Happy Birthday Jagan: జగన్ మోహన్ రెడ్డి పుట్టిన రోజు, సోషల్ మీడియాను ఊపేస్తున్న #HBDYSJagan హ్యాష్ ట్యాగ్, వెల్లువెత్తుతున్న జన్మదిన శుభాకాంక్షలు
CM YS Jagan (Photo-Twitter/APCMO)

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి పుట్టిన రోజు నేడు. సోషల్ మీడియా వేదికగాను ప్రముఖులంతా జగన్ కు శుభాకాంక్షలు చెబుతున్నారు.ఈ నేపథ్యంలోనే ఎక్స్ (ట్విట్టర్) లో #Andhrapradesh, #HBDYSJagan హ్యాష్ ట్యాగ్ లు ట్రెండ్ అవుతున్నాయి. ప్రముఖులంతా ఏపీ ముఖ్యమంత్రికి ఈ హ్యాష్ ట్యాగ్ ద్వారా శుభాకాంక్షలు చెబుతున్నారు. వీడియోలతో హోరెత్తిస్తున్నారు.

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ ద్వారా సీఎం జగన్‌ను విష్ చేశారు. సీఎం జగన్ ఆయురారోగ్యాలతో, సంతోషంగా ఉండాలని ప్రధాని ఆకాంక్షించారు.అలాగే ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ కూడా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి హృదయపూర్వకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.

జగనన్న విదేశీ విద్యాదీవెన, అర్హులైన 390 మంది విద్యార్థులకు రూ.41.59 కోట్లు విడుదల చేసిన సీఎం జగన్, ఆయన ఏమన్నారంటే..

సీఎం జగన్‌ పుట్టిన రోజు పురస్కరించుకుని గురువారం రెండు తెలుగు రాష్ట్రా­లతో పాటు ఇతర రాష్ట్రాలు, విదేశాల్లో భారీఎ­త్తున సేవా కార్యక్రమాలను వైఎ­స్సార్‌సీపీ శ్రేణులు చేపట్టాయి. ఇందులో భాగంగా రాష్ట్రంలోని అన్ని నియో­జకవర్గాల్లో మొక్కలు నాటడంతో పాటు అన్న­దానం, వస్త్రదానాలు చేస్తున్నారు. ఆస్పత్రుల్లో రోగులకు పండ్లు పంపిణీ చేస్తున్నారు. రక్తదాన శిబిరాలు కూడా రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు.