Mass Shooting At Lewiston (PIC@ ANI X)

New York, OCT 26: అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం (Mass Shooting) చోటు చేసుకుంది. దుండగుడు జరిపిన కాల్పుల్లో 22 మంది మరణించగా.. మరో 50 మందికిపైగా గాయాలయ్యాయి. బుధవారం అర్థరాత్రి దాటిన తరువాత మైనేలోని లెవిస్టన్ (Lewiston) నగరంలో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. దుండగుడు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. వారిని చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రులకు తరలించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.

 

ఆండ్రోస్కోగ్గిన్ కౌంటీ షెరీఫ్ పోలీస్ కార్యాలయం వారి ఫేస్ బుక్ పేజీలో అనుమానితుడి రెండు ఫొటోలను విడుదల చేశారు. ఫొటోలో పొడవాటి చేతుల చొక్కా, జీన్స్ ధరించిన, గడ్డం ఉన్నవ్యక్తి కాల్పులు జరుపుతున్నట్లు ఉంది. అయితే, ఆండ్రోస్కోగ్గిన్ కౌంటీ పెరీఫ్ కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. మేము ఈ దారుణ ఘటనపై (Mass Shooting At Lewiston) దర్యాప్తు చేస్తున్నాము. అన్ని వ్యాపారాలను వారి స్ంస్థలను మూసివేయాలని సూచించారు. మైనే డిపార్ట్ మెంట్ ఆఫ్ పబ్లిక్ సేప్టీ ప్రతినిధి ప్రజలను తలుపులు మూసి తమ ఇళ్లలోనే ఉండాలని కోరారు. లెవిస్టన్ లోని సెంట్రల్ మైనే మెడికల్ సెంటర్ భారీ ప్రాణ నష్టం జరిగిందని ఒక ప్రకటన విడుదల చేసింది.