Lahore, DEC 17: పాకిస్తాన్ లో సోషల్ మీడియా ఫ్లాట్ ఫాం లను నిలిపివేస్తూ (shuts down) కీలక నిర్ణయం తీసుకుంది అక్కడి ప్రభుత్వం. మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు అనుకూలంగా (supporters of Imran Khan) సోషల్ మీడియాలో వేలాదిగా పోస్టులు వస్తుండటంతో ఈ నిర్ణయం తీసుకుంది. సామాజిక మాధ్యమాలు ఎక్స్(ట్విట్టర్) (X), ఫేస్ బుక్ (Facebook), ఇన్ స్టాగ్రామ్(Instagram), యూట్యూబ్ (YouTube) లను నిలిపివేశారు.
BREAKING: Pakistan shuts down access to X, Facebook, Instagram and YouTube amid online rally by supporters of Imran Khan
— The Spectator Index (@spectatorindex) December 17, 2023
ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ఇమ్రాన్ కు అనుకూలంగా వేలాది పోస్టులతో ఆన్ లైన్ ర్యాలీ (online rally) నిర్వహించారు పీటీఐ కార్యకర్తలు. దీంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి.