యరాజ్యసమితి ఆందోళన

Naresh. VNS

రష్యా గుప్పిట్లో యుక్రెయిన్ (Ukraine) వణికిపోతోంది. రష్యా బలగాలపై యుక్రెయిన్ సైన్యం ఎంతగా ప్రతిఘటించినా వెనక్కి తగ్గడం లేదు. పుతిన్ బలగాలు యుద్ధాన్ని మరింత తీవ్రతరం చేస్తున్నాయి. యుక్రెయిన్‌పై క్రమంగా రష్యా బలగాలు పట్టుబిగిస్తున్నాయి.

Advertisement

Topless Protesters Against Putin:పుతిన్ కు వ్యతిరేకంగా దుస్తులు విప్పేసిన మహిళలు, రష్యా ఎంబసీ ముందు అర్ధనగ్న ప్రదర్శన చేసిన స్పెయిన్ మహిళా సంఘాలు

Naresh. VNS

సైనిక చర్య పేరుతో యుక్రెయిన్ పై రష్యా చేస్తున్న యుద్ధాన్ని యావత్ ప్రపంచం తప్పుపడుతోంది. పుతిన్ వెంటనే యుద్ధం ఆపేయాలని డిమాండ్ చేస్తున్నారు. అయినా, పుతిన్ వినడం లేదు. వెనక్కితగ్గడం లేదు. యుక్రెయిన్ పై బాంబుల వర్షం కురిపిస్తూనే ఉన్నాడు. తాజాగా స్పెయిన్ రాజధాని మాడ్రిడ్ లో ఫెమెన్ అనే మహిళా సంఘం వాలంటీర్లు (feminist group) రష్యా ఎంబసీ ముందు అర్దనగ్న ప్రదర్శనతో ఆందోళన చేశారు.

Peshawar Bomb Blast: పాకిస్థాన్‌లో బాంబు పేలుడు, 30 మంది మృతి, మరో 50 మందికి గాయాలు, సూసైడ్ అటాక్ జ‌రిగిన‌ట్లు అనుమానాలు

Hazarath Reddy

పాకిస్థాన్‌లో పెషావ‌ర్‌లోని ఓ మ‌సీదులో జ‌రిగిన పేలుడులో 30 మంది మ‌ర‌ణించిన‌ట్లు తెలుస్తోంది. సూసైడ్ అటాక్ జ‌రిగిన‌ట్లు అనుమానిస్తున్నారు. లేడీ రీడింగ్ హాస్పిట‌ల్‌కు చెందిన అధికారులు మృత‌దేహాల‌ను గుర్తిస్తున్నారు. ఈ ఘ‌ట‌న‌లో మ‌రో 50 మంది గాయ‌ప‌డిన‌ట్లు తెల‌తుస్తోంది.

Russia-Ukraine War: కైవ్‌లో మరో భారతీయ విద్యార్థిపై కాల్పులు, హాస్పిట‌ల్‌లో చికిత్స పొందుతున్న‌ట్లు తెలిపిన కేంద్ర మంత్రి వీకే సింగ్

Hazarath Reddy

ఉక్రెయిన్ రాజ‌ధాని కీవ్‌లో రష్యాతో భీక‌ర యుద్ధం న‌డుస్తోంది. ఈ యుద్దం జరుగుతున్న సమయంలో (Russia Ukraine War) అక్క‌డ ఉన్న ఓ భార‌తీయ విద్యార్థిపై కాల్పులు జ‌రిగిన‌ట్లు కేంద్ర మంత్రి వీకే సింగ్ తెలిపారు. ర‌ష్యా దాడుల నుంచి త‌ప్పించుకునేందుకు .. ఇండియ‌న్ స్టూడెంట్ పారిపోయే ప్ర‌య‌త్నం చేశాడు.

Zaporizhzhia Nuclear Power Plant: యుక్రెయిన్‌ లో మరో పెను ప్రమాదం, రష్యా దాడుల్లో యూరప్ అతిపెద్ద న్యూక్లియర్ పవర్ ప్లాంట్‌లో అగ్నిప్రమాదం, ఏ క్షణమైనా ముప్పువాటిల్లే అవకాశం

Naresh. VNS

రష్యా దాడితో మరో పెనుప్రమాదం ముంచుకోస్తోంది. రష్యా దాడుల తర్వాత యుక్రెయిన్ అణు విద్యుత్ ప్లాంట్‌లో(nuclear power plant) ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దాంతో యుక్రెయిన్ ప్రమాద హెచ్చరికలను జారీచేసింది. అణు విద్యుత్ ప్లాంట్ భద్రతకు ముప్పు ఏర్పడనుందని ఆందోళన వ్యక్తి చేస్తోంది.

