London, JAN 25: ప్రముఖ మైక్రో బ్లాంగ్ ప్లాట్‌ఫామ్ ట్విట్టర్ కారణంగా కంపెనీ సీఈవో ఎలాన్ మస్క్ (Elon Musk) మరోసారి వార్తల్లో నిలిచారు. యూకే, అమెరికాలోని ట్విట్టర్ కార్యాలయాలకు (Twitter offices) అద్దె చెల్లించడంలో ప్రపంచ కుబేరుడు విఫలమయ్యాడు. ఈ క్రమంలో యూఎస్‌లోని శాన్ ఫ్రాన్సిస్కో ప్రధాన కార్యాలయానికి ట్విట్టర్ దాదాపు 3.42 మిలియన్ల అద్దెను చెల్లించాల్సి ఉంది. డిసెంబర్, జనవరి నెలలకు సంబంధించిన అద్దెను ట్విట్టర్ చెల్లించలేదు (non-payment of rent). దీంతో శ్రీ నైన్ మార్కెట్ స్క్వేర్ ఎల్‌ఎల్‌సీ, ట్విట్టర్ కంపెనీతో పాటు యజమానిపై చట్టపరమైన చర్యలకు ఉపక్రమించింది. ఇందులో భాగంగా కాలిఫోర్నియాలోని స్టేట్ కోర్టులో సోమవారం దావా వేసింది. సెక్యూరిటీ మొత్తంగా ట్విట్టర్ నుంచి తీసుకున్న లెటర్ ఆఫ్ క్రెడిట్ (Line of credit) నుంచి నెల అద్దె మొత్తాన్ని తీసుకున్నామని, ఇంకా 3.42 మిలియన్ డాలర్లు అద్దె రావాల్సి ఉందని దావాలో కంపెనీ పేర్కొంది.
మరో వైపు లండన్‌లోని క్రౌన్ ఎస్టేట్ సైతం పికాడిల్లీ సర్కస్ సమీపంలో ఉన్న టిట్టర్ కార్యాలయానికి సంబంధించి రెండు నెలల అద్దె చెల్లించడం లేదంటూ చట్టపరమైన చర్యలు ప్రారంభించింది. ఎలాన్ మస్క్ ట్విట్టర్ బాధ్యతలు చేపట్టి దాదాపు మూడు నెలలవుతుంది.
ఇప్పటికే కంపెనీ నుంచి భారీగా ఉద్యోగులను తొలగించాడు. అలాగే ప్రపంచంలోనే ధనవంతుల జాబితాలో రెండో జాబితాలోకి పడిపోవడంతో పాటు ట్విట్టర్ (Twitter) కార్యాలయాలకు సంబంధించి అద్దెను చెల్లించడం మానేడు. ఇప్పటికే తొలగించిన ఉద్యోగులు ఎలాన్ మస్క్‌పై కోర్టుకెక్కారు. తాజాగా అద్దె చెల్లించకపోవడంతో ఆయా కంపెనీలు సైతం కోర్టు తలుపుతట్టడం తలనొప్పిగా మారింది. ట్విట్టర్‌ను టేకోవర్‌ను చేసేందుకు తీసుకున్న 12.5 బిలియన్ డాలర్ల రుణానికి సంబంధించి జనవరిలో మొదటి వాయిదా చెల్లించాల్సి ఉంది. ఈ క్రమంలోనే అద్దె చెల్లించలేదంటూ కంపెనీలు కోర్టుకెక్కడం గమనార్హం.