World
Google Penalty: గూగుల్‌కు మరోసారి ఎదురుదెబ్బ, రూ. 1,337 కోట్ల జరిమానా చెల్లించాల్సిందే, 30 రోజుల్లోగా ఫైన్ పూర్తిగా కట్టాలంటూ ఆదేశం, ఇంతకీ గూగుల్‌కు ఎందుకు ఫైన్ వేశారంటే?
VNSప్రముఖ ఇంటర్నెట్‌ సేవల సంస్థ గూగుల్‌కు (Google) మరోసారి గట్టి షాక్‌ తగిలింది. ఆండ్రాయిడ్‌ మొబైల్‌ డివైజ్‌ ఏకో సిస్టమ్‌ కేసునకు సంబంధించి సీసీఐ విధించిన రూ.1,337.76 కోట్ల జరిమానాపై నేషనల్‌ కంపెనీ లా అప్పిలెట్‌ ట్రిబ్యునల్‌ను (NCLAT) ఆశ్రయించిన గూగుల్‌కు అక్కడ కూడా ఎదురుదెబ్బ తగిలింది.
Earthquake in Afghanistan: వణికిస్తున్న భూకంపాలు, అఫ్గానిస్థాన్‌లో మరోసారి భూకంపం, రిక్టర్‌ స్కేలుపై దీని తీవ్రత 4.3గా నమోదు
Hazarath Reddyపొరుగుదేశం అఫ్గానిస్థాన్‌లో (Afghanistan) రెండు రోజులకే మరోసారి భూకంపం (Earthquake) వచ్చింది. బుధవారం ఉదయం 5.49 గంటలకు కాబూల్‌లో (Kabul) భూమి కంపించింది. రిక్టర్‌ స్కేలుపై దీని తీవ్రత 4.3గా నమోదయిందని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సీస్మోలలజీ (NCS) తెలిపింది. భూకంప కేంద్రం కాబూల్‌కు 85 కిలోమీటర్ల దూరంలో ఉన్నదని వెల్లడించింది.
United States: చిన్నారిపై ఆరేళ్ల పాటు వేల సార్లు అత్యాచారం, కామాంధుడికి 3 వేల ఏళ్ల జైలు శిక్ష విధించిన పెన్సిల్వేనియా కోర్టు
Hazarath Reddyఅమెరికాలోని పెన్సిల్వేనియాకు చెందిన ఓ చిన్నారిపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తికి 3,000 ఏళ్ల జైలు శిక్ష పడింది. BNO న్యూస్‌లోని ఒక నివేదిక ప్రకారం , పెన్సిల్వేనియా చైల్డ్ రేపిస్ట్ యునైటెడ్ స్టేట్స్ చరిత్రలో అత్యంత దారుణానికి ఒడిగట్టిన నిందితుల్లో ఒకరు
Mexico Fire: మెక్సికో శరణార్థి శిబిరంలో ఘోర అగ్ని ప్రమాదం, 39 మంది అక్కడికక్కడే సజీవ దహనం, మరో 29 మందికి తీవ్ర గాయాలు
Hazarath Reddyఅమెరికా సరిహద్దు( Mexico-US Border)లో మెక్సికో నగరంలో ఘోర అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. సిడెడ్ జారే(Ciudad Juarez) నగరంలోని శరణార్థి శిబిరం(Migrant Center)లో జరిగిన ప్రమాదంలో 39 మంది మృతి చెందినట్లు అంతర్జాతీయ మీడియా కథనం వెల్లడించింది.
Earthquake in Japan: జపాన్ తీరంలో తీవ్ర భూకంపం, 6.1 తీవ్రతతో కంపించిన భూమి, ఇళ్ల నుంచి బయటకు పరుగులు పెట్టిన ప్రజలు
Hazarath Reddyనివేదికల ప్రకారం, జపాన్ తీరంలో 6.1 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఉత్తర జపాన్‌లో 6.1 తీవ్రతతో భూకంపం వచ్చినట్లు స్థానిక అధికారులు తెలిపారు. జపాన్ తీరంలో భూకంపం సంభవించిన వెంటనే, పలు ప్రాంతాల్లో ప్రకంపనలు రావడంతో ప్రజలు సురక్షిత ప్రాంతాలకు పరుగులు తీశారు.
