World

Supreme Court: 2019 లోక్‌సభ ఎన్నికల్లో అవకతవకలు, ఎన్నికల కమిషన్‌కు సుప్రీం నోటీస్, 349 లోక్‌సభ నియోజకవర్గాల్లో భారీ వ్యత్యాసం అంటూ పిటిషన్, దాఖలు చేసిన ఏడీఆర్‌,కామన్‌ కాజ్‌ స్వచ్ఛంద సంస్థలు

Hazarath Reddy

2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో (17th Lok Sabha Election)బీజేపీ(BJP) అఖండ మెజార్టీ సాధించి రెండో సారి అధికారం చేపట్టిన సంగతి విదితమే. అయితే ఈ ఎన్నికలు పారదర్శకంగా జరగలేదని అనేక అవకతవకలు చోటు చేసుకున్నాయని సుప్రీంకోర్టు(Supreme Court)లో పిటిషన్ దాఖలైంది. పిటిషన్ పరిశీలించిన సుప్రీంకోర్టు ఎన్నికల కమిషన్(Election Commission)కి నోటీసులు జారీ చేసింది.

Arvind Kejriwal: ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం,'బాలికలతో అసభ్యంగా ప్రవర్తించం', ప్రతి రోజూ ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో బాలురతో ప్రతిజ్ఞ చేయించాలంటున్న ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌

Hazarath Reddy

దేశంలో మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలు పెరిగిపోతున్న క్రమంలో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు పటిష్ట చర్యలు తీసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీ (Delhi) ప్రభుత్వం వినూత్న నిర్ణయం తీసుకుంది. పాఠశాల స్థాయిలోనే విద్యార్థులు మానవత్వంతో మెలిగేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది.

Tamil Nadu Suicides: తమిళనాడులో ఘోరం, కుటుంబాన్ని బలి తీసుకున్న ఆన్‌లైన్ లాటరీ, చనిపోతూ సెల్పీ వీడియో తీసుకున్న కుటుంబం

Hazarath Reddy

తమిళనాడు(Tamil Nadu)లో విషాదం చోటు చేసుకుంది. ఆ రాష్ట్రంలోని విల్లుపురం(Villupuram) సమీపంలోని సలామత్‌నగర్‌లో ఆన్‌లైన్ లాటరీ.. ఓ కుటుంబాన్ని బలి తీసుకుంది. ఆన్‌‌లైన్ లాటరీలో మోసపోవడంతో కుటుంబ సభ్యుల అందరూ ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్య చేసుకున్నారు. తల్లిదండ్రులు తమ ముగ్గురు పిల్లలకు విషమిచ్చి వారు కూడా ఆత్మహత్య చేసుకున్నారు. ఆన్‌లైన్‌ లాటరీలో మోసపోయి, ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్యకు(Suicide) పాల్పడ్డారు.

'Rape In India' Remark: రాహుల్ రేప్ ఇన్ ఇండియా వ్యాఖ్యలపై దద్దరిల్లిన పార్లమెంట్, క్షమాపణ చెప్పాలని పట్టుబడిన అధికార పార్టీ, క్షమాపణ ప్రసక్తే లేదన్న రాహుల్ గాంధీ, అలా అనడానికి కారణం తెలుసుకోండి అంటున్న కాంగ్రెస్ ఎంపీ

Hazarath Reddy

భారతదేశం(India)లో జరుగుతున్న రేప్‌లపై కాంగ్రెస్‌ నాయకుడు రాహుల్‌ గాంధీ(Rahul Gandhi) చేసిన వ్యాఖ్యలపై లోక్ సభ(Lok Sabha)లో దుమారం చెలరేగింది. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చేసిన రేప్ ఇన్ ఇండియా(Rape In India)వ్యాఖ్యలు దేశాన్ని అవమానపరిచే విధంగా ఉన్నాయని వెంటనే రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలంటూ బీజేపీ ఎంపీలు డిమాండ్ చేశారు.

