ఫిలిప్పీన్స్ దేశంలోని పసిఫిక్ మహాసముద్రంలో ప్రయాణిస్తున్న ఓ నౌకలో గురువారం జరిగిన అగ్నిప్రమాదంలో దాదాపు 31 మంది మృతిచెందారు. పదుల సంఖ్యలో ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో, రంగంలోకి దిగిన రెస్క్యూ టీమ్ సముద్రంలో సహాయక చర్యలు చేపట్టింది. లేడీ మేరీ జాయ్-3 నౌక మిండానావో ద్వీపంలోని జాంబోంగా సిటీ నుంచి సులు ప్రావిన్స్‌లోని జోలో ద్వీపానికి బుధవారం అర్ధరాత్రి(భారత కాలమానం ప్రకారం) అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది.ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని వెల్లడించారు.
మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందన్నారు.నౌకలో అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే ప్రయాణికులు నీటిలో దూకేశారని అన్నారు. ప్రమాద సమయంలో నౌకలో 250 మంది ప్రయాణికులు ఉన్నట్టు స్పష్టం చేశారు. ప్రమాదం తర్వాత ఫిలిప్పీన్ కోస్ట్ గార్డ్, మత్స్యకారులు కలిసి 195 మందిని కాపాడినట్టు వెల్లడించారు.
Here's Video
At least 12 people died and 230 were rescued after a fire engulfed a ferry in the southern Philippines 🇵🇭, authorities said Thursday
14 people were injured and 7 were still missing
It was not clear how the fire startedhttps://t.co/gzvJ1VHBPh pic.twitter.com/empiJAOAEi
— Saad Abedine (@SaadAbedine) March 30, 2023
కాగా, మృతుల్లో మహిళలు, చిన్నారులు కూడా ఉన్నారని తెలిపారు. కాగా, అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు.