New York, March 11: ట్విటర్ (Twitter)ను కొనుగోలు చేసి సంచలనాత్మక నిర్ణయాలు తీసుకునన్న ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ (Elon Musk)సిలికాన్ వ్యాలీ బ్యాంక్ (Silicon Valley Bank) కొనుగోలుకు సిద్ధమయ్యారు. యూఎస్ రెగ్యులేటర్లు సిలికాన్ వ్యాలీ బ్యాంక్ (ఎస్‌వీబీ) ను మూసివేస్తున్నామని అధికారింగా ప్రకటించింది. అనంతరం ఆ బ్యాంక్ సంబంధించిన ఆస్తుల్ని సీజ్ చేసింది. దీంతో 2008 ఆర్థిక సంక్షోభం తర్వాత అతిపెద్ద బ్యాంకు వైఫల్యంగా ఇది నమోదైంది. ఇది ప్రపంచ మార్కెట్లను కుదిపేసింది. కంపెనీ బిలియన్ డాలర్లను పోగొట్టుకుంది. కాగా సిలికాన్ వ్యాలీ బ్యాంక్ కాలిఫోర్నియా, మసాచుసెట్స్ లో 17 శాఖలతో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో 16 అతి పెద్ద బ్యాంకుగా ఉంది. ఈ బ్యాంక్‌ను నియంత్రణ సంస్థలు మూసివేయడంతో పాటు ఆస్తులను జప్తు చేయడంతో ఈ బ్యాంకు మాతృ సంస్థ ఎస్‌వీబీ ఫైనాన్షియల్ గ్రూప్ షేరు దాదాపు 60 శాతం హాంఫట్ అయిపోయాయి.
అటువంటి బ్యాంకు మూసివేత గందరగోళ పరిస్థితుల మధ్య అమెరికా గ్లోబల్ గేమింగ్ హార్డ్‌వేర్ మ్యానిఫ్యాక్చరింగ్ కంపెనీ రేజర్ సీఈవో మిన్ లియాంగ్ టాన్ (Min-Liang Tan)ట్విట్టర్ వేదికగా సూచించారు. ట్విటర్‌ను కొనుగోలు చేసినట్లు ఎస్‌వీబీని కొనుగోలు చేసి డిజిటల్ బ్యాంక్‌గా మార్చమని అన్నారు. ఇక్కడ ఆసక్తికర విషయం ఏమంటే అని ట్వీట్ కు ట్విట్టర్ సీఈవో ఎలన్ మస్క్ స్పందిస్తూ.. ఎస్‌వీబీని కొనుగోలు చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానని అర్ధం వచ్చేలా ‘నేను ఈ ఆలోచనలకు సిద్ధంగా ఉన్నా’అంటూ ట్విట్ చేశారు.
I think Twitter should buy SVB and become a digital bank.
— Min-Liang Tan (@minliangtan) March 11, 2023
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న టెక్ స్టార్టప్‌లలో పెట్టుబడులు పెట్టడంలో ప్రసిద్ధి చెందిన సిలికాన్ వ్యాలీ బ్యాంక్‌ను షట్‌డౌన్ చేస్తున్నట్లు యూఎస్ రెగ్యులేటరీ ప్రకటించింది. ఈ ప్రకటనతో ఎస్‌వీబీకి చెందిన 60 శాతం షేర్లు భారీగా పతనమయ్యాయి. దీంతో ఈ మూసివేతను యూఎస్ రెగ్యులేటరీ ఫెడరల్ డిపాజిట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్(FDIC)ని రిసీవర్‌గా కూడా పేర్కొంది.