World

India- USA Trade: భారత్ అభివృద్ది చెందిన దేశం, జీఎస్పి కింద వాణిజ్య ప్రయోజనాలను పొందే అర్హత ఈ దేశానికి లేదు, భారత్‌కు జీఎస్పీ రద్దు నిర్ణయాన్ని సమర్థించుకున్న అమెరికా

Vikas Manda

యూఎస్ పరిపాలన ప్రకారం, ప్రపంచ వాణిజ్యంలో 0.5 శాతం కంటే తక్కువ వాటా ఉన్న దేశం జీఎస్పి కింద ప్రయోజనాలను పొందవచ్చు. అంతకంటే ఎక్కువ ఉంటే ప్రయోజనాలు వర్తించవు. ఈ క్రమంలో భారత్ తో పాటు బ్రెజిల్, ఇండోనేషియా, హాంకాంగ్, దక్షిణాఫ్రికా మరియు అర్జెంటీనాతో తదితర దేశాలను జీఎస్పీ నుంచి యుఎస్‌టిఆర్ తొలగించింది....

COVID-19 Outbreak: జపాన్ నిర్భంధంలోని డైమండ్ ప్రిన్సెస్ ఓడలో ఉన్న ఇద్దరు భారతీయులకు కరోనావైరస్ పాజిటివ్, నౌకలో చిక్కుకొని ఆవేదన చెందుతున్న భారతీయులు, రక్షించాలని ప్రధాని మోదీకి విజ్ఞప్తి

Vikas Manda

ఒకరికి కొవిడ్ -2019 వైరస్ ఉన్నట్లు గుర్తించారు. దీంతో అప్రమత్తమైన అధికారులు ఓడలోని మిగతావారికి ఈ వైరస్ సంక్రమించి ఉంటుంది అనే అనుమానంతో వారు బయటకు రాకుండా ఈనెల 4వ తేదీ నుంచి ఈ ఓడను జపాన్ తీరానికి దూరంగా నిర్భంధించి ఉంచారు.....

COVID-19: కరోనా పని పట్టాలంటే 18 నెలలు ఆగాల్సిందే, అందుబాటులోకి రానున్న మొదటి వ్యాక్సిన్, అప్పటిదాకా ఉన్న వనరులతోనే పోరాటం చేయాలన్న డబ్ల్యూహెచ్‌ఓ, ఇక నుంచి కరోనా పేరు కోవిడ్-9

Hazarath Reddy

ప్రపంచాన్ని వణికిస్తోన్న ఈ కరోనా వైరస్‌కు ప్రపంచ ఆరోగ్య సంస్థ కొత్త పేరు పెట్టింది. ఇకపై కరోనాను అధికారికంగా ‘కోవిడ్‌–19’గా పిలవనున్నారు. ఇందులో సీ అక్షరం కరోనాను, వీ అక్షరం వైరస్‌ను, డీ అక్షరం డిసీజ్‌ (జబ్బు)ను, 19ని.. వ్యాధిని కనుగొన్న 2019కి సూచనగా పెట్టారు.

Hafiz Saeed Convicted: ముంబై పేలుళ్ల సూత్రధారి హఫీజ్ సయీద్‌కు ఐదున్నరేళ్ల జైలు శిక్ష విధింపు, ఉగ్రవాదులకు నిధులు సమకూరుస్తున్నాడన్న అభియోగంలో దోషిగా తేల్చిన పాకిస్థాన్ కోర్టు

Vikas Manda

సయీద్ పై నమోదైన మరో ఆరు కేసులపై కూడా ఏకకాలంలో విచారణ జరిపి, తీర్పు జారీచేయాలనే మరో పిటిషన్‌ను లాహోర్ కోర్టు మంగళవారం స్వీకరించింది. 26/11 ముంబై దాడుల్లో హఫీజ్ సయీద్ సూత్రధారిగా ఉన్నాడు....

