World

Mysterious Death Of Migratory Birds: వలస పక్షుల మృత్యు ఘోష, సాంబార్ సరస్సులో 5 వేల పక్షులు మృతి, చెల్లా చెదురుగా పక్షుల కళేబరాలు, పర్యావరణానికి ప్రమాదం తప్పదా ?

Hazarath Reddy

ఎడారి రాష్ట్రం రాజస్థాన్‌లో పక్షుల మృత్యు ఘోష వినిపిస్తోంది. ఈ రాష్ట్రంలో ఉన్న ప్రముఖ ఉప్పు నీటి సరస్సు అయిన సాంబార్ సరస్సులో వేలకొద్దీ వలస పక్షులు చనిపోయాయి. ఇది దేశంలోనే అతి పెద్ద ఉప్పునీటి సరస్సు. ఈ సరస్సుకు వేలాది వలస పక్షులు ప్రతి సంవత్సరం వస్తుంటాయి.

President's Rule In 'MAHA': రాష్ట్రపతి పాలనలో మహారాష్ట్ర, గవర్నర్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకు శివసేన, అత్యవసర మంత్రి వర్గ సమావేశం తరువాత బ్రెజిల్ విమానమెక్కిన ప్రధాని మోడీ

Hazarath Reddy

మహారాష్ట్రలో నెలకొన్న రాజకీయ ప్రతిష్టంభనకు పుల్‌స్టాప్ పడింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటూ బిజెపి,శివసేన, ఎన్సీపీలను గవర్నర్ ఆహ్వానించినప్పటికీ ఏ పార్టీ కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయింది. ఎన్సీపీకి ఈ రాత్రి 8.30 వరకు గడువు ఉన్నప్పటికీ ఆ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితి కనపడకపోవడంతో రాష్ట్రపతి పాలన కోసం కేంద్ర హోంశాఖకు గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ సిఫారసు చేశారు.

Pranav Wins CM Pinarayi Heart: చేతులు లేవు..కాలుతో సెల్పీ, ఫిదా అయిన సీఎం పినరయి విజయన్, సోమరిపోతులకు ప్రణవ్ కథే ఓ గుణపాఠం, సీఎం రిలీఫ్ ఫండ్‌కి సాయమందించిన ఆర్టిస్ట్ ప్రణవ్

Hazarath Reddy

పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చు అనే దానికి ఈ స్టోరీనే నిదర్శనం, శరీరంలో అన్నీఅవయువాలు సక్రమంగా ఉండి సోమరిపోతుల్లా తిరుగుతున్న యువకులకు ఈ కథనే ఓ గుణపాఠం. పుట్టుకతోనే చేతులు కోల్పోయిన యువకుడు చూపించిన ఆత్మస్థయిర్యానికి కేరళ సీఎం (Kerala CM Pinarayi Vijayan) సైతం ఫిదా అయ్యారు.

Where Is Our Sidhu: 'మన సిద్ధూ ఎక్కడ'? అంటూ పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మాట్లాడుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్, నేడు గురునానక్ 550 జయంతి సందర్భంగా భారత ప్రధాని మోదీ శుభాకాంక్షలు

Vikas Manda

సిక్కు మత స్థాపకుడు, సిక్కులు పవిత్రంగా కొలిచే వారి మొదటి గురువు 'శ్రీ గురునానక్ దేవ్' యొక్క 550వ జయంతి ((Shri Guru Nanak Dev Birth Anniversery) నేడు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ....

Advertisement

Abhinandan Varthaman: పాకిస్తాన్ మరో దుశ్చర్య, పాకిస్తాన్‌ వైమానికదళ యుద్ధ మ్యూజియంలో అభినందన్ వర్థమాన్ బొమ్మ, దాని పక్కనే ఛాయ్ కప్పు

Hazarath Reddy

భారత్‌పై విషప్రచారం చేయడంలో ఏ అవకాశాన్నీ వదులుకోని పాకిస్తాన్‌ మరో దుశ్చర్యకు పాల్పడింది. కరాచీలోని పాకిస్థాన్ వాయుసేన వార్ మ్యూజియం(Pakistan Air Force War Museum)లో భారత వాయుసేన వింగ్‌కమాండర్ అభినందన్ వర్ధమాన్ (Wing Pilot Abhinandan Varthaman) బొమ్మను కొలువుదీర్చారు. వర్ధమాన్‌ చుట్టూ పాక్‌సైనికులు చుట్టుముట్టి ఉండగా, ఎడమ పక్క ఒక టీ కప్పును కూడా ఉంచింది. ఈ ఫొటోను పాకిస్థానీ జర్నలిస్ట్ అన్వర్ లోధీ ఆదివారం ట్వీట్ చేశారు.

