Moscow, March 24: రష్యా రాజధాని మాస్కోలో (Moscow) క్రాకస్ సిటీ హాల్‌లో చోటుచేసుకున్న మారణహోమంలో మృతుల సంఖ్య శనివారం 133కు పెరిగింది. శుక్రవారం అర్ధరాత్రి సంగీత కచేరి జరుగుతుండగా (Moscow Terror Attack) ముష్కరులు విచక్షణారహితంగా కాల్పులు జరిపి అమాయక ప్రజల ప్రాణాలను బలి తీసుకోవడం తెలిసిందే. ఈ దారుణంలో 120 మందికి పైగా గాయపడ్డారు. వారిలో చాలామంది తీవ్ర గాయాలతో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. అయితే ఈ దాడికి సంబంధించిన వీడియోను ఐసిస్ (ISIS) విడుదల చేసింది. క్రాకస్ సిటీ హాల్ లోకి ముష్కరులు ప్రవేశించన తర్వాత వారు సృష్టించిన మారణహోమాన్ని బాడీ కెమెరాల్లో బందించారు. దీనికి సంబంధించిన క్లిప్పింగ్స్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ముష్కరుల ఫేస్ బ్లర్ చేసిన ఈ వీడియోలో ప్రజల్ని హెచ్చరిస్తున్న దృశ్యాలు ఉన్నాయి.
NEW: ISIS has released footage of the concert hall massacre that killed at least 130 people in Moscow.
The footage was taken by the men who carried out the attack.
According to United States officials, the U.S. warned Moscow that a terror attack was imminent however Putin… pic.twitter.com/8jRJI88S6T
— Collin Rugg (@CollinRugg) March 23, 2024
మాస్కో మారణహోమానికి సంబంధించి 11 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. వీరిలో నలుగురు దాడిలో ప్రత్యక్షంగా పాల్గొన్నారని రష్యా ఇన్వెస్టిగేటివ్ కమిటీ వెల్లడించింది. వారిని పారిపోతుండగా పశి్చమ రష్యాలోని బ్రియాన్‌స్‌్కలో ఉక్రెయిన్ సరిహద్దు సమీపంలోనే బంధించినట్లు తెలిపింది. సరిహద్దు దాటి ఉక్రెయిన్ చేరాలన్న పన్నాగాన్ని భగ్నం చేసినట్లు స్పష్టం చేసింది.