Advertisement

Foreign Currency In Peanuts: వేరుశనగ కాయల్లో రూ.45 లక్షల విలువ గల విదేశీ కరెన్సీ, ఢిల్లీ విమానాశ్రయంలో సీఐఎస్‌ఎఫ్‌ సిబ్బందికి పట్టుబడ్డ ప్రయాణీకుడు, అదుపులోకి తీసుకున్న పోలీసులు

Hazarath Reddy

ఓ వ్యక్తి రూ.45 లక్షల విలువైన విదేశీ కరెన్సీని వేరుశనగ కాయల్లో అక్రమంగా తీసుకు వస్తూ ఢిల్లీ విమానాశ్రయంలో (Delhi Airport) సీఐఎస్‌ఎఫ్‌ (సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్) (Central Industrial Security Force) సిబ్బందికి చిక్కగా.. వారు అది చూసి అవాక్కయ్యారు.

Trump to Visit India: ఫిబ్రవరి నెల చివర్లో భారత్‌లో పర్యటించనున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఈ పర్యటనతో భారత్- యూస్ మధ్య వ్యూహాత్మక బంధం బలపడుతుందని భారత్ ఆకాంక్ష

Vikas Manda

ఈ పర్యటన ద్వారా అమెరికాకు భారత్ ఒక ప్రాధాన్యమైన భాగస్వామి అని ప్రపంచానికి సందేశం పంపినట్లవుతుందని ఆయన అన్నారు. అమెరికా అధ్యక్షుడు భారత్ లో పర్యటించడం వరుసగా ఇది మూడోసారి అని ఆఘీ గుర్తుచేశారు. అంతకుముందు....

Bill Gates Yacht: బిల్ గేట్స్ ముచ్చట ఖరీదు రూ.4,600 కోట్లు, లిక్విడ్ ఇంజిన్‌తో నడిచే సూపర్ బోట్‌ను కొనుగోలు చేసిన మైక్రోసాఫ్ట్ అధినేత, ఈ బోట్ గురించి పూర్తి వివరాలు తెలుసుకోండి

Hazarath Reddy

డబ్బుంటే ఈ ప్రపంచంలో ఏదైనా సాధ్యమవుతుంది. ఎంత డబ్బుంటే అంత విలాసవంతమైన జీవితం అనుభవించవచ్చన్నది జగమెరిగిన సత్యం. ఇప్పుడు కార్పోరేట్ దిగ్గజాలకు కూడా అదే పనిచేస్తున్నారు. కోట్లు ఖర్చు పెట్టి తమ ముచ్చట తీర్చుకుంటున్నారు. ఇప్పుడు ఈ స్టోరీలో బిల్ గేట్స్ ముచ్చట గురించి తెలుసుకోవచ్చు. బిట్ గేట్స్ ముచ్చట పడిన కొన్న వస్తువు ఖరీదు అక్షరాల రూ. 4600 కోట్లు.

Tom and Jerry: టామ్ అండ్ జెర్రీకి 80 ఏళ్లు, నవ్వులు పూయిస్తున్న ఫస్ట్ వీడియో క్లిప్, ఏడు ఆస్కార్ అవార్డులు, 114 ‘టామ్‌ అండ్‌ జెర్రీ’ సినిమాలు

Hazarath Reddy

ప్రపంచ వ్యాప్తంగా చిన్నారులను టీవీలకు అతుక్కుపోయేలా చేసిన ప్రోగ్రాం ఇదొక్కటేనని చెప్పవచ్చు. టీవీల్లో ఈ ప్రోగ్రాం వస్తుందంటే చాలు చిన్నారులు ఎగిరి గంతులు వేస్తారు. ప్రేక్షకులకు ఈ టామ్‌ అండ్ (Tom and Jerry) పరిచయమై నేటికి 80 ఏళ్లు పూర్తి చేసుకుంది. 1940, ఫిబ్రవరి 10న మొట్టమొదటిసారి 'టామ్‌ అండ్ జెర్రీ' ప్రసారమైంది.