Another Twist In 'MAHA' Politics: తీవ్ర ఉత్కంఠలో మహా రాజకీయాలు,కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసిన అరవింద్ సావంత్, ఎన్డీయే కూటమి నుంచి వైదొలిగే ఆలోచనలో శివసేన, ప్రభుత్వ ఏర్పాటుకు వ్యూహాలు

Hazarath Reddy

మహా రాజకీయాలు తీవ్ర ఉత్కంఠకు గురిచేస్తున్నాయి. బీజేపీ-శివసేనల మధ్య ఉన్న దశాబ్దాల బంధానికి రారాం చెప్పే విధంగా ముందుకు సాగుతున్నాయి. మహారాష్ట్రలో అధికార ఏర్పాటులో బీజేపీకి-శివసేన కూటమి మధ్య సయోధ్య కుదరకపోవడంతో వార్ మరింతగా వేడెక్కింది.

Who Will Be MAHA CM: అధికారాన్ని ఏర్పాటు చేయలేమన్న బీజేపీ, ప్రభుత్వ ఏర్పాటు దిశగా శివసేన వ్యూహాలు, హైకమాండ్ నిర్ణయమే ఫైనల్ అంటున్న కాంగ్రెస్ నేతలు, ఎన్సీపీ దారెటు ?

Hazarath Reddy

మహారాష్ట్ర(Maharashtra)లో అధికార ఏర్పాటు అంశం రోజుకో మలుపు తిరుగుతోంది. ఎన్నికల ఫలితాల్లో లార్జెస్ట్ పార్టీగా అవతరించిన బీజేపీ- శివసేన (BJP-Sena) కూటముల మధ్య సయోధ్య కుదరకపోవడంతో అక్కడ అధికార ఏర్పాటు(Maharashtra Govt Formation) అనేది సందిగ్ధంలో పడింది. సీఎం పదవీ కాలం ముగియడంతో దేవేంద్ర ఫడ్నవిస్ రాజీనామా చేయడంతో.. అధికారాన్ని ఏర్పాటు చేయాలని గవర్నర్ బీజేపీని ఆహ్వానించారు.

Terror Attack Alert: 3 రాష్ట్రాల్లో ఉగ్రదాడులకు జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ వ్యూహ రచన, హెచ్చరికలు జారీ చేసిన నిఘా వర్గాలు, అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం, డార్క్‌వెబ్ వేదికగా సమాచార మార్పిడి

Hazarath Reddy

గత 10 రోజుల నుంచి బాబ్రీ మసీద్ -రామ్ జన్మభూమి కేసు (Babri Masjid- Ram Janmabhoomi case) మీద కేంద్ర ప్రభుత్వం ఫోకస్ పెట్టడం, సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు ఇవ్వడం జరిగిపోయింది. దేశ వ్యాప్తంగా ఏమైనా దాడులు జరుగుతామయేమోనని ముందస్తు జాగ్రత్తగా కేంద్ర ప్రభుత్వం అన్ని చోట్లా భద్రతను కట్టుదిట్టం చేసింది. అయితే పాకిస్తాన్ కేంద్రంగా ఇండియాలో ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని నిఘా వర్గాలు(Military Intelligence) హెచ్చరిస్తున్నాయి.

