Auckland, JAN 25: న్యూజిలాండ్ కొత్త ప్రధానిగా క్రిస్ హిప్‌కిన్స్ (Chris Hipkins) ఎన్నికయ్యారు. దేశ 41వ ప్రధానిగా క్రిస్ బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. లేబర్ పార్టీ తరఫున ప్రధాని పదవికి క్రిస్ (Chris Hipkins) ఒక్కడే పోటీ పడగా, పార్టీ ఆయనను ప్రధాని అభ్యర్థిగా ఎన్నుకుంది. 44 ఏళ్ల క్రిస్ గతంలో కోవిడ్ నియంత్రణ విభాగాన్ని పర్యవేక్షించడంతోపాటు, పోలీస్ మినిస్టర్‌గా కూడా పని చేశారు. న్యూజిలాండ్ ప్రధానిగా (New Zealand PM) కొనసాగిన జాసిండా అర్డెర్న్ (Jacinda) ఇటీవలే తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఆమె పదవీ కాలం ఈ ఏడాది అక్టోబర్‌తో ముగియాల్సి ఉంది. తన పదవికి న్యాయం చేయలేకపోతున్నానని, ఈ క్రమంలోనే ప్రధాని పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఆమె వెల్లడించారు. దీంతో నూతన ప్రధాని అభ్యర్థి కోసం లేబర్ పార్టీ ప్రయత్నించింది. ఈ పదవికి క్రిస్ పోటీపడగా, ఆయనను ఎన్నుకుంది.
LIVE: Chris Hipkins is sworn in as New Zealand's Prime Minister following resignation of Jacinda Ardern https://t.co/iCWGpw3nq6
— Reuters (@Reuters) January 24, 2023
ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం క్రిస్ మాట్లాడుతూ దేశాన్ని ఆర్థికంగా పటిష్టంగా ఉంచేందుకు ప్రయత్నిస్తానని చెప్పాడు. దేశం ఎదుర్కొంటున్న ద్రవ్యోల్బణం, గృహ ధరల పెరుగుదలతోపాటు శాంతి భద్రతలపై ప్రధానంగా దృష్టి సారిస్తానని చెప్పాడు. క్రిస్ పదవీ కాలం ఈ అక్టోబర్‌తో ముగుస్తుంది. అక్టోబర్ 14న అక్కడ సార్వత్రిక ఎన్నికలు జరుగుతాయి. దీంతో మళ్లీ నూతన ప్రభుత్వం కొలువుదీరుతుంది. రాబోయే ఎన్నికల్లో కూడా లేబర్ పార్టీయే విజయం సాధిస్తుందని ఆ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
క్రిస్ మొదటిసారిగా 2008లో పార్లమెంట్‌కు ఎన్నికయ్యారు. అప్పటి నుంచి వివిధ హోదాల్లో పని చేశారు. రెండేళ్ల క్రితం దేశంలో కోవిడ్ సమస్య ఎదురైనప్పుడు ఈ సమస్యను ఎదుర్కోవడంలో క్రిస్ పని తీరు అందరినీ ఆకర్షించింది.