Saudi Arabia Road Accident: హజ్‌‌యాత్ర‌కు తిరిగిరానిలోకాలకు, సౌదీ అరేబియాలో ఘోర బస్సు ప్రమాదం, 20 మంది మృతి, మరో 20 మందికి గాయాలు
Hazarath Reddyసౌదీ అరేబియాలో ఘోర బస్సు ప్రమాదం (Bus accident) చోటు చేసుకుంది.హజ్‌‌యాత్ర (hajj yatra)కు వెళ్తున్న యాత్రికులతో బస్సు ప్రమాదానికి గురైంది. సౌదీ అరేబియాలోని అసిర్‌ ప్రావిన్స్‌ (province of Asir) లోగల అకాబత్‌ షార్‌ రహదారిపై సోమవారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో యాత్రికుల బస్సు ఖమీస్‌ ముషైత్‌ నుంచి అభాకు వెళ్తోంది.
Saudi Arabia Accident: సౌదీలో ఘోర రోడ్డు ప్రమాదం.. వంతెనను ఢీకొన్న బస్సు.. ఒక్కసారిగా మంటలు.. 20 మంది హజ్‌ యాత్రికుల మృతి
Rudraసౌదీ అరేబియాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హజ్‌ యాత్రికులతో వెళ్తున్న ఓ బస్సు యాసిర్‌ ప్రావిన్స్‌ ప్రాంతంలో వంతెనను ఢీకొంది. దీంతో బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 20 మంది మృతి చెందగా.. 29 మంది గాయపడ్డారు.
Kabul Suicide Blast: సూసైడ్ బాంబ్ బ్లాస్ట్‌తో వణికిన కాబూల్‌, చిన్నారి సహా ఆరుగురు పౌరులు మృతి, ఆప్ఘన్‌లో విదేశాంగ మంత్రిత్వ శాఖ సమీపంలో ఘటన
Hazarath Reddyఆఫ్ఘనిస్థాన్‌ రాజధాని కాబూల్ లో సూసైడ్ బాంబ్ బ్లాస్ట్ కలకలం రేపింది. ఆ దేశ విదేశాంగ మంత్రిత్వ శాఖ సమీపంలో జరిగిన ఈ సంఘటనలో ఆరుగురు మరణించారు. మృతుల్లో ఒక చిన్నారి కూడా ఉన్నట్లు వార్తా సంస్థలు పేర్కొన్నాయి.
Tennessee Road Accident: అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం, ఏడేండ్ల చిన్నారి సహా ఆరుగురు మృతి, మరో ఇద్దరికి తీవ్ర గాయాలు
Hazarath Reddyఅమెరికాలోని (America) టెన్నెస్సీ(Tennessee) రాష్ట్రంలోని ప్లెసెంట్‌ వ్యూ, స్ప్రింగ్‌ఫీల్డ్‌ సమీపంలో రెండు వాహనాలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఏడేండ్ల చిన్నారి సహా ఆరుగురు మృతిచెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
California Gurudwara Shooting: మళ్లీ కాల్పులతో దద్దరిల్లిన అమెరికా, సిక్కు గురుద్వారాలో కాల్పులు జరిపిన దుండగులు, ఇద్దరి పరిస్థితి విషమం
Hazarath Reddyఅమెరికాలో కాలిఫోర్నియాలోని సాక్రమెంటో కౌంటీలో ఉన్న సిక్కు గురుద్వారా కాల్పులతో దద్దరిల్లింది. నిన్న 2.30 గంటల సమయంలో తుపాకీ కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు వ్యక్తుల్లోకి బుల్లెట్లు దూసుకుపోయాయి. వీరిద్దరి పరిస్థితి విషమంగా ఉంది
Tornado in Mississippi: అమెరికాను వణికించిన టోర్నడోలు, తుపాను బీభత్సం ధాటికి 23 మంది మృతి, మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం
Hazarath Reddyఅమెరికాలో టోర్నోడోలు పెను విధ్వంసం సృష్టించాయి. మిస్సిస్సిపిలో శుక్రవారం అర్థరాత్రి బలమైన గాలులు, ఉరుములతో కూడిన తుపాను బీభత్సం సృష్టించింది. దీంతో పరిసర ప్రాంతాలన్ని చిగురుటాకులా వణికిపోయాయి. ఈ ఘటనలో దాదాపు 23 మంది దాక ప్రాణాలు కోల్పోయారు. డజన్ల కొద్ది జనాలు తీవ్రంగా గాయపడ్డారు.