Advertisement

MAHA CM Poster At Matoshree: ఉద్ధవ్ ఠాక్రే సీఎం అంటూ పోస్టర్, శివసేన చీఫ్ ఇంటివద్ద ఫ్లెక్సీ బ్యానర్, గతంలో ఆదిత్య ఠాక్రే సీఎం అంటూ బ్యానర్లు, మహాలో రంజుగా సాగుతున్న రాజకీయం

Hazarath Reddy

ఫలితాలొచ్చి ఒక్కరోజు కూడా గడవక ముందే ‘భావి సీఎం ఆదిత్య ఠాక్రే’ అంటూ మహారాష్ట్ర అంతటా పోస్టర్లుతో సంచలనం రేకెత్తించిన శివసేన కార్యకర్తలు ఇప్పుడు మళ్లీ కొత్త పోస్టర్లతో రాజకీయాల్లో మరింతగా వేడిని పుట్టిస్తున్నారు. ఇందులో భాగంగా శివసేన పార్టీ చీఫ్ ఉద్ధవ్ ఠాక్రేనే మాకు సీఎంగా ఉండాలంటూ వెలిసిన ఓ బ్యానర్ మహా రాజకీయాల్లో మరింత వేడిని రాజేస్తోంది.

Sanjay Raut On 'MAHA' Episode: బీజేపీ విఫలమైతే శివసేన రెడీగా ఉంది, వ్యూహాంతో సిద్ధంగా ఉన్నాం, మా సీఎం ఎవరేనది అప్పుడే చెబుతాం, సంచలన వ్యాఖ్యలు చేసిన శివసేన సీనియర్ నేత సంజయ్ రౌత్

Hazarath Reddy

మహారాష్ట్ర రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. అక్కడ ప్రభుత్వ ఏర్పాటు ఎవరు చేస్తారనే ప్రశ్నకు సమాధానం చిక్కడం లేదు. ఎవరికి వారే తమ వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర(Maharashtra)లో తదుపరి ప్రభుత్వ ఏర్పాటుకు సంసిద్ధంగా ఉన్నామని శివసేన (Shiv Sena) స్పష్టం చేసింది.

Ram Janmabhoomi Nyas Design: అయోధ్యలో రామ మందిర్ న్యాస్‌ డిజైన్, 2024లోగా నిర్మాణం పూర్తి, ఏర్పాటు కాబోతున్న రామాలయ నిర్మాణ ట్రస్ట్, తీర్పు అందరికీ ఆమోద యోగ్యమన్న విశ్వహిందూ పరిషత్‌

Hazarath Reddy

అయోధ్య కేసు( Ayodhya Verdict)లో సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు (Supreme Court verdict in the Ayodhya case) ఇచ్చిన నేపథ్యంలో అక్కడ రామమందిర(Ram Temple) నిర్మాణానికి సంబంధించిన చర్చలు మొదలయ్యాయి. సుప్రీం కోర్టు తీర్పుకు రాజకీయ పార్టీ నాయకుల నుంచి గానీ, ముస్లిం మత పెద్దల నుంచి గానీ పెద్దగా సుప్రీం తీర్పు పట్ల నెగెటివ్ రియాక్షన్ రాలేదు. దీంతో రివ్యూ పిటిషన్ వేస్తామన్న సున్నీ వక్ఫ్ బోర్డు సైతం ఆ నిర్ణయం నుంచి తప్పుకున్నట్లేనని తెలుస్తోంది.

‘Ayodhya Verdict’ Closed Doors For BJP: రామమందిర నిర్మాణానికి తలుపులు తెరుచుకున్నాయి, బీజేపీకి డోర్స్ క్లోజ్ అయ్యాయి, సుప్రీం కోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం, కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి రణదీప్‌ సూర్జేవాలా ఆసక్తికర వ్యాఖ్యలు

Hazarath Reddy

దశాబ్దాల నుంచి కొనసాగుతూ వస్తున్న అయోధ్య భూవివాదం కేసుపై సుప్రీం కోర్టు తుది తీర్పును వెలువరించింది. ఈ సమయంలో అన్ని పార్టీలు ఈ తీర్పును స్వాగతిస్తున్నాయి. అలాగే తమదైన శైలిలో బీజేపీ మీద వ్యంగ్యాస్త్రాలను విసురుతున్నాయి. ఇందులో భాగంగా కాంగ్రెస్ పార్టీ కూడా నిర్ణయాన్ని స్వాగతిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