Advertisement

Coronavirus in China: ఘోస్ట్ నగరంగా మారిన చైనా, 908కి చేరిన కరోనా వైరస్ మృతుల సంఖ్య, 2002–03 నాటి సార్స్‌ మరణాల్ని దాటేసిన కరోనా మరణాలు, వైరస్ కట్టడికి 1200 కోట్ల డాలర్లను కేటాయించిన డ్రాగన్ కంట్రీ

Hazarath Reddy

ప్రాణాంతక మహమ్మారి కరోనా వైరస్‌ (Deadly Coronavirus) ఇప్పుడు చైనాను కుదిపేస్తోంది. ఆ దేశంలో (China) దాదాపు 908 మందికి పైగా ఈ వైరస్‌తో మృత్యువాత పడ్డారు. చైనాలోని వూహాన్‌లో(Wuhan) పుట్టిన కరోనా వైరస్‌ ఆ దేశాన్నే కాకుండా ఇప్పుడు ప్రపంచ దేశాలను కూడా గడగడలాడిస్తోంది. ఇప్పటికే కరోనా దెబ్బకు అనేక దేశాలు హెల్త్‌ ఎమర్జెన్సీ ప్రకటించాయి. రోజు రోజుకు వ్యాధి భారీన పడి మరణాల సంఖ్య పెరుగుతోందే కాని వ్యాధి మాత్రం కట్టడి కావడం లేదు.

U-19 World Cup Final: ఎవరు గెలిచినా రికార్డుల మోతే, భారత్ గెలిస్తే 5వ ప్రపంచకప్ మన చేతుల్లో, తొలిసారి ప్రపంచకప్ ఫైనల్‌కు చేరిన బంగ్లా, చరిత్ర తిరగ రాసేందుకు అడుగుదూరంలో..

Hazarath Reddy

అంచనాలకు అనుగుణంగా రాణిస్తూ.. అండర్‌-19 ప్రపంచకప్‌ ఫైనల్‌ ( U-19 World Cup Final) చేరిన యువ భారత జట్టు (India) ఆదివారం బ్లంగాదేశ్‌తో (Bangladesh) అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమైంది. 16 యువ జట్లు పాల్గొన్న అండర్‌–19 ప్రపంచ కప్‌ (ICC U19 Cricket World Cup 2020) తుది సమరం మరో కొన్ని నిమిషాల్లో ప్రారంభం కాబోతోంది.

Coronavirus Deaths: శ్మశానాలుగా మారుతున్న చైనా నగరాలు, అప్పుడే పుట్టిన పాపకు కరోనా వైరస్, ఒక్కరోజులోనే 88 మంది మృత్యువాత, 724కి చేరిన మృతుల సంఖ్య, భారీనపడిన వారి సంఖ్య 30వేలకు పైగానే..

Hazarath Reddy

చైనాలో కరోనా మృత్యు తాండవం చేస్తోంది. రోజు రోజుకు కరోనాతో (Coronavirus outbreak)మృతి చెందే వారి సంఖ్య పెరిగిపోతోంది. కరోనా వైరస్ బారిన పడి వందల మంది పిట్టల్లా రాలిపోతున్నారు. పలు నగరాలు శ్మశానంలా కనిపిస్తున్నాయి. ప్రధానంగా వూహాన్లో దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. చైనాలో ఒక్కరోజే మరో 88 మంది ప్రాణాలు (Coronavirus Deaths) గాలిలో కలిసిపోయాయి.

Coronavirus Vaccine: కరోనావైరస్‌కు వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేయటంలో గొప్ప పురోగతి, ఘనత సాధించిన భారతీయ శాస్త్రవేత్త

Vikas Manda

గత వారం కరోనావైరస్ సోకిన వ్యక్తి రక్త నమూనాల నుంచి వైరస్ ను వేరుచేయగలిగారు, ప్రొఫెసర్ వాసన్ బృందం కరోనా వైరస్ పై అధ్యయనాలు చేయడాని ముందుగా అవసరమైన పరిమాణంలో ఈ వైరస్ ను పెంచింది. ఈ పరిశోధనల ద్వారా వచ్చిన ఫలితంతో.....