Hindenburg vs Block: అదాని తర్వాత ట్విట్ట‌ర్ ఫౌండ‌ర్‌ని టార్గెట్ చేసిన హిండెన్‌బ‌ర్గ్‌, జాక్ డోర్సీ పేమెంట్స్ సంస్థ బ్లాక్ అక్రమాలకు పాల్పడిందని నివేదిక
Hazarath Reddyగౌతం అదాని సామ్రాజ్యాన్ని కుప్పకూల్చిన యూఎస్ షార్ట్ షెల్లింగ్ సంస్థ హిండెన్‌బ‌ర్గ్‌ మరో సంచలనానికి తెరలేపింది. ట్విట్ట‌ర్ ఫౌండ‌ర్ జాక్ డోర్సీని ల‌క్ష్యంగా చేసుకుని దాడికి దిగింది. జాక్ డోర్సీ (Twitter Co-Founder Jack Dorsey) ఆధ్వ‌ర్యంలోని పేమెంట్స్ సంస్థ బ్లాక్ (Block Inc) అక్ర‌మాల‌కు పాల్పడిందని నివేదికను బయటపెట్టింది.
Ronaldo Record Goal Video: రోనాల్డో ఫ్రీ కిక్ గోల్ వీడియో, ఆట ఆఖరి నిమిషంలో అద్భుతమైన గోల్‌తో పోర్చుగల్ ను గెలిపించిన దిగ్గజ ప్లేయర్
Hazarath Reddyపోర్చుగల్ UEFA యూరో 2024 క్వాలిఫైయర్స్ లో లీచ్టెన్‌స్టెయిన్‌పై 4-0 విజయంతో ప్రారంభించడంతో క్రిస్టియానో రొనాల్డో జాతీయ స్థాయి ప్రదర్శనలో మరో అద్భుతమైన ఆటను ప్రదర్శించాడు
Dima Nova Dies: సినీ ఇండస్ట్రీలో మరో విషాదం, నది దాటుతూ మంచులో కూరుకుపోయి మృతి చెందిన ప్రముఖ పాప్ సింగర్ దిమా నోవా
Hazarath Reddyరష్యా పాప్‌ సింగర్‌ సింగర్ దిమా నోవా(34) నది దాటుతూ మంచులో కూరుకుపోయి మృతి చెందారు. తన పాటలతో కుర్రకారును ఉర్రూతలూగించిన దిమా నోవా రష్యా-ఉక్రెయిన్‌ యుద్ద సమయంలో అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌పై విమర్శలు చేస్తూ పాట పాడి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాడు
Video: వీడియో ఇదిగో, స్కూలు బస్సు నడుపుతూ గుండెపోటుతో సీటులోనే కుప్పకూలిన డ్రైవర్, పరిగెత్తుకువచ్చి స్టీరింగ్ పట్టుకుని విద్యార్థుల ప్రాణాలను కాపాడిన తోటి విద్యార్థి
Hazarath Reddyసోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో స్కూల్ బస్ డ్రైవర్ బస్సు నడుపుతూ అకస్మాత్తుతా గుండెపోటుకు గురయ్యాడు. బస్సు అటూ ఇటూ ఊగుతుండటం చూసి అందులో ప్రయాణిస్తున్న విద్యార్థి వెంటనే డ్రైవర్ వద్దకు పరిగెత్తుకు వచ్చి స్టీరింగ్ కంట్రోల్ చేశాడు.