Advertisement

Kartarpur Corridor: కర్తార్‌పూర్‌ కారిడార్‌ను ప్రారంభించిన మోడీ, పాక్ ప్రధానికి ధన్యవాదాలు తెలిపిన ఇండియా పీఎం, గురు నానక్ దేవ్‌ అన్ని పుణ్య క్షేత్రాలను కలుపుతూ ప్రత్యేక రైలు సేవలు

Hazarath Reddy

భారత్, పాక్‌ల మధ్య తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు కొనసాగుతుండగా..రెండు దేశాలను కలిపే కర్తార్‌పూర్‌ కారిడార్‌ (Kartarpur Corridor) ప్రారంభం ఎట్టకేలకు ప్రారంభం అయింది. సిక్కు మత వ్యవస్థాపకుడు గురునానక్‌ 550వ జయంతి సందర్భంగా పంజాబ్ లోని గురుదాస్ పూర్ లోని డేరాబాబా నానక్ దగ్గర భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ (Prime Minister Modi ) కర్తార్‌పూర్‌ కారిడార్‌ను ప్రారంభించారు.

Ayodhya Case Final Judgment: అయోధ్య కేసుపై చారిత్రాత్మక తీర్పు, అయోధ్య ట్రస్టుకు వివాదాస్పద భూమిని కేటాయించాలి, బాబ్రీ మసీదుకు వేరే స్థలం కేటాయించాలి, ప్రభుత్వం 3 నెలల్లో ఈ ప్రాసెస్ పూర్తి చేయాలన్న దేశ అత్యున్నత న్యాయస్థానం

Hazarath Reddy

దశాబ్దాలుగా నలుగుతున్న అయోధ్య భూవివాదం కేసుపే సుప్రీంకోర్టు ఈ రోజుల కీలక తీర్పును ఇచ్చింది. అయోధ్యలోని రామజన్మభూమి-బాబ్రీ మసీదు స్థల వివాదం కేసులో సుప్రీం కోర్టు చారిత్రాత్మకమైన తీర్పును ఇచ్చింది. సరిగ్గా 10:30 గంటలకు సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ రంజన్ గొగొయ్ తీర్పును చదివి వినిపించారు.

Rajinikanth: నా ముందు మీ ఆటలు సాగవు, బీజేపీకి దిమ్మతిరిగే ఝలక్ ఇచ్చిన రజినీకాంత్, నాకు బీజేపీకి సంబంధం లేదన్న తలైవా, అయోధ్య తీర్పు నేపథ్యంలో కోర్టు తీర్పును గౌరవించాలని విజ్ఞప్తి

Hazarath Reddy

ప్రముఖ చలనచిత్ర నటుడు, సౌతిండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్‌ (Rajinikanth) బీజేపీ(BJP)పై సంచలన ఆరోపణలు చేశారు. బీజేపీ తనకు కాషాయ రంగు పులమాలని చూస్తోందని ఆయన అన్నారు. తనకు, తమిళ కవి తిరువళ్లువార్‌(Thiruvalluvar)ను బిజెపిలోకి లాక్కోవాలని ఆ పార్టీ ప్రయత్నిస్తోందని ఆయన అన్నారు.

Hyderabadi US Senator: చరిత్ర సృష్టించిన హైదరాబాదీ, అమెరికాలో ట్రంప్ పార్టీ అభ్యర్థిని ఓడించి సెనేటర్‌గా గెలుపొందిన ఘజాలా హష్మి, అమెరికాలో తొలి ముస్లిం మహిళ సెనేటర్‌గా రికార్డ్

Vikas Manda

ఇంట్లో అందరూ 'మున్ని' గా పిలుచుకునే ఘజాలా పుట్టి పెరిగింది హైదరాబాదే, ఆ తర్వాత వారి ఫ్యామిలీ అమెరికాకు షిఫ్ట్ అయింది. అక్కడే ఉన్నత విద్యలను అభ్యసించింది.....

