Hamas Terrorist Tunnel: గాజాలోని అతిపెద్ద ఆస్పత్రి అయిన అల్-షిఫా కింద పెద్ద సొరంగాన్ని (Hamas Terrorist Tunnel) కనుగొన్నట్లు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ ప్రకటించింది. దీనికి సబంధించిన ఫొటోలు, వీడియోలను శుక్రవారం విడుదల చేసింది. ‘‘ఆస్పత్రిలోని ( Al-Shifa Hospital Complex in Gaza) హమాస్ సొరంగం నెట్‌వర్క్‌ను గుర్తించాం’’ అని ఇజ్రాయెల్ సైన్యం ఓ ప్రకటన విడుదల చేసింది. కాగా బుధవారం తెల్లవారుజామున తొలిసారి అల్-షిఫా ఆస్పత్రిలో ఇజ్రాయెల్ ప్రత్యేక దళాలు తనిఖీలు చేపట్టాయి.
తర్వాత ఎమ్మారై గదిలో భారీగా ఆయుధాలను గుర్తించాయి. అనంతరం నేడు సొరంగాన్ని కనుగొన్నారు. ఈ సొరంగం మూతను హమాస్ దళాలు కాంక్రీట్‌తో సీల్ చేసినట్లు ఉంది. దీనిలోకి వెళ్తున్న పైపులు, కేబుల్స్ స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీనికి తోడు అక్కడ ఆయుధాలు దాచిన ప్రాంతంలో పేలుడు పదార్థాలతో ఓ ఉచ్చును అమర్చిన కారును అడ్డంపెట్టినట్లు తాము గుర్తించామన్నారు. ఇక తమ ఇంజినీర్లు టన్నెల్ నెట్‌వర్క్‌ను బయటపెట్టడానికి తీవ్రంగా యత్నిస్తున్నట్లు ఇజ్రాయెల్ అధికారులు వెల్లడించారు.
గాజా సిటీలో ఉన్న షిఫా ఆస్పత్రికి ఈ టన్నెల్‌నే దారిగా హమాస్ వాడుతున్నట్లు ఐడీఎఫ్ పేర్కొన్నది. హాస్పిటల్ కాంప్లెక్స్‌లో ఉన్న బిల్డింగ్‌ల మధ్య ఆ టన్నెల్ ఎంట్రెన్స్ ఉన్నట్లు ఐడీఎఫ్ గుర్తించింది. టన్నెల్‌కు సమీపంలో ఉన్న ఓ ఆయుధాల ట్రక్కును గుర్తించారు. అక్టోబర్ 7వ తేదీన జరిగిన దాడిలో ఆ ఆయుధాలు వాడినట్లు భావిస్తున్నారు.
Here's Video
Exposing another layer of Hamas’ exploitation of three of the largest hospitals in Gaza:
🔻Inside the Shifa Hospital complex, a Hamas terrorist tunnel was uncovered.
1/3 pic.twitter.com/uGo4uBdTly
— Israel Defense Forces (@IDF) November 17, 2023
గాజాలో ఉన్న అల్ రంతిసి అనే మరో ఆస్పత్రి వద్ద ఉన్న టన్నెల్‌ను కూడా ఐడీఎఫ్ దళాలు గుర్తించాయి. ఆ ఫోటోలను కూడా రిలీజ్ చేశారు. అల్ కుద్స్ ఆస్పత్రి నుంచి భారీ మొత్తంలో ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఆస్పత్రులు, ఆస్పత్రుల కింద ఉన్న టన్నెల్స్ ద్వారా హమాస్ ఆపరేట్ చేస్తున్నట్లు ఇజ్రాయిల్ పేర్కొన్నది. అమెరికా వద్ద ఈ ఆరోపణకు చెందిన ఆధారాలు కూడా ఉన్నట్లు తెలిపింది.
ఇజ్రాయెల్ నుంచి కిడ్నాప్ చేసిన బందీలను అల్-షిఫా ఆస్పత్రిలో ఉంచినట్లు తమ వద్ద బలమైన ఆధారాలున్నాయని ఆ దేశ ప్రధాని నెతన్యాహు ప్రకటించారు. తమ సైన్యం దానిపై ఆపరేషన్ మొదలుపెట్టడంతో ప్రస్తుతానికి వారిని అక్కడి నుంచి వేరే స్థావరానికి తరలించారని ఆయన పేర్కొన్నారు. కొన్ని రోజుల కిందటి వరకూ హమాస్ అక్కడ కార్యకలాపాలను నిర్వహించిందని తెలిపారు.
ఆ వైద్యశాలలోకి తమ దళాలు అడుగుపెట్టడానికి అదే ప్రధాన కారణమని ప్రధాని తెలిపారు. బందీలకు సంబంధించి తమ ప్రభుత్వం వద్ద కీలకమైన ఇంటెలిజెన్స్ ఉందని.. ఆ వివరాలను తాము బహిర్గతం చేయలేమని పేర్కొన్నారు. తమ బలగాలు ఆస్పత్రిలో కచ్చితమైన లక్ష్యాలపైనే దాడులు చేస్తున్నాయని అన్నారు. హమాస్‌తో కాల్పుల విరమణ ఒప్పందంపై నెతన్యాహు స్పందిస్తూ గ్రౌండ్ ఆపరేషన్ విజయవంతంగా కొనసాగుతోందని.. హమాస్ కాల్పుల విరమణ ప్రకటించేలా ఒత్తిడి పెంచుతున్నామని వెల్లడించారు. పాలస్తీనాలో నాయకత్వ మార్పు అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.