Gas Explosion in China: రెస్టారెంట్లో గ్యాస్ సిలిండర్ పేలుడు, 31 మంది మంటల్లో సజీవ దహనం, మరో ఏడుగురి పరిస్థితి విషమం, చైనాలో విషాద ఘటన
చైనాలో ఓ రెస్టారెంట్‌లో గ్యాస్ సిలిండర్ పేలి 31 మంది అక్కడిక్కడే దుర్మరణం పాలయ్యారు. మరో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉండగా.. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల్లో ఎక్కువ మంది పండుగ సెలవులకు బంధువుల ఇళ్లకు వచ్చిన వాళ్లే గమనార్హం.
చైనాలో ఓ రెస్టారెంట్‌లో గ్యాస్ సిలిండర్ పేలి 31 మంది అక్కడిక్కడే దుర్మరణం పాలయ్యారు. మరో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉండగా.. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల్లో ఎక్కువ మంది పండుగ సెలవులకు బంధువుల ఇళ్లకు వచ్చిన వాళ్లే గమనార్హం. నార్త్‌వెస్ట్రన్ నగరం ఇంచువాన్‌లో బుధవారం సాయంత్రం ఈ ఘోర ప్రమాదం చోటుచేసుకుంది.
రెస్టారెంట్ జనాలతో కిక్కిరిసిపోయిన టైంలో రెస్టారెంట్‌లోని గ్యాస్ సిలిండర్ లీక్ అయ్యి.. ఒక్కసారిగా పేలుడు సంభవించింది. మంటలు భారీగా ఎగసిపడడంతో 31 మంది అగ్నికి ఆహుతయ్యారు. ఘటనపై అధ్యక్షుడు జీ జింగ్‌పిన్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు అండగా ఉంటామని, ప్రజా భద్రతే తమ ప్రథమ ప్రాధాన్యత అంటూ ఒక ప్రకటన విడుదల చేశారు.
Video
BREAKING: Gas explosion rips through restaurant in northern China, killing at least 31 people pic.twitter.com/X8lBqh5qCE
— BNO News (@BNONews) June 22, 2023
(The above story first appeared on LatestLY on Jun 22, 2023 02:02 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