Advertisement

UAE New Law : ప్రమాదంలో గాయపడ్డవారిని, చనిపోయిన వారిని ఫోటో తీస్తే జైలుకే! భారీగా జరిమానా, ఆరు నెలలు జైలు శిక్ష, కొత్త చట్టాన్ని అమల్లోకి తెచ్చిన యూఏఈ, సోషల్ మీడియాపై ఓ కన్నేసి ఉంచనున్న పోలీసులు

Naresh. VNS

ప్రమాదాల్లో గాయపడ్డవారిని గానీ, చనిపోయిన వారిని గానీఈ వీడియోలు లేదా ఫోటోలు తీస్తే కఠినంగా శిక్షించే చట్టాన్ని తీసుకొచ్చారు. అయితే ఇది మన దేశంలో కాదు, చట్టాలను అత్యంత కఠినంగా అమలు చేసే యూఏఈలో ఈ కొత్త చట్టం తీసుకువచ్చారు. ఇకనుంచి ప్రమాదం జరిగిన ప్రాంతంలో గాయపడినవారి ఫోటోలు గానీ..చనిపోయినవారి ఫోటోలు తీసినా. వీడియోలు తీసినా జైలుకే (Jail) అని వార్నింగ్ ఇచ్చింది దుబాయ్

Operation Ganga: ఉక్రెయిన్ నుంచి పిల్లులను, కుక్కలను తమ వెంట తెచ్చుకున్న విద్యార్థులు, తాజాగా 628 మంది భారతీయులు స్వదేశానికి..

Hazarath Reddy

ఇన్నాళ్లు తమ వెంటే ఉన్న ఈ పెంపుడు జంతువులను అక్కడి ఉద్రిక్తత పరిస్థితుల్లో వదిలేయడం ఇష్టం లేక వాటిని కూడా భారత్​కు తెచ్చామని తెలిపారు. వాయుసేన చేపడుతున్న విద్యార్థుల తరలింపు ప్రక్రియలో భాగంగా మరో 628 మంది భారతీయులు స్వదేశానికి చేరుకున్నారు.

UN Resolution: ఉక్రెయిన్ పై యుద్ధం ఆపండి! ఐక్యరాజ్యసమితి చారిత్రాక ఓటింగ్, రష్యాకు వ్యతిరేకంగా భారీగా ఓట్లు, ఓటింగ్ కు దూరంగా భారత్ సహా 35 దేశాలు

Naresh. VNS

యుక్రెయిన్‌ (Ukraine), రష్యా (Russia)మధ్య భీకర యుద్ధం కొనసాగుతోంది. రష్యా దురాక్రమణ చర్యలను ప్రపంచ దేశాలు హెచ్చరించినప్పటికీ ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ యుక్రెయిన్‌పై యుద్ధాన్ని(Russia war) మరింత తీవ్రతరం చేశాడు. యుక్రెయిన్‌పై రష్యా చర్యలకు వ్యతిరేకంగా ఐక్యరాజ్య సమితిలోని సర్వసభ్య సమావేశంలో (UN General Assembly)ఓటింగ్ జరిగింది.

Russia-Ukraine War: భారత విద్యార్థులంతా క్షేమంగా ఉన్నారు, ఉక్రెయిన్‌లో ఎవరూ బంధించలేదు, క్లారిటీ ఇచ్చిన విదేశాంగ శాఖ, సరిహద్దు దేశాలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామని వెల్లడి

Hazarath Reddy

తమ విద్యార్ధులను బంధించారనే అంశానికి సంబంధించి ఇప్పటి వరకు తమకు ఎలాంటి రిపోర్టులు రాలేదని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఆరిందమ్ బగ్చి స్పష్టం చేశారు. ఖార్ఖివ్, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న భారత విద్యార్థులు ఉక్రెయిన్ దక్షిణ సరిహద్దులకు చేరుకునేందుకు ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేయాలని ఆ దేశ అధికారులను కోరామని చెప్పారు

Advertisement
Advertisement