Advertisement

Coronavirus Treatment: విస్కీతో కరోనాను చంపేయవచ్చట, ఓ ఇంగ్లీష్ టీచర్ కొత్త వైద్యం, కరోనావైరస్ వల్ల వుహాన్ దెయ్యాల నగరంగా మారిందంటూ ఆవేదన

Hazarath Reddy

కరోనా వైరస్ (Coronavirus) ఇప్పుడు ప్రపంచాన్ని గడగడలాడిస్తోన్న ఒకే ఒక వ్యాధి. ఈ వైరస్ బారినపడి ఇప్పటికే 500 మంది వరకు చనిపోగా.. 20 వేల మందికి వైరస్ సోకింది. వైరస్ సోకిన వారంతా ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. చైనా నగరంలోని వుహాన్ లో (Wuhan In China) పుట్టిన ఈ వైరస్ గురించి వింటేనే జనాలు వణికిపోయే పరిస్థితి వచ్చింది. అలాంటి వైరస్‌(Deadly coronavirus) ను ఓ బ్రిటిష్ వ్యక్తి మాత్రం తాను వైరస్‌ను ఓడించానని చెబుతున్నాడు.

Tanzania Church Stampede: 20 మందిని చంపేసిన గుడ్డి నమ్మకం, టాంజానియా చర్చిలో తొక్కిసలాట, మత ప్రబోధకుడిని అరెస్ట్ చేసిన పోలీసులు

Hazarath Reddy

టాంజానియా దేశంలో (Tanzania) ఘోరం జరిగింది. ఓ మత బోధకుడిపై (Preacher) పెట్టుకున్న గుడ్డినమ్మకం కారణంగా 20 మంది ప్రాణాలు విడిచారు. మరో 16 మంది తీవ్ర గాయాలతో ఆసుపత్రి పాలయ్యారు. కాగా మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఉత్తర టాంజానియా నగరమైన మోషిలో జరిగిన చర్చి సమావేశంలో ఈ తొక్కిసలాట (Tanzania Church Stampede) జరిగింది.

Andhra Girl Stuck In China: వారంలో పెళ్లి, చైనాలో చిక్కుకుపోయిన కర్నూలు యువతి, జ్వరం దెబ్బకు ఇండియాకు పంపలేమన్న చైనా అధికారులు, స్వదేశానికి రావాలని ఉందంటూ వీడియో విడుదల

Hazarath Reddy

చైనాలో ఆంధ్ర ప్రదేశ్‌కి చెందిన అమ్మాయి (Andhra Girl Stuck In China) వుహాన్ నగరంలో చిక్కుకుపోయింది. ఇండియాకి రావాలని ఉందని సోషల్ మీడియా వేదిక ద్వారా ఓ వీడియోని విడుదల చేసింది. కర్నూలు జిల్లా (Kurnool) బండి ఆత్మకూరు మండలం ఈర్లపాడుకు చెందిన సాప్ట్‌వేర్‌ ఇంజనీర్‌ అన్నెం శృతి టీసీఎల్‌‌లో ఉద్యోగం చేస్తోంది. కాగా మూడు నెలల శిక్షణ కోసం సహచరులు 58 మందితో కలిసి చైనా వెళ్లింది.

Wuhan Coronavirus: 304 మందిని బలి తీసుకున్న కరోనావైరస్, రోజు రోజుకు పెరుగుతున్న కేసులు, అలర్ట్ అయిన ఇండియా, చైనాలో చిక్కుకున్న భారతీయులను ఆఘమేఘాల మీద ఇండియాకు తరలింపు

Hazarath Reddy

చైనాలో పంజావిప్పిన ఘోరమైన నోవల్ కరోనావైరస్ (2019-nCoV) కారణంగా మరణించిన వారి సంఖ్య 304 కి పెరిగింది. ఆదివారం నాటికి 45 కొత్త మరణాలు రికార్డయ్యాయి. చైనా ఆరోగ్య అధికారులు వివరించిన వివరాల ప్రకారం, 31 ప్రాంతీయ స్థాయి ప్రాంతాలు మరియు జిన్జియాంగ్ ప్రొడక్షన్ అండ్ కన్స్ట్రక్షన్ కార్ప్స్ నుండి 2,590 కొత్త నవల కరోనావైరస్ (Coronavirus Outbreak) సంక్రమణ కేసులు నమోదయ్యాయి.