Advertisement

RCEP Deal: ఆర్‌సీఈపీలో చేరేది లేదని స్పష్టం చేసిన భారత్, ఒప్పందం ఆమోదంపై చైనా తీవ్ర ప్రయత్నాలు, పదహారు ఆసియా, పసిఫిక్‌ దేశాలతో ఆర్‌సీఈపీ కూటమి,వచ్చే సంవత్సరం ఈ ఒప్పందంపై సంతకాలు చేస్తామని మిగతా దేశాల ప్రకటన

Hazarath Reddy

వ్యాపారానికి కీలకమైన ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య (ఆర్‌సీఈపీ–ఆర్‌సెప్‌) (Regional Comprehensive Economic Partnership) ఒప్పందంలో భారత్‌ చేరబోవడం లేదని భారత్‌ స్పష్టం చేసింది. ప్రపంచంలోనే అతి పెద్ద స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంగా పరిగణిస్తున్న ఆర్‌సీఈపీ(RCEP)లో చేరితే భారత్‌లోకి చైనా నుంచి దిగుమతులు పోటెత్తుతాయన్న ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో భారత్ తాజా నిర్ణయం తీసుకుంది.

Ayodhya Land Dispute Case: అయోధ్యలో పలు ఆంక్షలు, తీర్పుపై ఎలాంటి పోస్టులు చేయవద్దు, డిసెంబర్‌ 28 వరకు అమల్లోకి ఆంక్షలు, అన్ని ఫోన్ కాల్స్ రికార్డు, హెచ్చరికలు జారీ చేసిన యూపీ రాష్ట్ర డీజీ ఓ.పీ.సింగ్

Hazarath Reddy

వివాదాస్పద అయోధ్య కేసు విషయానికి సంబంధించి సోషల్ మీడియా(Social Media)లో రెచ్చగొట్టే పోస్టులను పెట్టి శాంతి భద్రతల సమస్యలకు కారణమయ్యేవారిపై జాతీయ భద్రతా చట్టం ప్రకారం కేసులను నమ్మోదు(Ayodhya)చేస్తామని ఉత్తరప్రదేశ్ యూపీ రాష్ట్ర డీజీ ఓ.పీ.సింగ్ హెచ్చరించారు.

ISRO Aditya-L1 Coming Soon: చంద్రయాన్-2తో కథ ముగిసిపోలేదు, ఆదిత్య ఎల్1తో సత్తా చాటుతాం, విక్రమ్‌ రోవర్ సాఫ్ట్ ల్యాండింగ్ వైఫల్యంతో ఎన్నో విషయాలు నేర్చుకున్నాం, సాఫ్ట్ లాండింగ్ ని నిజం చేసి చూపుతామన్న ఇస్రో ఛైర్మెన్ కె శివన్

Hazarath Reddy

చంద్రయాన్-2 ప్రయోగంతో సాంకేతికతపరంగా ఇస్రో ముందుకు వెళ్లిందని ఇస్రో చైర్మన్ శివన్ ధీమా వ్యక్తం చేశారు. వచ్చే కాలంలో అత్యాధునిక శాటిలైట్ లను కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నామని తెలిపారు.ఐఐటీ ఢిల్లీలో జరిగిన స్నాతకోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భవిష్యత్తులో స్టాఫ్ ల్యాండింగ్ చేసి తీరుతామని వ్యాఖ్యానించారు.

Kartarpur Corridor: వెలుగులు విరజిమ్ముతున్న కర్తార్‌పూర్‌ కారిడార్‌, అందరూ ఆహ్వానితులే అంటూ పాక్ పీఎం ఇమ్రాన్ ఖాన్ ట్వీట్, నవంబర్ 9న కర్తార్‌పూర్‌ కారిడార్‌ ప్రారంభం, అన్ని ఏర్పాట్లు పూర్తిచేసిన దాయాది దేశం

Hazarath Reddy

మరో కొద్ది రోజుల్లో కర్తార్‌పూర్‌ కారిడార్‌ ప్రారంభం కానున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ వేడులపై ఇమ్రాన్ ఖాన్ ట్విట్టర్లో అందరికీ స్వాగతం పలికారు. గురునానక్‌ 550వ జయంతి వేడుకలకు సిక్కు యాత్రికులను ఆహ్వానించేందుకు గౌరవప్రదమైన వేదిక సిద్ధంగా ఉందని కర్తార్‌పూర్‌ కారిడార్‌ను ఉద్దేశించి పాకిస్తాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ అన్నారు.

Advertisement
Advertisement