Advertisement

Nirbhaya Rape Case: నిర్భయ కేసు డిసెంబర్18కి వాయిదా, డెత్ వారెంట్ జారీ చేసి ఉరితీయాలంటూ నిర్భయ తల్లిదండ్రుల పిటిషన్, నిర్భయ నిందితుడు అక్షయ్ రివ్యూ పిటిషన్ డిసెంబర్ 17న సుప్రీంకోర్టులోకి, ఆ తర్వాతే నిర్ణయం తీసుకుంటామన్న ఢిల్లీ కోర్టు

Hazarath Reddy

నిర్భయ దోషులకు (Nirbhaya Rape Case) త్వరగా డెత్ వారెంట్ (death warrant)జారీ చేసి ఉరితీయాలన్న నిర్భయ తల్లిదండ్రుల పిటిషన్‌పై(petition) పటియాలా కోర్టు విచారణ జరిపింది. ఈ పిటిషన్ పై విచారణను డిసెంబర్ -18,2019కి ఢిల్లీ కోర్టు (Delhi Court) వాయిదా వేసింది. బుధవారం(డిసెంబర్-18,2019)మధ్యాహ్నాం 2గంటలకు ఈ పిటిషన్ పై విచారణ చేయనున్నట్లు అడిషినల్ సెషన్ జడ్జి సతీష్ కుమార్ అరోరా (Additional Session Judge Satish Kumar Arora) తెలిపారు.

Kolkata Horror: 65 యేళ్ల వృద్ధురాలిపై దారుణం, కనికరమే లేకుండా కత్తితో దాడి, తలను నరికి పొట్టను చీల్చి వేసిన కిరాతకులు,పగతో చేసిన హత్యగా భావిస్తున్న పోలీసు ఉన్నతాధికారులు

Hazarath Reddy

దేశంలో మహిళలపై హింస, దాడులు ఆగడం లేదు. ఎక్కడ చూసినా హత్యలు, మానభంగాలు పెరిగిపోతున్నాయి. ఇందుకు ప్రత్యక్ష సాక్ష్యం దక్షిణ కోల్‌కతాలోని అద్దె అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్న 60 ఏళ్ల మహిళ దారుణ హత్య(Kolkata Horror:) ఉదంతం. వృద్ధురాలు అన్న కనికరం కూడా లేకుండా అతి దారుణంగా హత్య చేసిన ఈ ఘటన కలకత్తాలో కలకలం రేపింది. ఆమెను కత్తితో పొడిచిచంపడంతోపాటు తలను(65-Year-Old Woman Murdered) నరికిశారు.

Ayodhya Verdict Review: పున:పరిశీలించడాల్లేవ్, అదే ఫైనల్! అయోధ్య తీర్పుపై రివ్యూ పిటిషన్లను తిరస్కరించిన సుప్రీంకోర్ట్, నవంబర్ 9న ఇచ్చిన తీర్పుకే కట్టుబడిన ధర్మాసనం

Vikas Manda

ఈ పిటిషన్లనీ గురువారం సుప్రీంకోర్టులో ఇన్-ఛాంబర్ విచారణకు వచ్చాయి. సుప్రీం తాము మొదట ఇచ్చిన తీర్పుకే కటుబడుతూ ఈ రివ్యూ పిటిషన్లను తోసిపుచ్చింది. అయోధ్య వ్యవహరంలో నవంబర్ 9న వెలువడిన తీర్పే అంతిమం అని తేల్చింది....

Girlfriend Is The Star: ప్రియురాలి వీడియోలను పోర్న్ వెబ్‌సైట్లో చూసి ప్రియుడు షాక్, లైబ్రరీకి వెళ్లొస్తానని చెబుతూ మరో కార్యానికి, ఇంటర్నెట్‌లో కుప్పలుతెప్పలుగా వీడియోలు చూసి బేజారైన ప్రియుడు

Vikas Manda

ఒకరోజూ అతడి స్నేహితుడు ఓ వైబ్ సైట్లో నీలిచిత్రాలు చూస్తూ ఉన్నాడు. దాంట్లో ఒక అమ్మాయికి సంబంధించిన వీడియోలు చాలా క్రేజీగా ఉన్నాయి. ఆ అమ్మాయి ఒంపుసొంపులకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్....

Advertisement

ISRO RISAT-2BR1: పిఎస్ఎల్వి-సి 48 ప్రయోగం విజయవంతం, భారత గూఢాచార వ్యవస్థను పటిష్ఠ పరిచే అధునాతన ఉపగ్రహహం రిసాట్ -2 బిఆర్1తో పాటు, 9 విదేశీ ఉపగ్రహాలను నిర్దేశిత కక్ష్యలో ప్రవేశపెట్టిన ఇస్రో

Vikas Manda

రిసాట్ -2 బిఆర్1 వెంట మరో తొమ్మిది విదేశీ ఉపగ్రహాలు అమెరికాకు చెందిన 4 మల్టీ-మిషన్ లెమూర్ ఉపగ్రహాలు, ఇజ్రాయెల్ కు చెందిన రిమోట్ సెన్సింగ్, డచిఫాట్ సేవల 3 ఉపగ్రహాలు, ఇటలీకి చెందిన...

Imran Khan On Citizenship Amendment Bill: పౌరసత్వ బిల్లును ఖండించిన పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్, అంతర్జాతీయ మానవ హక్కుల చట్టాన్ని భారత్ ఉల్లంఘించిందని విమర్శలు, హిందూ భావన విస్తరణకే అన్న ఆరెస్సెస్‌ వ్యాఖ్యలపై ఆగ్రహం

Hazarath Reddy

పౌరసత్వ సవరణ బిల్లు(Citizenship Amendment Bill)కు భారత లోక్‌సభ ఆమోదం తెలపడాన్ని దాయాది దేశం పాకిస్తాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌(Imran Khan) తీవ్రంగా ఖండించారు. ఈ బిల్లు తీసుకురావడం ద్వారా అంతర్జాతీయ మానవ హక్కుల చట్టాన్ని భారత్‌(India) ఉల్లంఘించిందని మండిపడ్డారు.

Uddhav Thackeray: లోక్‌సభలో మద్దతు, రాజ్యసభలో మద్దతు ఇవ్వం, పౌరసత్వ సవరణ బిల్లుపై స్వరం మార్చిన శివసేన, కొన్ని ప్రశ్నలకు సమాధానం ఇస్తేనే బిల్లుకు మద్ధతు, వెల్లడించిన మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే

Hazarath Reddy

బీజేపీ (BJP) ప్రతిష్టాత్మకంగా భావించి తీసుకు వస్తున్న పౌరసత్వ బిల్లుపై(Citizenship Amendment Bill 2019) శివసేన పార్టీ స్వరం మార్చింది. పౌరసత్వ సవరణ బిల్లుకు రాజ్యసభలో తాము మద్దతు ఇవ్వబోమని శివసేన చీఫ్,మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రే (Uddhav Thackeray) తెలిపారు. దేశంలో ఏ పౌరుడైనా ఈ బిల్లు పట్ల భయం వ్యక్తం చేస్తే వారి సందేహాలను తీర్చాల్సిన అవసరముందని తెలిపారు.

Polavaram Project: కేంద్రమే పోలవరాన్ని పూర్తి చేయాలి, రాజ్యసభలో ఎంపి కెవీపీ రామచంద్రరావు, పోలవరంపై తెలుగులో మాట్లాడిన బీజేపీ ఎంపీ జీవీఎల్,ఆడిట్ పూర్తయ్యాక నిధులు విడుదల చేస్తామన్న కేంద్ర మంత్రి గజేంద్ర షెకావత్‌

Hazarath Reddy

పార్లమెంటు సమావేశాల సందర్భంగా రాజ్యసభ సభ్యులు కేవీపీ రామచంద్రరావు(YCP MP KVP Ramachandra rao), బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు(BJP MP GVL Narasimha rao) రాజ్యసభలో(Rajyasabha) పోలవరం(Polavaram Project) అంశాన్ని లేవనెత్తారు. రాజ్యసభ సభ్యులు కేవీపీ రామచంద్రరావు మాట్లాడుతూ..పోలవరం ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయాలని కేంద్రాన్ని కోరారు.

Advertisement

Adhir Ranjan Chowdhury: ఇది మేక్ ఇన్ ఇండియా కాదు, రేప్ ఇన్ ఇండియా, ప్రధాని మోడీ మహిళా నేరాల గురించి ఒక్కమాట మాట్లాడటం లేదు, దేశం లైంగిక దాడులకు కేంద్రంగా మారుతోందన్న అధిర్ రంజన్ చౌదరి

Hazarath Reddy

దేశంలో మహిళలపై జరిగే అఘాయిత్యాలపై ప్రధాని మోడీ స్పందించకపోవడంపై కాంగ్రెస్ లోక్ సభ పక్ష నాయకుడు అధిర్ రంజన్ చౌదరి (Adhir Ranjan Chowdhury) ఫైర్ అయ్యారు. మహిళలపై నేరాల తీరు చూస్తుంటే మనం మేకిన్‌ ఇండియా దిశగా కాకుండా రేపిన్‌ ఇండియా(Make In India To Rape In India) వైపు పయనిస్తున్నామనే సందేహం కలుగుతోందని లోక్‌సభలో కాంగ్రెస్‌ పక్ష నేత అధిర్‌ రంజన్‌ చౌదరి అన్నారు.