Advertisement

Coronavirus: ప్రపంచానికి పెను ముప్పు, చైనాలో చిక్కుకున్న భారతీయులను బోయింగ్ విమానం ద్వారా ఇండియాకు తరలిస్తున్న కేంద్ర ప్రభుత్వం, భారత సైన్యం ఏర్పాటు చేసిన ప్రత్యేక శిబిరాలకు వారిని తరలింపు

Hazarath Reddy

ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్ (coronovirus) అంతకంతకూ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) అంతర్జాతీయ ఆరోగ్య అత్యవసర పరిస్థితిని (గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీ) ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అన్ని దేశాలు చైనాలో (China) చిక్కుకున్న తమ దేశ పౌరులను రప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి.

CAA Row-Vijay Goel: సైకిల్‌పై ఢిల్లీ రోడ్ల మీద బీజేపీ ‘శ్రీమంతుడు’, దేశాన్ని కలుషితం చేయవద్దన్న విజయ్ గోయెల్, సీఏఏ బ్యానర్ కట్టుకుని సైకిల్‌పై పార్లమెంట్‌కి వచ్చిన బీజేపీ ఎంపీ

Hazarath Reddy

బిజెపి రాజ్యసభ ఎంపీ విజయ్ గోయెల్ (BJP lawmaker Vijay Goel) శుక్రవారం పార్లమెంటుకు సైకిల్‌పై వచ్చారు. బడ్జెట్ సమావేశానికి ఆయన సైకిల్‌పై ఓ ప్లకార్డుతో వచ్చారు. ఇందులో "సిఎఎపై పర్యావరణాన్ని కలుషితం చేయవద్దు" (Don't Pollute the Environment On CAA) అనే స్లోగన్ రాసుకున్నారు.సైకిల్‌కి (Cycle) ఈ కార్డు కట్టుకుని ఢిల్లీ రోడ్ల మీద తొక్కుకుంటూ పార్లమెంటుకు వచ్చారు. ఈ సీన్ అచ్చం మహేష్ బాబు శ్రీమంతుడు సినిమాని తలపించింది. కాగా అడపాదడపా ఎంపీలు సైకిల్‌పై పార్లమెంటుకు రావడం కొత్త కానప్పటికీ విజయ్ గోయెల్ ఈసారి తన ప్రత్యేకతను చాటుకున్నారు.

Corona Beer vs Coronovirus: ఆ బీరు తాగేందుకు జంకుతున్న మధు పానీయులు, కరోనావైరస్ మరియు కరోనా బీర్ పట్ల కన్ ఫ్యూజ్ అవుతున్న జనాలు, గూగుల్ ట్రెండ్స్ రిపోర్ట్, మా బీర్ అమాయకురాలు అని చెప్తున్న కంపెనీ

Vikas Manda

కరోనా అంటే లాటిన్ భాషలో కిరీటం అని అర్ధం, స్పానిష్ భాషలో కూడా ఇదే అర్థాన్ని సూచిస్తుంది. ఆంగ్లంలో కరోనా అంటే కిరీట భాగం కలిగిన అని అర్థం వస్తుంది. మైక్రోస్కోప్‌లో ఆ చైనా వైరస్‌ను పరిశీలించి చూసినపుడు అది ఒక కిరీటం లాంటి ఆకృతిని కలిగి ఉంది. అందుకే దానికి.....

Pakistan Abductions: పాకిస్థాన్‌లో హిందూ యువతిపై దారుణం, వధువును పెళ్లి మండపంలోంచి నుంచి ఎత్తుకెళ్లి మతమార్పిడి, ఆపై ముస్లిం వ్యక్తితో పెళ్లి, పాక్ ప్రభుత్వానికి సమన్లు జారీ చేసిన భారత్

Vikas Manda

పాకిస్థాన్ దేశంలో మైనారిటీలుగా ఉన్న హిందూ సమాజాన్ని రక్షించి, తమ పౌరులుగా వారికి కూడా భద్రత, సంక్షేమం కల్పించడం ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వ బాధ్యత అని భారత ప్రభుత్వం పేర్కొంది....

Advertisement
Advertisement