Mukesh Ambani: ఆదానిని వెనక్కి నెట్టేసిన అంబానీ, దేశంలో అత్యంత సంపన్నులలో నంబర్ వన్ గా నిలిచిన రిల్ అధినేత, దేశ సంపదలో మూడో వంతు ముంబైలోనే..
Hazarath Reddyదేశీయ అపర కుబేరుడిగా మళ్లీ ముకేశ్‌ అంబానీ నిలిచారు.గౌతమ్‌ అదానీని వెనక్కినెట్టి 82 బిలియన్‌ డాలర్లతో దేశంలో సంపన్నులలో అగ్రస్థానంలో నిలిచినట్లు హురున్‌ గ్లోబల్‌ రిచ్‌ లిస్ట్‌-2023 స్పష్టం చేసింది.
6G Mission in India: భారత్‌లో 6జీ వచ్చేస్తోంది, ఈ దశాబ్దం భారత సాంకేతిక దశాబ్దం అని తెలిపిన ప్రధాని నరేంద్ర మోదీ
Hazarath Reddyదేశం టెక్నాలజీ రంగంలో అమితవేగంతో దూసుకుపోతోంది. 5జీ సాంకేతికత అందుబాటులోకి వచ్చిన కేవలం ఆరు నెలల్లోనే 6జీ టెక్నాలజీపై పరిశోధనలు చేసే స్థాయికి భారత్‌ ఎదిగిందని ప్రధాని మోదీ ప్రకటించారు.
Ramzan Date 2023: రంజాన్ తేదీ ఫిక్స్, ఈ నెల 24 నుంచి రంజాన్ మాసం ప్రారంభం, నెలవంక కనిపించకపోవడంతో ప్రకటించిన ముస్లిం మతపెద్దలు
VNSఇస్లాం మతస్థులు అత్యంత పవిత్రంగా జరుపుకునే రంజాన్ (Ramzan) మాసం ఈ నెల 24 నుంచి ప్రారంభం కానుంది. ఇవాళ నెలవంక కనిపించకపోవడంతో మార్చిన 24 నుంచి రంజాన్ మాసం ప్రారంభమవుతుందని ఇస్లాం పెద్దలు తెలిపారు. ఈ మేరకు విజయవాడకు చెందిన ముస్లిం మతపెద్దలు ప్రకటించారు. ఇస్లామిక్ క్యాలెండర్‌లో 9వ నెల అయిన రంజాన్‌లో.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలు నెల రోజుల పాటు ఉపవాసం పాటిస్తారు.
Video: బ్రిటన్‌లో ఖలిస్తానీలకు వ్యతిరేకంగా భారత జెండా రెపరెపలు, భారతీయులతో కలిసి చిందులేసిన బ్రిటన్ పోలీస్, వీడియో ఇదిగో..
Hazarath Reddyలండన్‌లోని భారత హైకమిషన్ వెలుపల బ్రిటిష్ పోలీసులు భారతీయ మద్దతుదారులతో కలిసి నృత్యం చేస్తున్నారు. ఖలిస్తానీలకు వ్యతిరేకంగా, భారత జెండాకు మద్దతుగా భారతీయ హైకమిషన్ వెలుపల భారతీయులు గుమిగూడారు. ఈ నేపథ్యంలో అక్కడ భారతీయులు డ్యాన్స్ చేస్తుండగా వారితో బ్రిటన్ పోలీసు స్టెప్పులు కదిపారు.
Jobs in AI: ఈ కోర్సు నేర్చుకుంటే 45 వేల ఉద్యోగాలు రెడీగా ఉన్నాయి, ఫ్రెషర్లు రూ.14 లక్షల వార్షిక వేతనం పొందే అవకాశం
Hazarath Reddyభారతదేశంలో ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)లో 45,000 ఓపెన్ ఉద్యోగాలు ఉన్నాయని, ఫ్రెషర్లకు వార్షిక వేతనాలు రూ. 10 నుండి రూ.14 లక్షల వరకు ఉన్నాయని కొత్త నివేదిక వెల్లడించింది.