Skyscraper in Flames: చైనాలో భారీ అగ్నిప్రమాదం, కాలి బూడిదైన 42 అంతస్తుల భవనం, పూర్తిగా పొగమయమైన చాంగ్షా నగరం, ప్రాణాపాయం తప్పిందని ప్రకటించిన చైనా
చైనాలో (China) భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సెంట్రల్ చైనా సిటీ అయిన చాంగ్షాలోని (Changsha), హునాన్స్ ప్రావిన్స్‌లో ఉన్న ఒక భారీ బిల్డింగులో (High-rise) శుక్రవారం మధ్యాహ్నం మంటలు చెలరేగాయి. 42 అంతస్తులు కలిగిన, అత్యంత ఎత్తైన ఈ బిల్డింగులో మంటలు అంటుకోవడంతో, ఈ మంటల నుంచి వెలువడుతున్న పొగ ఆకాశాన్ని తాకింది.
Changsha, SEP 16: చైనాలో (China) భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సెంట్రల్ చైనా సిటీ అయిన చాంగ్షాలోని (Changsha), హునాన్స్ ప్రావిన్స్‌లో ఉన్న ఒక భారీ బిల్డింగులో (High-rise) శుక్రవారం మధ్యాహ్నం మంటలు చెలరేగాయి. 42 అంతస్తులు కలిగిన, అత్యంత ఎత్తైన ఈ బిల్డింగులో మంటలు అంటుకోవడంతో, ఈ మంటల నుంచి వెలువడుతున్న పొగ ఆకాశాన్ని తాకింది. ఈ బిల్డింగులో ప్రభుత్వానికి చెందిన టెలికాం కార్యాలయం (Telecom Office) కొనసాగుతోంది. ఈ ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఈ ప్రమాదంలో బిల్డింగులోని దాదాపు అన్ని ఫ్లోర్లు మంటల్లో చిక్కుకున్నాయి.
This afternoon, the building of China Telecom building in Changsha长沙caught fire, no casualties reported yet, stay safe everyone! 🙏 pic.twitter.com/QNnezk2Mxk
— China in Pictures (@tongbingxue) September 16, 2022
అయితే, అగ్ని ప్రమాదంలో (Fire) ఎవరూ మరణించలేదని అధికారులు తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక దళం, సహాయక సిబ్బంది రక్షణ చర్యలు కొనసాగిస్తున్నారు. ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా (Viral) మారాయి.
(The above story first appeared on LatestLY on Sep 16, 2022 11:12 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