Military Plane Missing: 38 మందితో వెళ్తున్న విమానం మిస్సింగ్, కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్, అసలేం జరిగింది ?

Hazarath Reddy

చిలీ (chile) దేశ‌ వైమానిక ద‌ళానికి చెందిన విమానం అదృశ్య‌మైంది. 38 మందితో వెళ్తున కార్గో సైనిక విమానం ఆచూకీ లేదు. అంటార్కిటికా వెళ్తున్న‌రూట్లో ఆ విమానం (Military Plane Missing)ఆ దేశ ఎయిర్‌ఫోర్స్ ఓ ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్న‌ది. సీ-130 హెర్క్యూల్స్(C-130 Hercules) ట్రాన్స్‌పోర్టు ఎయిర్‌క్రాఫ్ట్ స్థానిక కాల‌మానం ప్ర‌కారం ఉద‌యం ఆరు గంట‌ల‌కు విమానం మిస్సైంది.

Woman Lives In Toilet: మరుగుదొడ్డే ఆమె నివాసం, నలుగురు కూతుర్లకు అది ఎంతవరకు రక్షణ ఇస్తుంది ?, ఒడిశాలో ఓ మహిళ ఆవేదన, మేము ఏమీ చేయలేమంటున్న సర్పంచ్

Hazarath Reddy

దేశం ఆర్థికంగా ముందుకు వెళుతున్నా సామాన్యలు జీవితాల్లో ఎటువంటి మార్పు కానరావడం లేదు. నాయకుల హామీల మూటలు పేపర్లకే పరిమితమవుతున్నాయి. కనీసం కూడు గూడు అనేవి కూడా వారికి గగనం అయ్యే పరిస్థితులు కళ్ళముందు కదలాడుతున్నాయనే దానికి ఈ ఘటనే ప్రత్యక్ష సాక్ష్యం. ఒడిశా(odisha)లోని ఒక గిరిజన మహిళ (tribal woman)ఉండటానికి ఇల్లు లేక, కొనేందుకు డబ్బులు లేకపోవడంత మూడేళ్లపాటు మరుగుదొడ్డిలోనే కాలం వెళ్లదీస్తోంది.

US Commission On CAB 2019: పౌరసత్వ సవరణ బిల్లుపై యూఎస్ ఫెడరల్ కమీషన్ ఆందోళన, అమిత్ షా సహా భారత అగ్ర నాయకత్వంపై అమెరికా ఆంక్షలు విధించే అంశాన్ని పరిశీలించాలని సూచన

Vikas Manda

తమ అంతర్గత వ్యవహారాలలో ఇతర దేశాలు జోక్యం చేసుకోకూడదని మోదీ సర్కార్ గతంలోనే చాలా సార్లు స్పష్టం చేసింది. ఇప్పుడు USCIRF చేసిన ఆరోపణలను కూడా కేంద్ర ప్రభుత్వం తోసిపుచ్చే అవకాశం ఉంది. ఇదే క్రమంలో మత స్వేచ్ఛపై సమీక్ష చేసేందుకు భారత్ వస్తామని తెలిపిన USCIRF సభ్యులకు పలు మార్లు వీసా ఇచ్చేందుకు కూడా కేంద్ర ప్రభుత్వం నిరాకరించింది....

Advertisement

Speaker vs TDP: అసెంబ్లీ ఎవరి జాగీరు కాదు, సభ్యుల గొంతు నొక్కితే ఊరుకోను, ఎన్టీఆర్‌కు జరిగిన అన్యాయంలో నేను భాగమే, అసెంబ్లీ రూల్స్ ప్రకారం వంశీకి సీటు కేటాయిస్తాం, టీడీపీ ఆరోపణలపై మండిపడిన స్పీకర్ తమ్మినేని సీతారాం

Hazarath Reddy

ఏపీ అసెంబ్లీ సమావేశాలు (Assembly Winter Session 2019) రెండో రోజూ వాడివేడిగా జరుగుతున్నాయి. అసెంబ్లీ(Assembly)ని వైఎస్సార్‌సీపీ సభ్యులు పార్టీ కార్యాలయంగా మార్చారంటూ టీడీపీ సభ్యులు చేసిన ఆరోపణలపై స్పీకర్‌ తమ్మినేని సీతారాం(Speaker Tammineni Sitaram) తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.అసెంబ్లీ ఎవరి జాగీరు కాదని... ప్రజల జాగీరని, ప్రజలు ఎన్నుకొని ఇక్కడికి పంపించారని తెలిపారు.

Vamsi Fires On Chandrababu: పప్పు బ్యాచ్ నాపై విమర్శలు చేస్తున్నారు, జయంతికి వర్ధంతి తేడా తెలియని వాళ్లు నన్ను విమర్శిస్తున్నారు, నేను టీడీపీతో ఉండలేను, అసెంబ్లీలో వల్లభనేని వంశీ ఫైర్

Hazarath Reddy

అసెంబ్లీ(AP Assembly Session)లో రెండో రోజు వాడీ వేడీ చర్చ మొదలైంది. ఈ సంధర్భంగా వల్లభనేని వంశీ (Vallabhaneni Vamsi) టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu Naidu)పై అలాగే టీడీపీ నేతలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అసెంబ్లీ శీతాకాల సమావేశాలు రెండో రోజు సందర్భంగా ఎమ్మెల్యే వల్లభనేని వంశీ సభలో మాట్లాడుతున్న సమయంలో.. ఆయన మాట్లాడటానికి వీళ్లేదని టీడీపీ సభ్యులు అడ్డుపడ్డారు.

Siddaramaiah Resigns: కర్ణాటకలో విరబూసిన కమలం, ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ సిద్దరామయ్య రాజీనామా, 12 స్థానాల్లో బీజేపీ విజయం, రెండు స్థానాలకు పరిమితమైన కాంగ్రెస్, స్వతంత్ర అభ్యర్థి ఒక చోట విజయం

Hazarath Reddy

కర్ణాటకలో రాజకీయ వేడి మొదలైంది. కర్ణాటకలో ఇటీవల 15 అసెంబ్లీ స్థానాలకు(15 Assembly constituencies) జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ (Congress),జేడీఎస్(JDS) పార్టీలకు ఓటర్లకు భారీగా షాక్ ఇచ్చారు. ఇవాళ కౌంటింగ్ ప్రారంభమైనప్పటి నుంచి బీజేపీ(BJP) దూకుడును చూసి కాంగ్రెస్,జేడీఎస్ కార్యకర్తలు నాయకులు ఒక్కసారిగా ఖంగుతిన్నారు. అక్కడ జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ 15 స్థానాల్లో విజయం సాధించగా కాంగ్రెస్ పార్టీ కేవలం రెండు స్థానాలకే పరిమితమైంది. స్వతంత్ర అభ్యర్థి ఓ చోట గెలిచారు.

Chhattisgarh Teacher: నాతో క్లోజ్‌గా ఉండండి, మీ ఫోన్ నంబర్ ఇవ్వండి, ఓ టీచర్ నిర్వాకం, అబ్బాయిల్ని చికెన్ తీసుకురావాలంటూ వేధింపులు,అదేమి లేదంటున్న చత్తీస్ ఘడ్ టీచర్, చర్యలు తీసుకుంటామన్న అధికారులు

Hazarath Reddy

విద్యా బుద్ధులు నేర్పించాలని గురువు దారి తప్పాడు. ఈ మధ్య కాలంలో ఇలాంటి ఘటనలు చాలానే చూస్తున్నాం. అందరికీ ఆదర్శంగా ఉండాల్సిన గురువులు నీచపు పనులకు పాల్పడుతున్నారు. చాలా చోట్ల ఇవే ఘటనలు జరుగుతున్నాయి. తాజాగా చత్తీస్‌ఘడ్‌లో వెలుగులోకి వచ్చిన ఘటన గురువు అన్న పదానికే కళంకం తెచ్చేలా ఉంది.

Advertisement
Advertisement